Posts

Showing posts from May, 2019

అసెంబ్లీ 63+…. ఎంపీలు 10+ జాబితా ఇదిగో..!! ఇది జనసేన ప్రభంజనం

ఇది మా స్వీయ అంచనాలు   ఖాయంగా 63 అసెంబ్లీ స్థానాలు ఇంకా అదనంగా కూడా రావచ్చు… 10 ఎంపీ సీట్లు ఖాయం మరో 4 వచ్చే అవకాశం     మే 23… దగ్గర పడుతున్నకొద్దీ టెన్షన్ పెరిగిపోతున్నది. జనసేన పార్టీ అంటే టీడీపీ వైసీపీలకు చిన్నచూపు. ‘‘వస్తే టీడీపీ, లేకపోతే వైసీపీ అంతే’’ అని అంటాడు ఒక వైసీపీ అభిమాని. ఈ రెండు పార్టీలకే హంగూ   ఆర్భాటాలు ఉన్నాయి కనుక… అవే గెలుస్తాయన్న అనుమానం కొంతమందిలో ఉంది.    అయితే, టీడీపీ, వైసీపీ కలలు కంటున్నట్లుగా ఎవరికీ మెజారిటీ రాదని మేము భావిస్తున్నాము. టీడీపీ గెలిచే అవకాశం జీరో అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. మరి వైసీపీ గురించి ఏం చెబుతారు అంటే.. ఏమోనండి… గెలుస్తుందని అందరూ అంటున్నారు మరి… అంటూ స్పష్టంగా చెప్పలేకపోయారు.    టీడీపీ గెలిచే అవకాశం లేనేలేదని ఘంటాపథంగా చెబుతున్నారు. వైసీపీ గురించి మాత్రం అందరిలోనూ ఒక గుబులు ఉంది. ‘‘గెలవవచ్చు… కానీ ఏమోనండి’’ అంటున్నారు. బల్లగుద్ది మరీ ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీనంతటికీ కారణం.. జనసేన పార్టీ.   జనసేనకు భారీ వేవ్ ఉందని మేం భావిస్తున్నాం. ఈ వేవ్ ఉన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. మహా అయితే పవన్ కళ్యాణ్ ఓ

నాగబాబు ఉన్న మాటేగా చెప్పారు…!!

Image
          గాజువాక జనసేన ఆత్మీయ సమావేశంలో నరసాపురం పార్లమెంటు అభ్యర్థి నాగబాబు మాట్లాడిన మాటల్లో తప్పేం ఉంది? ఆయనేదో బూతు మాటలు మాట్లాడినట్లు ‘‘సాక్షి’’ దినపత్రిక బుగ్గలు నొక్కుకుంటున్నది గానీ… నాగబాబు అక్షరాలా ఉన్నమాటే చెప్పారు. అయిన దానికీ కానిదానికీ విలేకరుల సమావేశాలు పెట్టి… ఇతరులపై నోరు పారేసుకోవడం మెగా బ్రదర్స్ ఇంటావంటా లేని అలవాటు.     అయితే ఎంతసేపూ ఇతరులపై బురద చల్లేందుకే విలేకరుల సమావేశాలు పెట్టే ఛోటామోటా ఆర్టిస్టులను వెధవలు అంటూ తిట్టడం తప్పెలా అవుతుంది? అనవసరంగా మెగా బ్రదర్స్ పై నోరుపారేసుకోవడం అందరికీ గొప్పగా కనిపించినపుడు ‘‘మీరు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు’’ అంటూ కాస్త ఘాటుగా చెప్పడం సరైనది కాకుండా ఎలా పోతుంది? మెగా బ్రదర్స్ మాట్లాడితే… ఆ మాటలకు ఎంత వైడ్ పబ్లిసిటీ వస్తుందో అందరికీ తెలిసిందే. అయినా తమకు ఉన్న ప్రజాభిమానాన్ని దుర్వినియోగం చేయకుండా మెగా బ్రదర్స్ తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. వారికై వారు విలేకరుల సమావేశం నిర్వహించి ఫలానా వారిపై దుమ్మెత్తి పోశారని ఒక్క ఉదాహరణను ‘‘సాక్షి’’ దినపత్రిక చూపించగలదా?  నిన్న వైసీపీ నేత ఒకరు మాట్లా