అసలు నిజాలు

 అసలు నిజాలు
 
ఏపీ 13 జిల్లాల అసెంబ్లీ స్థానాలు 175. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచింది 140 సీట్లు.. 2009 ఎన్నికల్లో గెలిచింది 107 స్థానాలు. 2014లో ఆయన కుమారుడు జగన్.. తన తండ్రి పేరు చెప్పుకుని గెలిచిన స్థానాలు 67. 2004- 140.. 2009- 107.. 2014- 67.. మరి 2019: ? 125, 150, ఇవీ వైసీపీ సర్వేలు చెప్పే ఫలితాలు. టీడీపీ తరపు మీడియా కూడా ఇవే అంకెలను తారుమారు చేసి చూపిస్తుంది. అంతే కానీ ఎక్కడా జనసేన ఉనికి ఉండదు.

వైఎస్సార్ ప్రభావం ఎలా తగ్గుతూ వస్తోందో పై రిజల్ట్ చెబుతోంది.. ఇది నిజమా కాదా? ఓసారి చెక్ చెయ్యండి.

ఇక టీడీపీ 2009లో ఏపీలోని 13 జిల్లాల్లో గెలుపొందినవి 53 స్థానాలు. కానీ 2014లో 102 స్థానాలు గెలిచారు. అయితే ఎలా ఎవరి వల్ల 100 శాతం ఎక్కువ స్థానాలు గెలిచారో.. వాళ్ళకీ తెలుసు. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతు అడగడానికి తండ్రితోపాటు వెళ్ళిన లోకేష్.. ఎన్నికల్లో మేము గెలవక పోయినా.. మాకు అండగా ఉంటారా? అని ప్రాధేయపడ్డారని పవన్ అన్నారు. అంటే అప్పటికి వారి కెపాసిటీ ఏమిటో స్పష్టంగా అర్థం అవుతోంది.

ఇక ఎన్నికలలో ఎలా దూసుకుపోతున్నారో మీ నియోజక వర్గాల్లో టీడీపీ పార్టీ నాయకుల అవస్థలు చూస్తే అర్థమవుతుంది. ఎవరూ చెప్పాల్సిన పని లేదు.

Comments

Popular posts from this blog