తెలంగాణలోని కొన్ని ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ఎన్నికలు ఎట్టకేలకు ముగిసిపోయాయి.అయితే ఎక్కడైనా ఎన్నికల ముందు ఒకరి పార్టీల మీద ఒకరు వారి యొక్క బలాబలగాలను తెలుసుకునేందుకు సర్వేలు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సర్వేలు చేయించుకుంటారని అందరికి తెలుసు.అయితే తెలంగాణలో జాతీయ సర్వేల్లో వచ్చిన ఫలితాల దగ్గర ప్రాంతీయ నేతలు చేయించిన సర్వేలు తేలిపోయాయి.కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల దగ్గరకి వచ్చింది.ఇంకా కొన్ని నెలలు మాత్రమే గడువు మిగిలి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీలు వారి పార్టీని ప్రజల్లో నిలిపిందేకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలా చూసుకున్నా మూడు ముఖ్య పార్టీలే ప్రజలకు కనిపిస్తున్నాయి.దానికి తోడు “జనసేన” పార్టీ మీదనే అందరి కళ్ళు ఉన్నాయి.పవన్ కు ఎలాగో ప్రజాధరణ ఎక్కువే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పవన్ చాలా బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు పవన్ ని...
ప్రశ్న: కాపులకు రిజర్వేషన్ల అవసరం ఏంటి ? జవాబు: బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో 1915 నుంచే కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉండేవి. ఆ రోజుల్లో దళితులకు, గిరిజనులకు, మూడో కేటగిరిలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవి. వాటిని తొలగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తే డాక్టర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ అడ్డుకున్నారు. వారి కృషి వల్ల ఆ రిజర్వేషన్లను తొలగించకుండా బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసివేయాలనుకున్నారు. తీసివేశారు. ఆ తర్వాత 1961లో అప్పటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 'కాపులకు గోచీలు కూడా ఉండవే. వీళ్లు ఓసీలేంటి? వీళ్ల బతుకులు ఓసీ బతుకులా? చాలా కష్టాల్లో ఉన్నారు' అని అంటూ ఓ జీవో ద్వారా రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించారు. అవి 1966 వరకూ కొనసాగాయి. ఆ తర్వాత పునరుద్ధరించాలని కోరుతూ మా పెద్దలు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలు చేసి.. రోడ్డు మీదకి వచ్చీ అలసిపోయారు. లాఠీల దెబ్బలు తిన్నాం. బూటు కాళ్లతో తన్నించుకున్నాం. కేసులు పెట్టించుకున్నాం.
40 ఏళ్లుగా వైద్యసేవలు ప్రజల కన్నీటి నివాళి చెన్నై , టీ.నగర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేవలం ఐదు రూపాయలకే వైద్య చికిత్సలందిస్తూ వచ్చిన డాక్టర్ జయచంద్రన్ (71) బుధవారం కన్నుమూశారు. చెన్నై వాషర్‌మెన్‌పేటలో డాక్టర్ జయచంద్రన్ అంటే ఎవరికీ తెలియదు. ఐదు రూపాయల డాక్టర్ అంటే ప్రజలందరికీ సుపరిచితులు. ఆ స్థాయికి ప్రజల మన్ననలందుకున్న డాక్టర్ జయచంద్రన్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఓల్డ్ వాషర్‌మెన్‌పేట వెంకటేశన్ వీధిలోగల ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన కుమార్తె శరణ్య స్థానిక స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు శరత్ ఓమందూరర్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యునిగాను, మరో కుమారుడు శరవణన్ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జయచంద్రన్ భార్య డాక్టర్ వేణి ప్రసూతి వైద్య నిపుణురాలు. చెన్నై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డీన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. మొత్తం కుటుంబం వైద్య రంగంలో పేరు గడించింది. వైద్యం వృత...
Comments
Post a Comment