ఆ రెండు జిల్లాల్లో.. ఇంటెలిజెన్స్ స‌ర్వే అవుట్.. ఆ పార్టీకి దూలతీరిపోతుంద‌ట‌..?







       ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు స‌ర్వేల జోరు సాగుతోంది. ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌మ‌వ‌డంతో రోజుకో స‌ర్వే తెర‌పైకి వ‌చ్చి అక్క‌డ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల నేప‌ధ్యంలో అధికార ప్ర‌తిప‌క్షాలు నువ్వా – నేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతున్నాయి. టీడీపీ, వైసీపీల‌తో పాటు ఈసారి జ‌న‌సేన కూడా త‌న ప్ర‌తాపం చూపించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా విడుద‌ల అయిన రెండు జిల్లాల‌ ఇంటెలిజెన్స్ స‌ర్వే రిజ‌ల్ట్స్‌.. రాజ‌కీయవ‌ర్గాల్లో పెద్ద క‌ల‌క‌ల‌మే రేపుతుంది.
    ఇంటెలిజెన్స్ ఇచ్చిన స‌ర్వే రిపోర్ట్స్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన ప్ర‌భావం గ‌ట్టిగా ఉంటుంద‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి దెబ్బేసి, టీడీపీని ఓడ్డున చేర్చించి గోదావ‌రి జిల్లాలే అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్పుడు గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ పుంజుకున్నా.. అలాగే టీడీపీకి కూడా బ‌ల‌మున్నా దాదాపు ఎక్కువ నియోజ‌క వ‌ర్గాల్లో జ‌న‌సేన గెలుపు ఓట‌ముల‌ను నిర్ణ‌యించ‌నుంద‌ని తెలుస్తోంది. కాకినాడ‌తో పాటు కోన‌సీమ‌లో జ‌న‌సేన ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 

            కాపు సామాజికవ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఆ జిల్లాలో జ‌న‌సేన క‌చ్ఛితంగా వైసీపీ,టీడీపీలో ఓట్లు చీల్చ‌డం ఖాయ‌మ‌ని, అయితే ఎక్కువ‌గా టీడీపీకే న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని ఆ స‌ర్వే తేల్చేసింది. ఇక అనంతపురం జిల్లాల్లో నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపు, బ‌లిజ సామాజికివ‌ర్గానికి చెందిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో ఇప్ప‌టికే అక్క‌డ రైతు క‌వాతు నిర్వ‌హించిన ప‌వ‌న్.. ఆ సామాజిక‌వ‌ర్గాల్ని ఆక‌ట్టుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అనంతపురం, పుటపర్తి, ధర్మవరం, హిందూపురం, రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో బలిజ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

    
      ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అక్క‌డ ప‌ర్య‌టించి త్వ‌ర‌లో టీడీపీ కుంభ‌స్థ‌లాన్ని కొడ‌తామ‌ని వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఇక ఈ రెండు జిల్లాల్లో కాపు, బ‌లిజ‌లు జ‌న‌సేన‌కే మొద‌ట ప్రాధాన్య‌త ఇస్తార‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. మిగిలిన ఓట్లు వైసీపీ, టీడీపీలు పంచుకుంటాయి. అయితే సీమ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బ‌లిజ‌లు మెజారిటీ వ‌ర్గం టీడీపీ వైపు, రెడ్డి సామాజిక‌వ‌ర్గం వైసీపీ వైపు ఉన్నారు. అయితే జ‌న‌సేన ఎంట్రీతో రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఎలాంటి చీలిక రాదు, అయితే బ‌లిజ‌లు మాత్రం, త‌ప్ప‌కుండా జ‌న‌సేన వైపే మొగ్గు చూపుతారు. దీంతో మేజ‌ర్ ఎఫెక్ట టీడీపీకే అని ఇంటెలిజెన్స్ స‌ర్వే తేల్చేసింది. 

         మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఆ రెండు జిల్లాల్లో ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలియ‌దు కానీ టీడీపీకి మాత్రం గ‌ట్టి దెబ్బే కొట్ట నుంద‌ని ఆ స‌ర్వే తేల్చేసింది. ఇది ఫేక్ స‌ర్వే అని కొంత‌మంది కొట్టేయ‌చ్చు.. కానీ తాజా ప‌రిస్థితులు చూస్తే.. మాత్రం ఆ స‌ర్వే చెప్పినా చెప్ప‌క‌పోయిన వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌రిగేది మాత్రం ఇదే అని రాజ‌కీయ‌విశ్లేష‌కులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Comments

Popular posts from this blog