నిఘా నేత్రం నీడలో ఏపీ… యూ ఆర్ అండర్ అ(న్) రెస్ట్!!




ఏపీ కొత్త రాష్ట్రం కావడం వల్లనే ఇపుడు అది అత్యంత ప్రమాదరకమైన స్థితిలోకి నెట్టివేయబడింది… మొదటి నుంచీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సిరావడం రాజకీయ పార్టీలకు అది బంగారు బాతుగుడ్డుగా మారిపోయింది. ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్టు, కొత్త మౌలిక నిర్మాణాలకు లక్షల కోట్ల నిధులు అవసరం ఉండటంతో ఆయా కాంట్రాక్టుల ద్వారా సొమ్ము సంపాదించుకునేందుకు సీఎం కుర్చీ కోసం హోరా హోరా పోరాటం జరుగుతోంది. కుర్చీకి ఇక ఆమడ దూరంలోనే ఉన్నామని వైసీపీ భావిస్తుండగా, దొడ్డిదారిలోనైనా అధికారంలోకి వచ్చేద్దామని తెలుగుదేశం భావిస్తున్నాయి. దీంతో… ఏపీ ఇపుడు రాజకీయ పార్టీలకు ఒక ప్రయోగశాలగా మారిపోయింది. నీతిమంతమైన పాలనను అందిస్తానంటున్న పవన్ కళ్యాణ్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలూ శతధా ప్రయత్నించడానికి కూడా వారి భారీ ఆశలే కారణం!!

ప్రమాదంలో…వ్యక్తిగత సమాచారం?!



పౌరులకు సంబంధించి ఏ స్థాయిలో సమాచారం ఉన్నదీ పై ఫోటోలో కనిపిస్తున్నది 
ఇంటర్నెట్, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత… వ్యక్తిగత గోప్యత చాలా తగ్గిపోయింది. ఆధార్ వంటి ముఖ్యమైన సమాచారం కూడా ప్రమాదంలో పడింది. ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకుని రాష్ట్రంలో ఓటర్లను తొలగించేందుకు ‘‘రహస్యంగా ఒక ఆపరేషన్’’ జరుగుతోందన్న అనుమానాలైతే బలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నానా పాట్లూ పడుతోంది. జనవరి 17వ తేదీన ‘‘న్యూస్ ఆఫ్ 9’’ పేదల దేవుడిని అంటాడు… దెయ్యపు ఆలోచనలు చేస్తాడు’’ శీర్షికతో సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న ‘‘టెక్నాలజీ జిమ్నాస్టిక్స్’’పై ఒక కథనాన్ని ప్రచురించింది. ఏదో జరుగుతుండవచ్చని అప్పుడే అనుమానాలు వచ్చాయి. కానీ మరింత లోతుగా అధ్యయనం చెయ్యలేదు. లోగా… ఆధార్ సమాచారం ‘‘సేవామిత్ర’’ అప్లికేషను కోసం బయటకు వెళ్లిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత కథ మీకు తెలిసిందే.
ఒక నేరం జరిగిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి… పోలీసులు ఒక పద్ధతిని ఫాలో అవుతారు. దీన్ని కనెక్టింగ్ డాట్స్ అని అంటాం. జర్నలిస్టులు కూడా ఇదే ఫాలో అవుతారు. కొన్ని సంఘటనలూ, ఆధారాలూ, విషయాలూ అన్నీ దేనికదే విడివిడిగా ఉంటాయి. వీటి మధ్య ఉన్న లింకులను మనం ఊహించగలిగితే… మొత్తం పిక్చర్ కళ్లకు కడుతుంది. ఇప్పుడు మీరీ కథనం ద్వారా ఈ కనెక్టింగ్ డాట్స్ ప్రయోగాన్ని చేద్దాం. మీరు కూడా జాగ్రత్తగా చదవండి.

ఏపీ ప్రభుత్వం ‘‘రియల్ టైమ్ గవర్నెన్స్’’ అనే ఒక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా సీఎం కూర్చున్న దగ్గరకే సమాచారం మొత్తం రావాలి. సీఎం ఈ డాష్ బోర్డు దగ్గర కూర్చుని ఎక్కడ ఏం జరుగుతున్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇందంతా ఒక హాలీవుడ్ సినిమా తరహాలో సాగినట్లు మనకు అర్థం అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని వీధి దీపాలు ఉన్నదీ సీఎం కళ్ల ఎదుటే కనిపిస్తూ ఉంటుంది. వీధి దీపాలు వెలుగుతున్నదీ సీఎం స్థాయికి వ్యక్తికి అవసరమే లేదు. వీధి దీపాల గురించి చెబితే అందరికీ వినడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ విషయం వీధి దీపాలు కానే కాదు అని అర్థం అవుతుంది. దీని వెనుక కథ వేరు.



