కాపులకు రిజర్వేషన్లు

ప్రశ్న: కాపులకు రిజర్వేషన్ల అవసరం ఏంటి?

జవాబు: బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో 1915 నుంచే కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉండేవి. ఆ రోజుల్లో దళితులకు, గిరిజనులకు, మూడో కేటగిరిలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవి. 

వాటిని తొలగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తే డాక్టర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ అడ్డుకున్నారు. వారి కృషి వల్ల ఆ రిజర్వేషన్లను తొలగించకుండా బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసివేయాలనుకున్నారు. తీసివేశారు. 

ఆ తర్వాత 1961లో అప్పటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 'కాపులకు గోచీలు కూడా ఉండవే. వీళ్లు ఓసీలేంటి? వీళ్ల బతుకులు ఓసీ బతుకులా? చాలా కష్టాల్లో ఉన్నారు' అని అంటూ ఓ జీవో ద్వారా రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించారు. అవి 1966 వరకూ కొనసాగాయి.

ఆ తర్వాత పునరుద్ధరించాలని కోరుతూ మా పెద్దలు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలు చేసి.. రోడ్డు మీదకి వచ్చీ అలసిపోయారు. లాఠీల దెబ్బలు తిన్నాం. బూటు కాళ్లతో తన్నించుకున్నాం. కేసులు పెట్టించుకున్నాం.

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్