పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు సిసలైన రాజకీయ పరీక్షని ఎదుర్కోబోతున్నాడు. జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌పై ద్రుష్టి పెట్టాడు. జనసేన పార్టీ తపుపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన గత కొన్నిరోజులుగా జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పొటీ చేయబోతున్నారు. ఆ నియోజకవర్గాలు ఇవే: పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ముందు నుంచి విశాఖ జిల్లా గాజువాక పేరు బలంగా వినిపిస్తోంది. గాజువాక నుంచి పవన్ బరిలో దిగడం ఖరారయింది. గాజువాకతో పాటు భీమవరంలో కూడా పవన్ పోటీ చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. తొలిసారి పవన్ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో సినీ రాజకీయ వర్గాల్లో గాజువాక, భీమవరం గురించి చర్చ మొదలయింది. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్: ఆంధ...
విజయవాడ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ తెలుగుదేశం ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఉన్న కాపులు దీనిపై తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. తెరవెనుక కాపు సామాజిక వర్గం మొత్తం.. సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ‘‘మంత్రులతో సహా 25 మంది కాపు నేతల తిరుగుబాటు?’’ శీర్షికతో విజయవాడలోని స్వర్ణాంధ్ర సాయంకాలపు పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనిపై ‘‘న్యూస్ ఆఫ్ 9’’ విచారించగా… అలాంటి వాతావరణం ఉందని, ఇది నిజమేనని తేలింది. ఈ పత్రిక అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నయి. మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు ఎంపీలూ, ఇతర ముఖ్యనాయకులు అంటే మొత్తం 25 మంది కీలకమైన నేతలు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఒక్కొక్కరుగా రావడం కంటే మూకుమ్మడిగా వస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఆలోచన కూడా సాగుతోంది. వీరిలో చాలా మంది ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్నారని, ఆయనకు సానుకూలంగా స్పందించారని చ...
కళ్ల ముందున్న మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీలూ, వాటి నేపథ్యం తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. మూడో పార్టీ జనసేన. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది. డబ్బు లేని రాజకీయం చేస్తానని వచ్చింది… అలాగే మాటకు కట్టుబడి ఉంది. అయినా.. జనసేన గురించి సవాలక్ష అనుమానాలు. ట్వట్టరు లేదా సోషల్ మీడియాలో ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ గురించే. పవన్ విదేశాలకు వెళుతున్నాడంటగా…? జనసేన ఆఫీసులు మూసేస్తున్నారంటగా..? రెండు సీట్లే వస్తున్నాయంటగా…? మళ్లీ సినిమాలు చేసుకుంటాడంటగా…? 30 సీట్లు వస్తే.. చంద్రబాబుకు మద్దతు ఇస్తాడంటగా..? బుద్ధున్న వాళ్లు ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగరు. లక్షలాది మంది జనం మద్దతు ఉన్నపుడు పవన్ కళ్యాణ్ ఎవరికో ఎందుకు మద్దతు ఇస్తాడు? ‘‘ఎన్నాళ్లు పల్లకీలు మోస్తాం’’ అన్న మాటలో తీవ్రత అర్థం కావడం లేదా? ఇది కూడా అర్థంకానివాళ్లు తగుదునమ్మా అంటూ రాజకీయాలు ఎందుకు మాట్లాడటం? బతుకుల్లో కూడా ఆనందం ఉంది అనుకుంటూ దాని కోసం అక్కడే వెదుక్కునే వాళ్లకు జనసేన పార్టీ అక్కర్లేదు. ఇంకా నమ్మకం లేకపోతే అలెక్సీ హేలీ రాసిన...
Comments
Post a Comment