Posts

Showing posts from March, 2019

జనసేనాని ఇంటర్వ్యూ

Image
కేసీఆర్‌ రిటర్న్‌గిఫ్టు.. చంద్రబాబుకు గిఫ్టు కావొచ్చు కావాలనుకుంటే కేసీఆరే పోటీ చేయొచ్చు కదా..! కేసుల భయంతో జగన్‌ కేంద్రానికి లొంగి నోరెత్తడం లేదు కాంగ్రెస్‌కు మారు రూపమే వైకాపా అనుభవజ్ఞుడని చంద్రబాబుకు మద్దతిస్తే.. దోపిడీకి ఉపయోగపడింది వైకాపా, తెదేపాలతో పొత్తులపై నా మీద ఒత్తిళ్లొచ్చాయి ఆ రెండు పార్టీలకు జనసేన సమాన దూరం తక్కువ అవినీతి, ఎక్కువ పారదర్శకత ఉన్న వారికే ఓటు వెయ్యాలి ‘ఆంధ్రా రాజకీయాల్లోకి కేసీఆర్‌ రావాలనుకుంటే నేరుగా వచ్చి ఎన్నికల్లో పోటీ చెయ్యాలి. చంద్రబాబుకు ‘రిటర్న్‌ గిఫ్టు’ ఇస్తామంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అది ఆయనకు గిఫ్టు కావొచ్చన్న అభిప్రాయం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్వేషాలు తొలగి సుహృద్భావ వాతావరణం ఏర్పడాలనేదే నా అభిమతం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘ఆంధ్రా పెత్తందార్లు వద్దంటూ ఉద్యమం చేసి.. తిరిగి వారినే పెంచు

ఇది ఎప్పుడూ షియం షియం అవ్వాలనే ఒక అవినీతి చక్రవర్తి కథ

ఓపిక చేసుకొని చదవండి.... 25 నిమిషాలు పోయినా పర్వాలేదు.. 25 సంవత్సరాల భవిష్యత్తు కనబడుతుంది.......  ఇది ప్రతి తెలుగు వారు తెలుసుకొని, తెలియని వారికి తెలియజేయాలి. మిగిలిన ప్రముఖుల ఛండాలమయిన చరిత్ర అతి త్వరలో ఇస్తాను. వైస్సార్సీపీ వాళ్ళు అందరిని నేను అడగడలుసుకున్న ప్రశ్నలు...వైస్సార్సీపీ గురించి... మీరు సమాధానాలు చెబుతారో... లేక జగన్ అన్న సమాధానాలు చెబుతారో చెప్పండి.... నా 118 ప్రశ్నలకి సమాధానం కావాలి... ఎవరు చెప్పినా పర్లేదు... *✍జగన్మోహన్ రెడ్డి విశృంఖలమైన నీ అవినీతిపై అడిగే ఈ ప్రశ్నలకి వీటికి సమాధానం చెప్పే దమ్ముందా!* 1. ఒకప్పుడు అప్పుల్లో ఉన్న నీ కుటుంబం, అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మడానికి అప్పటి సి.ఎం కు లేఖ రాసిన నీ కుటుంబం, ఇప్పుడు దేశం లోనే ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించే విధం గా ఎలా ఎదిగింది? ఆ కిటుకు చెపితే ప్రజలు కూడా నిన్నే అనుసరిస్తారు, అప్పుడు సంక్షేమ పధకాలు కూడా అవసరం లేదు, నీ లాగా శాశ్వత అభివృద్ధి కావాలి. ఇంత తెలివి ఉంటే నిన్ను బిజినెస్ స్కూల్స్ లో పాఠాలు చెప్పడానికి పిలవరెందుకు? 2. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే నువ్వు, నీ పైన ఉన్న అక్రమాస్తుల కే

పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా.. భీమవరం సెంటిమెంట్ గురించి తెలుసా!

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు సిసలైన రాజకీయ పరీక్షని ఎదుర్కోబోతున్నాడు. జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌పై ద్రుష్టి పెట్టాడు. జనసేన పార్టీ తపుపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన గత కొన్నిరోజులుగా జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పొటీ చేయబోతున్నారు.       ఆ నియోజకవర్గాలు ఇవే:  పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ముందు నుంచి విశాఖ జిల్లా గాజువాక పేరు బలంగా వినిపిస్తోంది. గాజువాక నుంచి పవన్ బరిలో దిగడం ఖరారయింది. గాజువాకతో పాటు భీమవరంలో కూడా పవన్ పోటీ చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. తొలిసారి పవన్ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో సినీ రాజకీయ వర్గాల్లో గాజువాక, భీమవరం గురించి చర్చ మొదలయింది.   పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్:  ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైసీపీ,

పవన్ ఎలాంటి వాడో తెలుసుకోండి...BR Siraj UR Rahman Speech At Janasena Formation Day..Pawan Kalyan..

పవన్ ఎలాంటి వాడో తెలుసుకోండి...BR Siraj UR Rahman Speech At Janasena Formation Day..Pawan Kalyan..

SOMETHING WRONG

Image
HUFFPOST 23-07-2018 How Andhra Pradesh Built India's First Police State Using Aadhaar And A Census VIJAYAWADA, Andhra Pradesh — Across the hall from Chief Minister Chandrababu Naidu's office in the Andhra Pradesh Secretariat is a windowless room with giant wall-sized screens that display the intimate personal details of 43 million of the state's 50 million residents: GPS coordinates of their homes, the medicines they use, the food rations they eat, what they say about the Chief Minister on their social media accounts, real-time feeds of thousands of security cameras (with some cameras inside people's homes - voluntarily, of course), their castes and sub-castes, their religion, their student scholarships and old-age pensions, their movement in every state ambulance, and of course — their Aadhaar numbers. For complete Story: https://www.huffingtonpost.in/2018/07/23/how-andhra-pradesh-built-
Image
నిఘా నేత్రం నీడలో ఏపీ… యూ ఆర్ అండర్ అ(న్) రెస్ట్!! ఏపీ కొత్త రాష్ట్రం కావడం వల్లనే ఇపుడు అది అత్యంత ప్రమాదరకమైన స్థితిలోకి నెట్టివేయబడింది… మొదటి నుంచీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సిరావడం రాజకీయ పార్టీలకు అది బంగారు బాతుగుడ్డుగా మారిపోయింది. ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్టు, కొత్త మౌలిక నిర్మాణాలకు లక్షల కోట్ల నిధులు అవసరం ఉండటంతో ఆయా కాంట్రాక్టుల ద్వారా సొమ్ము సంపాదించుకునేందుకు సీఎం కుర్చీ కోసం హోరా హోరా పోరాటం జరుగుతోంది. కుర్చీకి ఇక ఆమడ దూరంలోనే ఉన్నామని వైసీపీ భావిస్తుండగా, దొడ్డిదారిలోనైనా అధికారంలోకి వచ్చేద్దామని తెలుగుదేశం భావిస్తున్నాయి. దీంతో… ఏపీ ఇపుడు రాజకీయ పార్టీలకు ఒక ప్రయోగశాలగా మారిపోయింది. నీతిమంతమైన పాలనను అందిస్తానంటున్న పవన్ కళ్యాణ్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలూ శతధా ప్రయత్నించడానికి కూడా వారి భారీ ఆశలే కారణం !! ప్రమాదంలో…వ్యక్తిగత సమాచారం? ! పౌరులకు సంబంధించి ఏ స్థాయిలో సమాచారం ఉన్నదీ పై ఫోటోలో కనిపిస్తున్నది  ఇంటర్నెట్, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత… వ్యక్తిగత గోప