2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం: పవన్ కళ్యాణ్
- అవినీతిపరులు… చింతకాయల్లా రాలిపోతారు
- తెలుగుదేశం, జగన్ పార్టీలు డొల్ల పార్టీలే..
- ధర్మాన్ని రక్షించడానికే జనసేన అవతరణ
- తిట్లపై ఛానెళ్లు చర్చలు పెట్టడమేమిటి?
వేల, లక్షల కోట్లున్న
చంద్రబాబు, జగన్ పార్టీలను మీరు ఎలా ఎదుర్కొంటారంటూ తనను అనేక మంది
ప్రశ్నించిన అంశాన్ని గుర్తు చేస్తూ… ‘‘ఒక కోడి
గుడ్డును పగల గొట్టడానికి గుండ్రాయితో పనేంటి?’’ అని ఒక్క సామెతతో ప్రజలకు
ధైర్యాన్ని నూరిపోశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
కొల్లాయిగుడ్డ కట్టుకున్న ఒక బక్కపలచని వ్యక్తి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించగా లేనిదీ… అవినీతిమయం అయిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చలేమా అంటూ ప్రశ్నించారు.పోరాటయాత్రలో ఆయన మాట్లాడుతూ… ‘‘2019లో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు నాతో ఉండండి. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ కోటలు బద్దలు కొడదాం. మార్పు జరుగుతున్న క్రమంలో అది ఎవరికీ కనిపించదు. వచ్చిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది. మార్పు తెద్దాం.
కొల్లాయిగుడ్డ కట్టుకున్న ఒక బక్కపలచని వ్యక్తి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించగా లేనిదీ… అవినీతిమయం అయిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చలేమా అంటూ ప్రశ్నించారు.పోరాటయాత్రలో ఆయన మాట్లాడుతూ… ‘‘2019లో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు నాతో ఉండండి. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ కోటలు బద్దలు కొడదాం. మార్పు జరుగుతున్న క్రమంలో అది ఎవరికీ కనిపించదు. వచ్చిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది. మార్పు తెద్దాం.
2019లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం
లేదు… జగన్ ప్రభుత్వం రావడం లేదు… జనసేన ప్రభుత్వం వస్తున్నది’’ అని యువత
కేరింతల మధ్య ప్రకటించారు. పోరాడితే పోయేందేం లేదు… బానిసత్వం తప్ప అంటూ
కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోశారు. ‘‘అవినీతిమయమైన ప్రతిపక్షం,
అవినీతిమయమైన అధికార పక్షం… ఈ రెండింటినీ వెనక్కినెట్టేద్దాం. ప్రజా
సమస్యలపై త్రికరణశుద్ధితో ఉన్నాం. మీ కన్నీళ్లు తుడుస్తాం. అవినీతికి
పాల్పడుతూ ఇపుడు పాపాలు చేసేవారు చింతకాయల్లా రాలిపోతారు’’ అని పవన్
అన్నారు.
స్వర్గీయ ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు… పెద్దాపురం మండలం సూరంపాలెం గ్రామంలో 470 ఎకరాల భూముల్ని దళితులకు ఇస్తే, వాటని తెలుగుదేశం ప్రభుత్వం తీసేసుకుని, అందులో మట్టి తవ్వుకుని కూడా కోట్లు సంపాదించుకుంటున్నారని నిందించారు. ఒక్క మట్టిలోనే 2 వేల కోట్లు ఉన్నాయని తెలుగుదేశం ప్రభుత్వం నిరూపించిందని, ఇలాంటి ప్రకృతి సంపదను దోచుకోవడాన్ని ఆపితే, యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వవచ్చని అన్నారు.
అందిరినీ వదులుకుని వచ్చా
కన్న ఇంటినీ, అన్నయ్యనూ వదులుకుని నా అన్నదమ్ములైన, అక్కచెల్లెళ్లయిన మీ అందరి కోసం వచ్చేశానని చెప్పారు. ‘‘దేవుడు లేని ఊళ్లో మంచం కోడే పోతురాజు’’ అన్న సామెతను గుర్తు చేశారు. ఒకప్పటిలా అంబేద్కర్, గాంధీలు లేరని, ఇపుడు… చంద్రబాబులూ, జగన్మోహన రెడ్డిలే ఉన్నారని అన్నారు. వీళ్లను నమ్మలేకే… జనసేన పెట్టానని చెప్పారు. 2014లో చంద్రబాబు మద్దతు ఇవ్వడం ధర్మమని, 2019లో జనసేన ప్రభుత్వం రావడం ధర్మమని అన్నారు. తాను ధర్మాన్ని రక్షించడానికే వచ్చానని ప్రకటించారు.
తిట్లపై టీవీల్లో చర్చలేమిటి?
అక్రమ మైనింగ్ చేస్తున్న ఆండ్రూ కంపెనీని తిడితే… మీడియా ఛానెళ్లు తనపై చర్చా కార్యక్రమాలు పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. ప్రజా సమస్యలపై చర్చలు పెట్టకుండా ఇదేమటని ఆయన ఎద్దేవా చేశారు. తప్పు మాట్లాడటంపై చర్చ పెట్టాలంటే… ప్రధానిని బూతు మాటతో బాలకృష్ణ తిట్టినపుడు కూడా మీడియా ఛానెళ్లు చర్చలు పెట్టాలి కదా… మరి అప్పుడు పెట్టలేదేమిటి అని అన్నారు. తనకు ఛానెళ్లు, దినపత్రికలూ అన్నీ కూడా మీరేనంటూ ప్రజలకూ, పార్టీ సైనికులకూ చెప్పారు.
Comments
Post a Comment