తిరుగుబాటు యోచనలో 25 మంది కాపు నేతలు?

విజయవాడ: తెలంగాణలో
తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం
వేడెక్కుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ తెలుగుదేశం
ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఉన్న కాపులు దీనిపై తర్జన భర్జనలు పడుతున్నట్లు
తెలుస్తోంది. తెరవెనుక కాపు సామాజిక వర్గం మొత్తం.. సమాలోచనలు
చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
‘‘మంత్రులతో సహా 25 మంది కాపు నేతల
తిరుగుబాటు?’’ శీర్షికతో విజయవాడలోని స్వర్ణాంధ్ర సాయంకాలపు పత్రిక ఒక
వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనిపై ‘‘న్యూస్ ఆఫ్ 9’’ విచారించగా…
అలాంటి వాతావరణం ఉందని, ఇది నిజమేనని తేలింది. ఈ పత్రిక అందించిన సమాచారం
మేరకు వివరాలు ఇలా ఉన్నయి. మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు
ఎంపీలూ, ఇతర ముఖ్యనాయకులు అంటే మొత్తం 25 మంది కీలకమైన నేతలు తెలుగుదేశం
నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఒక్కొక్కరుగా
రావడం కంటే మూకుమ్మడిగా వస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఆలోచన కూడా
సాగుతోంది. వీరిలో చాలా మంది ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో
మాట్లాడుతున్నారని, ఆయనకు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. కొంత మంది
కాపు నేతలు మాత్రం జగన్ దగ్గరకు వెళితే మంచిదా? లేక జనసేనకు వెళితే మంచిదా
అన్న మీమాంసలో ఉన్నారు.
కాపు నేతల వ్యవహారంపై కన్నేసిన తెదేపా అధినేత
చంద్రబాబు వీరి కదలికలపై ఓ కన్నేయాల్సిందిగా ఇంటిలిజెన్స్ అధికారులను
ఆదేశించారట. ఇప్పటికే వారి ఫోన్లను టాప్ చేసి సమాచారాన్ని నిఘా వర్గాలు
చంద్రబాబుకు చేరవేస్తున్నారనీ, దీని ఆధారంగా వారిని బుజ్జగించేందుకు
పార్టీలో కొందరిని నియమించారని తెలుస్తోంది. బయటకు ఏమీ తెలియనట్లుగానే
ఉంటూ… పార్టీలో ఉండే నమ్మినబంట్లు మాత్రం.. కాపు నేతల్ని నయానో, భయానో
దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. (ఆధారం: స్వర్ణాంధ్ర సాయంకాల పత్రిక, విజయవాడ)
Comments
Post a Comment