సీఎం డాష్ బోర్డు… ఇది 
సామాజిక సంక్షేమ పథకాలను నిర్వహించడం.. ప్రభుత్వాలకు కష్టమైపోయిన నేపథ్యంలో అనేక అవకతవకలను నిరోధించడానికి ఆధార్ తెరపైకి వచ్చింది. దీని కోసం భారత పౌరులందరి కోసం ఆధార్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ స్కీములను వేర్వేరు పేర్లతో ఒకరే తీసుకోవడాన్ని నిరోధించేందుకు ఈ స్కీములను ఆధార్ నెంబరుకు లింకు చేశారు. దీని వల్ల డూప్లికేషన్ ఉండదు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే… ఇక్కడ ఏం జరిగింది? ఆధార్ సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు చూడటానికీ, దానిని వినియోగించడానికీ అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం… ఒక అడుగు ముందుకేసి… అదే ఆధార్ సమాచారాన్ని పార్టీ యాప్ నకు వినియోగించుకుని ఉంటుంది. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు తెదేపా ప్రభుత్వం నానా తంటాలు పడుతోందని ఆ పార్టీ నేతల ప్రకటనలు చెప్పకనే చెబుతున్నాయి. అందునా… ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్ పలాయనం దీనినే సూచిస్తోంది. ఆధార్ సమాచారాన్ని వాడుకుంటే ఎవరు గుర్తిస్తారు అన్నది వారి భరోసా కావచ్చు. కానీ ఈ ప్రయోగం బెడిసి కొట్టి ఉండవచ్చు.

 ఇక్కడ నుంచి మనం మరో విషయానికి వెళదాం…!!
ఏపీలో ఆధార్ గురించిన అవకతవకలు జరుగుతున్నాయంటూ… శ్రీనివాస్ కొడాలి అన్న వ్యక్తి… గత ఏడాది ఆగస్టు 07 తేదీన శర పరంపరగా అనేక ట్వీట్లు ప్రజల్లోకి వదిలేశాడు. ఈ ట్వీట్లలో ఉన్న సమాచారాన్ని బట్టి మనకు కొంత సమాచారం తెలుస్తుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం ఏపీలో ప్రతి లావాదేవీని ఆధార్ తో అనుసంధానం చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఆలోచనను తెరపైకి తెచ్చింది జే.సత్యన్నారాయణ అనే అధికారి అని తెలుస్తోంది. సత్యనారాయణ 1977 ఏపీ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఆధార్ సంస్థ (ఉడాయ్) ఛైర్మన్ (పార్ట్ టైం) గా ఉన్నారు. సత్యనారాయణ అంతకు ముందు కేంద్ర ఐటీ విభాగంలో పని చేశారు. చంద్రబాబు హయాంలో ఏపీ సీఎంఓ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పని చేశారు. ఏది ఏమైనా… చంద్రబాబుకు మాత్రం ఆయన చాలా సన్నిహితులన్నది ఐటీ సంస్థలందిరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో ఈ గవర్నెన్స్ కు ఆయనను ఆద్యుడుగా పేర్కొంటారు. నందన్ నిలేకనీ రాజీనామా తర్వాత సత్యనారాయణ ఉడాయ్ బాధ్యతలు స్వీకరించడం విశేషం.

శ్రీనివాస్ కొడాలి ట్వీట్లలో ఏం చెప్పారంటే…?


