పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా.. భీమవరం సెంటిమెంట్ గురించి తెలుసా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు సిసలైన రాజకీయ పరీక్షని ఎదుర్కోబోతున్నాడు. జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌పై ద్రుష్టి పెట్టాడు. జనసేన పార్టీ తపుపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన గత కొన్నిరోజులుగా జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పొటీ చేయబోతున్నారు. ఆ నియోజకవర్గాలు ఇవే: పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ముందు నుంచి విశాఖ జిల్లా గాజువాక పేరు బలంగా వినిపిస్తోంది. గాజువాక నుంచి పవన్ బరిలో దిగడం ఖరారయింది. గాజువాకతో పాటు భీమవరంలో కూడా పవన్ పోటీ చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. తొలిసారి పవన్ ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో సినీ రాజకీయ వర్గాల్లో గాజువాక, భీమవరం గురించి చర్చ మొదలయింది. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్: ఆంధ...
Comments
Post a Comment