జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

 Useless Questions on Janasena!! | telugu.newsof9.com

 కళ్ల ముందున్న మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీలూ, వాటి నేపథ్యం తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు.

మూడో పార్టీ జనసేన. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది. డబ్బు లేని రాజకీయం చేస్తానని వచ్చింది… అలాగే మాటకు కట్టుబడి ఉంది. అయినా.. జనసేన గురించి సవాలక్ష అనుమానాలు. ట్వట్టరు లేదా సోషల్ మీడియాలో ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ గురించే.

పవన్ విదేశాలకు వెళుతున్నాడంటగా…?

జనసేన ఆఫీసులు మూసేస్తున్నారంటగా..?

రెండు సీట్లే వస్తున్నాయంటగా…?

మళ్లీ సినిమాలు చేసుకుంటాడంటగా…?

30 సీట్లు వస్తే.. చంద్రబాబుకు మద్దతు ఇస్తాడంటగా..?

బుద్ధున్న వాళ్లు ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగరు. లక్షలాది మంది జనం మద్దతు ఉన్నపుడు పవన్ కళ్యాణ్ ఎవరికో ఎందుకు మద్దతు ఇస్తాడు? ‘‘ఎన్నాళ్లు పల్లకీలు మోస్తాం’’ అన్న మాటలో తీవ్రత అర్థం కావడం లేదా? ఇది కూడా అర్థంకానివాళ్లు తగుదునమ్మా అంటూ రాజకీయాలు ఎందుకు మాట్లాడటం? 

బతుకుల్లో కూడా ఆనందం ఉంది అనుకుంటూ దాని కోసం అక్కడే వెదుక్కునే వాళ్లకు జనసేన పార్టీ అక్కర్లేదు. ఇంకా నమ్మకం లేకపోతే అలెక్సీ హేలీ రాసిన ఏడు తరాలు అని పుస్తకం ఉంటుంది. కొనుక్కుని చదువుకోండి. ట్విటరులో సోది ప్రశ్నలు ఎందుకు చెప్పండి?

ఉదాహరణకు మీరే పవన్ కళ్యాణ్ స్థానంలో ఉన్నారని అనుకుందాం. మీరేం చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా జనం వస్తుంటే.. మీరు చంద్రబాబును సీఎం చేద్దామని అనుకుంటారా?

 ఇతరులను ప్రశ్న అడిగే ముందు మనకు మనం ప్రశ్న వేసుకోవాలి? ఎన్నికలు అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఆఫీసులు తీసేస్తారు. ఇది ఏ పార్టీ అయినా తీసేస్తుంది. వైసీపీ కేంద్ర కార్యాలయం మొదట ఉన్న చోట నుంచి లోటస్ పాండు వద్దకు మారిందిగా..? 

కోటీశ్వరులం, మాకు పది తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది అనుకునే వర్గాల్లో.. పవన్ కళ్యాణ్ ను విమర్శించే వారు ఉంటే తప్పు లేదు. ఎందుకంటే రేపొద్దున్న కాంట్రాక్టులు రావనో, మరొకటో భయం ఉంటుంది. చిన్న బతుకులు బతికే వారికి పవన్ కళ్యాణ్ ను విమర్శంచే హక్కు లేదు. అరే… ఆయన వస్తున్నదే… బడుగు వర్గాల కోసం. పేదవాడికి అన్నం పెట్టడానికి వచ్చే వాడిని… పేదవాళ్లే విమర్శిస్తూ.. పెట్టుబడిదారుల కొమ్ము కాయడం ఎంత ఘోరం?

తెలుగు సినిమాల నుంచి ఒక సీను గుర్తు చేస్తా. మురికివాడలో ఉన్న ఇళ్లను కూల్చేయడానికి అక్కడున్న దొరలు వస్తారు. బుల్డోజర్లు తెస్తారు. రౌడీలను తెస్తారు. ఈ రౌడీయిజాన్ని హీరో అడ్డుకుంటూ ఉంటే… ఆ బస్తీలోనే ఉండే పేదల్లోని ఇద్దరు చిల్లరగాళ్లు దొరలకు వత్తాసు పలుకుతారు. 

లక్షల కోట్లు కొట్టేస్తూ… పేదలకు బిస్కెట్లు వేస్తూ  తెలుగుదేశం ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తుంటే… రాష్ట్రంలో ఒక్క పేదవాడైనా ‘‘మళ్లీ బాబే రావాలి’’ అని కార్డు పట్టుకుని తిరగడం ఎంత వరకూ సమంజసం? 

తినడానికి తిండిలేని వాళ్లు ఇచ్చే పైసలకు ఆశపడతారు. వాళ్లను వదిలేద్దాం. చదువుకున్న వాళ్లు పవన్ కళ్యాణ్ గురించి లక్ష ప్రశ్నలు వేస్తుంటారు. స్తనశల్య పరీక్షలని తెలుగులో ఒక సామెత. స్త్రీ రొమ్ములో ఎముక కోసం వెదకడం అన్నమాట.