ఆధార్ ను సర్వే సమాచారంతో అనుసంధానం  ప్రగతి డేటా బేస్… !!
రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా- ఏపీలోని ప్రతి పౌరుడి ఆధార్ ఆధారంగా… 360 డిగ్రీల్లో సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేయాలని భావించినట్లు శ్రీనివాస్ కొడాలి తన ట్వీట్ లో రాశారు. దీన్ని పీపుల్ హబ్ (ఈ-ప్రగతి) అని పిలుస్తున్నారని కూడా చెప్పాడు. హఫింగ్టన్ పోస్టు పత్రిక 2018 జులై 23న ఇలా రాసింది: ‘‘ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక హాల్లో ఉన్నారు. అక్కడ ఒక్క కిటీకీ కూడా లేదు. పెద్ద పెద్ద భారీ స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లపై ఏపీ పౌరులకు చెందిన 4.3 కోట్ల మందికి చెందిన సున్నితమైన వ్యక్తిగత సమాచారం కనిపిస్తోంది. జీపీఎస్ ద్వారా వారి ఇళ్లు తెలుస్తున్నాయి. వాళ్లేం మందులు వాడుతున్నదీ తెలుస్తోంది. సోషల్ మీడియా అక్కౌంట్లలో ముఖ్యమంత్రి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా కనిపిస్తోంది. వాళ్లు ఏం తింటారు?, ఏకకాలంలో సెక్యురిటీ కెమేరాలు పంపుతున్న కెమేరా విజువల్స్,  కొన్ని కెమేరా విజువల్స్ ఇంటి లోపలి దృశ్యాలు కూడా ఉన్నాయనుకోండి (అంగీకారంతో జరిగినవి). పౌరుల కులాలు, ఉప కులాలు, మతం, విద్యార్ధుల ఉపకారవేతనాలు, పించన్లు, యాంబులెన్సుల్లో వారి ప్రయాణాలూ, ఆధార్ నెంబర్లు… మొత్తం అందులో ఉన్నాయి. ‘‘ఈ ప్రగతి’’ అన్న దీని ద్వారా ఒక భారీ డేటా బేస్ ను సృష్టించి ఒక దగ్గర కూర్చుని మొత్తాన్నీ నియంత్రించడం అన్న మాట. ఈ సమాచారం మొత్తం ఆధార్ నెంబరుతో లింకు అయినదే. గోపాల్ సాథే అన్న విలేకరిని ఈ గదిని చూసేందుకు అనుమతించినట్లు అందులో పేర్కొన్నారు.

కొడాలి శ్రీనివాస్ చెబుతున్నదాని ప్రకారం.. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రికి అనుంబంధంగా ఉన్న మందుల షాపులో మందులు కొని.. మీరు షాపు అతనికి మీ ఫోన్ నెంబరు ఇస్తే… ఆ మందుల సమాచారం కూడా మీ ఆధార్ కు లింకు అయిపోతుంది. అంటే మీ ఇల్లు, ఇంటి పన్నులు, మందులు… మీరు ఏ పని చేసినా ఆ సమాచారం మొత్తం ప్రభుత్వానికి చేరిపోతున్నదా…? నిజంగా అదే జరిగితే… ప్రజలకు ఒక్క క్షణం కూడా స్వేచ్చ లేదని భావించవచ్చు. ఈకేవైసీ ద్వారా పౌరులకు చెందిన సమాచారం మొత్తాన్నీ ఒక దగ్గర డేట్ బేస్ లో ఉంచుతున్నారని అయితే అర్థం అవుతుంది. ఇదే వాస్తవం అయితే… ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని చెప్పక తప్పదు.  

ఓటర్ల సమాచార విశ్లేషణ కోసం…
ప్రభుత్వం ఇంత సున్నితమైన సమాచారాన్ని ఎందుకు సేకరిస్తోంది? ఇందులోని ఆధార్ ఆధారంగా ఓటర్ల సమాచారాన్ని వేరుగా చేసి… వాళ్లు కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా ఓటరు నాడిని గ్రహించడానికీ, విశ్లేషించడానికీ ఈ సమాచారం ఉపకరిస్తుంది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఈ పని చేస్తోందని శ్రీనివాస్ కొడాలి అంటున్నారు. ఒక వ్యక్తి సమాచారం కోసం ఆ జిల్లా, మండలం, గ్రామం, క్లస్టర్ ప్రకారం… ఆ వ్యక్తిని కంప్యూటర్ ద్వారా ట్రాక్ చేయడానికి వీలున్నదని వెబ్ సైటు స్క్రీన్ షాట్లను బట్టి తెలుస్తోంది. 2 కోట్ల మందికి చెందిన సమాచారం అసలు బహిర్గతంగా అందరికీ అందుబాటులో ఉంచేశారని కూడా శ్రీనివాస్ కొడాలి ఆరోపించారు.




