జనసేన టీ గ్లాసు గుర్తు పై కొత్త కుట్ర !

 జనసేన టీ గ్లాసు గుర్తు పై కొత్త కుట్ర !
 

             ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. వాటిలో ప్రజల్ని డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభ పెట్టడం ఒకటైతే తెర వెనుక నడిచే వ్యవహారం మరొకటి ఉంటుంది. అదే పోలింగ్ బూతులోకి వచ్చే ఓటర్లను తికమకపెట్టడం. ఇది బయటకు కనిపించదు కానీ ఓటింగ్ సమయంలో బాగా పనిచేసి టార్గెట్ చేసిన అభ్యర్థికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. కుట్రే రాబోయే ఎన్నికల్లో జనసేనపై జరుగబోతోందని వినికిడి


         మూడు రోజుల క్రితమే పవన్ తన ఎన్నికల గుర్తు టీ గ్లాస్ అని ప్రకటించారు. గుర్తు జనాల్లోకి బాగానే వెళుతోంది. గుర్తుపై పడే ఓట్లను చీల్చడానికి ప్రత్యర్థులు అదే గుర్తును పోలి ఉన్న బకెట్, స్టీల్ గ్లాస్ లాంటి ఇతర గుర్తులను ఈసీ నుండి పొంది ఎన్నికల బరిలో తమ డమ్మీ అభ్యర్థులను నిలుబెడతారు. ఈవీఎం దగ్గరకు వెళ్లి టీ గ్లాసుకు ఓటు వేద్దామనుకున్నవారిలో కొందరు బకెట్ లాంటి గుర్తును చూసి తికమకపడి బకెట్ పైనే ఓటు వేస్తారు. అలా ఓట్లను నష్టపోయేలా చేస్తారు

      అంతేకాదు ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల పేర్ల లాంటి పేర్లనే కలిగి ఉన్న డమ్మీ అభ్యర్థుల్ని సైతం తయారుచేస్తారు. వీరంత ఇండిపెండెంట్లుగానో లేకపోతే వేరే ఏదన్నా డమ్మీ పార్టీ తరపునో నిలబడతారు. పేర్లను చూసి కన్ఫ్యూజ్ అయి ఓటర్లు డమ్మీ క్యాండిడేట్లకు ఓట్లు గుద్దేస్తారు. ఇది బాగా సక్సెస్ అయిన కుట్ర

     ఇదే తరహా మోసం మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది. అక్కడ చాలా చోట్ల కారును పోలి ఉండే ట్రక్ గుర్తును చూసి అదే తెరాస సింబల్ అనుకోని దానికి చాలా మంది ఓట్లు వేసేశారు. ఎఫెక్ట్ మెజారిటీపై బాగానే ప్రభావం చూపింది. కాబట్టి జనసేన నేతలు, కార్యకర్తలు మోసాల్ని ఓటర్లకు వివరించి టీ గ్లాసే తమ గుర్తని అందరికీ తెలిసేలా చేయాలి.

Comments

Popular posts from this blog