సీమస్వప్నం అనే ట్విటర్ అక్కౌంటులో ఏమున్నదీ చదవండి.

‘‘టీడీపీతో జనసేన కలిసి ఉన్నది’’ అని ప్రతిరోజూ టీవీలో అణాకాణీకి పనికిరాని వెధవ చెబుతూ ఉంటాడు. తెలుగు మీడియా తెలుగుదేశం సేవలో తరిస్తూ ఉంటుంది. జగన్ సొంత టీవీలో కూడా అదే గోల. 

జనసేన సొంతంగానే ఉంది… అని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెబుతాడు. పదే పదే చెబుతుంటే చాదస్తంగా కూడా ఉంటుంది. నమ్మేవారు నమ్ముతారు లేనివారు లేరు. సర్దార్ సినిమా తియ్యడం ఆలస్యమైందని, ఈ లోగా టీడీపీ-జనసేన కలిసిపోయినట్లుగా జరుగుతున్న ప్రచారం జనాల్లోకి వెళ్లిపోయిందని, పార్టీని ఇలా అయితే ఎలా నడుపుతారు అని కూడా ‘‘సీమ స్నప్నం’’ గారు ప్రశ్నించారు. 

భయపడి.. ఏదీ చెయ్యలేం. పార్టీని నపడటం అసాధ్యం. వాళ్లేదో అన్నారని, ప్రతి దానికీ సంజాయిషీ ఇచ్చుకుంటూ పోవడం జనసేన నైజం కాదు. రామబాణంలా పవన్ కళ్యాణ్ ఒకసారి చెబితే చాలు. ఆయనకు చెప్పాలని ఇతరులు అనుకోవడం కూడా సరికాదు. 

ఇంగ్లీషు ఛానెల్ ఈదేవాడికి ఈత నేర్పుతాను రమ్మని చెప్పడమే అవుతుంది. ఒక సారి పార్టీని రాష్ట్రంలోని పెద్ద వర్గాలు వెన్నుపోటు పొడిచాయి. ఇది జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుని పార్టీని నడుపుతున్నాడని అనుకుంటే… మనం పప్పులో కాలేసినట్లే.

ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. మొన్న ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మక దాడి కోసం ‘‘తెలంగాణలో మనల్ని తన్నుతున్నారు’’ అని అన్నారో లేదో హా… అలా ఎలా అంటారు అని అంటారు.

 చంద్రబాబు, కేసీఆర్ వంటి సీనియర్ నేతలే సవాలక్ష అబద్ధాలు చెబుతుంటారు. తెలంగాణలో దాడులేమీ జరగడంలేదని ఆయనకు తెలియదా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొందరు శుంఠలు వచ్చి… చొక్కాలు చించుకున్నారు. ఆంధ్రోళ్లు దోపిడీదారులు అన్నపుడు చిన్నకృష్ణ లాంటి వారు విలేకరుల సమావేశాలు పెద్దలేదు. అంత ఎందుకు కేసీఆర్ తప్పు మాట్లాడితే విమర్శించే సాహసం ఎంత మంది చేస్తారు? జగన్ లాంటి వాళ్లే మాట్లాడటం లేదు. 

మెగా ఫ్యామిలీ అంటే ప్రతి వెధవా మూడో కాలిపై వచ్చేస్తాడు. ఎందుకంటే వీళ్లు ఎవరి జోలికీ వెళ్లరు కదా… అదీ లోకువ. మాట్లాడే ధైర్యం, తెగువ ఎవరికి ఉన్నదీ ప్రజలకు తెలుసు. కుక్క మూతి పిందెల వల్ల ఏమీ ఉపయోగం లేదు.

రాజకీయ వ్యూహాల్లో జనసేన ప్రతి అడుగూ సరిగానే ఉన్నది. నిమ్నవర్గాల కోసం ఆయన యుద్ధమే చేస్తున్నాడు. చేయనివ్వండి. చెత్త ప్రశ్నలతో విసిగించే ప్రయత్నం చేయకండి. ప్రత్యర్థి పార్టీలు బురద వేస్తే ఏం చేయాలో పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. అలాగని బురద మనుషుల స్థాయికి ఆయన దిగజారలేడు.

అసలు 2014లో చంద్రబాబుకు మద్దతు ఇవ్వబట్టే కదా.. ఇంత దోపిడీ జరిగింది అని ‘‘సీమ స్వప్నం’’ అడిగారు. 70 ఏళ్లుగా దోపిడీ జరుగుతూనే ఉన్నది. ఇన్నాళ్లూ కళ్లు మూసుకుని అయిదేళ్లలో ఏం కాదులెండి… 

2019 నుంచి దోపిడీ అనేది మర్చిపోండి. ప్రత్యక్షంగా కావచ్చు.. పరోక్షంగా కావచ్చు… ప్రజల సొమ్ము మాత్రం భద్రం. అది మాత్రం ఖాయం!! 

Comments

Popular posts from this blog