జనసేన పైన జగన్ రహస్య సర్వే


 

      తెలంగాణలోని కొన్ని ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ఎన్నికలు ఎట్టకేలకు ముగిసిపోయాయి.అయితే ఎక్కడైనా ఎన్నికల ముందు ఒకరి పార్టీల మీద ఒకరు వారి యొక్క బలాబలగాలను తెలుసుకునేందుకు సర్వేలు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సర్వేలు చేయించుకుంటారని అందరికి తెలుసు.అయితే తెలంగాణలో జాతీయ సర్వేల్లో వచ్చిన ఫలితాల దగ్గర ప్రాంతీయ నేతలు చేయించిన సర్వేలు తేలిపోయాయి.కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల దగ్గరకి వచ్చింది.ఇంకా కొన్ని నెలలు మాత్రమే గడువు మిగిలి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీలు వారి పార్టీని ప్రజల్లో నిలిపిందేకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

  
     అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలా చూసుకున్నా మూడు ముఖ్య పార్టీలే ప్రజలకు కనిపిస్తున్నాయి.దానికి తోడు “జనసేన” పార్టీ మీదనే అందరి కళ్ళు ఉన్నాయి.పవన్ కు ఎలాగో ప్రజాధరణ ఎక్కువే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పవన్ చాలా బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

      ఇప్పుడు పవన్ ని అసలు లెక్కలోకే తీసుకోము అనే పార్టీ పవన్ మీద ఒక రహస్య సర్వే చేస్తున్నారని తెలుస్తుంది.జగన్ కి ఆంధ్ర రాష్ట్ర ఎంత ఆదరణ ఉందో అందరికి తెలుసు.అయితే పవన్ కూడా అందుకు తక్కువేం కాదు అందుకనే జగన్ పవన్ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అని ఒక నాలుగు అంశాల మీద రహస్య సర్వే చెయ్యిస్తున్నారట.

  “అసలు పవన్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం వలన ఏ పార్టీకి అధికంగా నష్టం”,
”జనసేన అధినేతకు ప్రజల్లో ఉన్న బలమెంత..?”, 
“ఎక్కువగా ఏ సామాజిక వర్గానికి చెందిన వారు పవన్ కి మద్దతుగా నిలబడుతున్నారు” మరియు
 “ఎన్ని నియోజిక వర్గాల్లో పవన్ యొక్క ప్రభావం ఉండబోతుంది” 
అని పలు ముఖ్య అంశాల మీద సర్వే చేయిస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది.

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్