జిల్లాలు… మండలాలు… గ్రామాలూ… క్లస్టర్ల వారీగా… 
ఇదంతా తాను చేసిన పరిశోధన ద్వారా తెలిసిందని తన ట్వీట్లలో చెప్పారు. ఇప్పటికీ ఈ ట్వీట్లు ట్విటర్ లో ఉన్నాయి. @digitaldutta అన్న హ్యాండిల్ ను చూడవచ్చు.
పాఠశాలల్లో డ్రాపవుట్లను తగ్గించే విషయమై… ప్రభుత్వం తన దగ్గరున్న సమాచారాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీకి అందించిందన్న ఒక విమర్శ ఉంది. ఇదీ ప్రమాదకరమైన ఆరోపణే. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ప్రభుత్వం తన దగ్గరున్న అప్పటికే ఉన్న సమాచారంతో… ప్రజాసాధికార సర్వే-2016లో సేకరించిన సమాచారాన్నీ అన్నింటినీ అనుసంధానం చేసేసినట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించి 360 డిగ్రీల్లో అలా సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం మొత్తం తన దగ్గరున్న రియల్ టైమ్ గవర్నెన్స్ దగ్గరకు పోగు చేసి… రియల్ టైంలో ఎవరు ఏం చేస్తున్నారన్నది గమనించడం ప్రభుత్వాలకు అవసరమా అన్నది మొదటి ప్రశ్న. ఒక్క ఆధార్ వల్లనే వ్యక్తిగత గోప్యత దెబ్బతింటున్నదంటూ దేశ వ్యాప్తంగా అనేక ఆందోళనలూ, చర్చలు జరిగాయి. చివరికి సుప్రీం కోర్టు దీనికి ముగింపు పలికింది. ప్రైవేటు కంపెనీలకు ఆధార్ సమాచారం ఇవ్వకూడదని చెప్పింది. మరి అలాంటప్పుడు… ఐటీ గ్రిడ్స్ యజమాని ఎందుకు పారిపోయినట్లు? తప్పు చేయనపుడు భయం ఎందుకు అన్నది మరో ప్రశ్న. ప్రభుత్వం అశోక్ కు అండగా నిలబడటం ఇవన్నీ.. కూడా ఏపీ ప్రభుత్వంపై అనుమానాలను పెంచుతున్నాయే తప్ప తగ్గించడం లేదు.



గత రెండు నెలల కిందట గుంటూరులో కొందరు ప్రైవేటు ఉద్యోగులు… ఓట్లను తొలగిస్తున్నట్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కడపలోనూ ఇలాంటిదే జరిగింది. ఓట్లను తొలగిస్తున్నారన్నది అయితే వాస్తవం. ప్రజలకు సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర ఉంది. ఏపీ ప్రభుత్వం దగ్గర. ఏపీ సీఎం అంటూ ప్రతి ఒక్క పౌరునికీ ఫోన్లు ఎవరి దగ్గర నుంచి వెళుతున్నాయి? ఏపీ సీఎం దగ్గర నుంచే… !!; అధికారుల్నీ, ప్రజల్నీ తెలుగుదేశం అభిమానులుగా మార్చివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం తల్లకిందులుగా తపస్సు చేస్తోందన్న విషయం అర్థం అవుతూనే ఉంది.


ఏపీ సీఎం నుంచి ఫోన్లు ఇలా వెళుతుంటాయి… ప్రభుత్వంపై ప్రజల అంచనాలు తెలుసుకునే ఐటీ ఆధారిత ప్రక్రియ 
ఈ చుక్కల్నీ కలిపి ఇపుడు చూడండి. ఏపీ ప్రభుత్వంలో రహస్యంగా ఏదో జరుగుతున్నట్లుగా అనుమానాలు బలపడటం లేదూ…!! డేటా అంటే- సమాచారమే పెద్ద ఆస్తి. సమాచారం ఎవరి చేతిలో ఎక్కువగా ఉంటుందో వారే రారాజులు అయిపోతారు. ఇపుడు స్థిరాస్తుల కంటే… ప్రజల సమాచారమే పెద్ద ఆస్తిగా మారింది. అందువల్ల భవిష్యత్తులో ఇదే పెద్ద వ్యాపారం అవుతుందని ఇటీవల ముఖేశ్ అంబానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కంప్యూటరు ఆధారంగా జరిగే వ్యాపారాలన్నింటికీ సమాచారం విదేశీ కంపెనీల్లోని సర్వర్లలో నిక్షిప్తం అవుతున్నది. ఆ సమాచారం మొత్తాన్నీ తెచ్చి స్వదేశంలోనే నిల్వ చేసుకోవాలని ముఖేష్ అంబానీ అంటున్నారు. రూ.70 వేల కోట్లతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం అదానీ గ్రూపుతో ఒప్పందం చేసుకోవడం తెలిసిందే.



ప్రతి సమాచారానికీ ఆధార్ ను లింకు చేయమని అడుగుతున్న ఏపీ అప్లికేషన్ 
ప్రభుత్వాలూ- ప్రైవేటు కంపెనీలు కలిసి పని చేయడం వల్ల ప్రజలకు సంబంధించిన సమాచారం… ధర్మకర్తలుగా ఉన్న ప్రభుత్వాధినేలు కాపాడతారా అన్న ప్రశ్న మన ముందు ఉంది. కాలమే దీనికి సమాధానం చెప్పాలి. నీతివంతమైన పాలన అవసరం ఉంది అన్న ఆలోచన ఇటువంటి సమయాల్లోనే మనకు వస్తుంది. దీనికి కాలమే సమాధానం చెబుతుంది!!

Comments

Popular posts from this blog