పవన్ కళ్యాణ్.........ఒక పచ్చి నిజం


         ఒక పార్టి పెట్టి నడపాలంటే చాలా డబ్బులు కావాలి. మొన్న డెక్కన్ క్రానికల్లో వచ్చినట్టు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టటం మొదలుపెట్టి తరువాత ఫండ్స్ వస్తాయనుకుంటే, అనుకున్నట్టు ఫండ్స్ రాలేదు. దాంతో తనదగ్గర వున్న డబ్బంతా ఖర్చుపెట్టేస్తూ పోయారు.


ఎందుకు అనుకున్నంత ఫండ్స్ రావడం లేదేంటి అని మనం అవగాహన చేసుకుంటే, ఇప్పుడు నడుస్తున్న రాజకీయ పార్టీల గురించి అవగాహన వస్తుంది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఇస్తే దానికి నాలుగువంతులు సంపాదించుకోవచ్చు అనేదే వాళ్ళ ఆలోచన, నిజం కూడా అదే.
కాని జనసేన అలా కాదు కాబట్టీ, పవన్ కళ్యాణ్ ఆలాంటివి చెయ్యని రాజకీయ నేత కాబట్టి, జనసేనకి ఎవ్వరూ అనుకున్నంత విరాళాలు ఇవ్వడం లేదు.


ఇతను మన కోసం రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి, మనం అంటే సామాన్యులం. మనం చేయూతనివ్వకపోతే ప్రజల కోసం పోరాడే రాజకీయ నాయకులు ఇక రారు.

మన కోసం మన తరుపున పోరాడే వ్యక్తి కి మనకి చేతనైన సాయంచెయ్యడం మన ధర్మం. మన భవిష్యత్ కోసం ఇలా చేస్తే బాగుంటుంది.

 మనిషికి కనీసం 100 రూపాయల నుండి ఎంత విరాళం ఇవ్వగలిగితే అంత నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా చెక్స్ రూపంలో గాని చెయ్యొచ్చు. ఈ లింకుని క్లిక్ చేయండి.

https://janasenaparty.org/donations

 వీలుంటే 10 మందికి ఈ విషయం చెప్పి వాళ్ళు కూడా విరాళం ఇచ్చేలా చూద్దాం.

ఇదే మన భవిష్యత్తుకి మనం వేసుకునే పునాది. రండి మంచి రాజకీయనాయకుడ్ని ప్రోత్సహిద్దాం.

అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, తమ్ముడు, అన్నయ్య అందరూ రండి, మనం పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయితేనే ఇవ్వాలి అనుకోకండి. మనకోసం అన్ని వదులుకుని రోడ్లమీద తిరుగుతున్నాడు, అంతకన్నా సాక్షం ఏం కావాలి.

జీవితంలో ఒక సినిమా టిక్కట్టు ఖర్చు మన భవిష్యత్తు కోసం వాడదాం రండి.
ఇట్లు
ఇవన్ని మనకెందుకులే అని బ్రతికేసిన ఒక సామాన్యుడు

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్