
మోడీకి దత్త పుత్రుడు- లోకేష్ అంటే నమ్ముతారా?
లేక మోడీకి దత్త పుత్రుడు- పవన్ కళ్యాణ్ అంటే నమ్ముతారా?
ఎవరు పేరు చెబితే ప్రజలు నమ్ముతారు?
లేక మోడీకి దత్త పుత్రుడు- పవన్ కళ్యాణ్ అంటే నమ్ముతారా?
ఎవరు పేరు చెబితే ప్రజలు నమ్ముతారు?
నాలుగన్నరేళ్లు భారతీయ జనతాపార్టీతో అంటకాగి, ఇపుడు గురివింద కబుర్లు చెబితే ఎవరు వింటారన్నది ప్రశ్న.
మోడీ దత్తపుత్రుడు అంటూ లోకేష్ తన ట్విటర్ అక్కౌంటులో పవన్ ను
సంబోధించడం చిత్రంగా ఉంది. నిన్నమొన్న భాజపాతో తెగతెంపులు చేసుకునే వరకూ
భాజపాతో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అంటకాగిన విషయం అందరికీ
తెలిసిందే. గుంటూరులో జరిగిన సభతోనే పవన్ తెలుగుదేశంతో విభేదించారు.
అధికారంలో ఉండి… భాజపాతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇపుడు పార్టీ
సిద్ధాంతాలను తుంగలో తొక్కి, అవకాశవాద పార్టీగా తెలుగుదేశానికీ,
అవకాశవాదిగా తనకూ చెడ్డ పేరు తెచ్చుకున్న చంద్రబాబు తనయుడేనా ఇలా
మాట్లాడేది? ఇలా అడ్డంగా మాట్లాడటానికి లోకేష్ ఎలా సాహసిస్తాడనేది వెయ్యి
డాలర్ల ప్రశ్న.
అవును. ‘‘ఆవు చేలో మేస్తే… దూడ గట్టున మేస్తుందా?’’ అన్న
సామెత ఉండనే ఉన్నది. లోకేష్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడవాలని
భావిస్తున్నట్లున్నది. చంద్రబాబు ఏదీ ఉన్నది ఉన్నట్లు చెప్పడం గతంలోనూ
లేదు. కొత్తగానూ రాదు. ప్రజలకు నిజాలు తెలియకూడదు… ప్రజలకు నిజాలు
చెప్పకూడదు… ఇదీ చంద్రబాబు ఏకైక సిద్ధాంతం. చెప్పాలనుకున్న అబద్ధాలు
చెప్పేస్తారు. టీవీలు చూపిస్తాయి. దాని మీద టీవీల్లో విశ్లేషణలు కూడా
ఉండవు.
పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చూస్తుంటే… ఆ మాటలు గుండె లోతుల్లో నుంచి
వస్తున్న విషయాన్ని ఇట్టే గుర్తించవచ్చు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నపుడు ఆ
వ్యక్తి ముఖంలోకి సూటిగా చూస్తే… ఆ వ్యక్తి కావాలని అబద్దం చెబుతున్నాడా?
లేక గుండె లోతుల్లో నుంచి మాట్లాడుతున్నాడా అన్నది అర్థమైపోతుంది. జన సేన
అధ్యక్షుడు వపన్ కళ్యాన్ తొలి నుంచీ ఒకటే మాట్లాడుతున్నారు. స్పెషల్
ప్యాకేజీ వద్దు… స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాత్రమే కావాలంటూ గొంతెత్తి మరీ
అరుస్తున్నారు.
ఎక్కడో ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ, ప్రధాని మోడీకి కూడా
వినిపించాలంటూ బిగ్గరగా అరుస్తూ… పాచి పోయిన లడ్డూలు ఇచ్చారంటూ భారతీయ జనతా
పార్టీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా
భాజపాని అంత తీవ్రంగా విమర్శించిన దాఖలా ఒక్కటీ లేదు. మొన్న ఢిల్లీ
వెళ్లినపుడు చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాత్రమే భాజపా గురించి
విమర్శిస్తూ మాట్లాడారు. అది కూడా సొంత పారిశ్రామికవేత్తలపై ఆదాయపు పన్ను
శాఖ దాడులు చేయడం మొదలు పెట్టిన తర్వాతనే… చంద్రబాబు కేంద్రంపై యుద్ధానికి
సిద్ధపడ్డారు. అప్పటి వరకూ భాజపా అంటే మిత్రపక్షంగానే భావించారు. కేంద్రం
ఏం చెబితే దానికి తల ఊపారు. ఇపుడు చేస్తున్న యుద్ధం కూడా సొంత సామాజిక
వర్గానికి చెందిన హక్కుల కోసం, వారి భవిష్యత్తు కోసం తప్ప ప్రజల కోసమా?
టీవీల్లో చెప్పడం మాత్రం ప్రజల కోసమేనని చెబుతారు.
స్పెషల్ ప్యాకేజీని సమర్ధిస్తూ… లోకేష్, ఇతర మంత్రులు ఢిల్లీలోనూ,
అమరావతిలోనూ అనేక విలేకరుల సమావేశాలను నిర్వహించారు. ఇన్నిసార్లు భారతీయ
జనతాపార్టీ పాటనే మళ్లీ మళ్లీ పాడిన తెలుగుదేశం భాజపా దత్తత తీసుకున్న
పార్టీ అవుతుంది. తెలుగుదేశం మంత్రులు భాజపా దత్తపుత్రులు అవుతారు. లోకేష్…
మోడీకి దత్త పుత్రుడు అవుతాడు. అంతే కానీ, పవన్ కళ్యాణ్ ఎలా అవుతాడు?
ఆకాశం మీదు ఉమ్మితే వచ్చి ముఖానే పడుతుందని సామెత. తెలుగుదేశం పార్టీ,
ముఖ్యంగా లోకేష్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
తెలుగుదేశం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో దానికే తెలియదు. ఏ ఎండకు ఆ గొడుగు
సామెత. నిన్నటి వరకూ స్పెషల్ ప్యాకేజీ అన్నారు. ఇపుడేమో… మళ్లీ స్పెషల్
స్టేటస్ అంటారు. ప్రజలు కూడా ఇపుడు ఎలా ఆలోచిస్తున్నారంటే… చంద్రబాబు అలాగే
మాట్లాడతారు కదాండి… అలా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి అన్నంత వరకూ
వచ్చేశారు. తెలుగుదేశం పార్టీ, దాని అధినేతగా చంద్రబాబు… మంత్రులు గానీ
ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలియదు. నమ్మకాన్ని కోల్పోయినా
తెలుగుదేశం పార్టీ మీడియాను అడ్డం పెట్టుకుని కొంత వరకూ ప్రజల్ని
మభ్యపెట్టగలుగుతున్నది. ఇహ… లోకేష్ ను మంత్రిని చేసినా… ఆయన అపరిపక్వత అనేక
సార్లు బహిర్గతం అయింది. కనుక… లోకేష్ మాటల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరనే
అనుకోవచ్చు.
మరో విషయం ఏమంటే… ఈ మధ్య లోకేష్ కొడుకు… టీవీలో మోడీ కనిపించినప్పుడులా
తాత, తాత అంటున్నాడట. మరి బంధుత్వాలు ఎవరికి ఉన్నాయో మీరే చెప్పాలి అంటూ
పోరాట యాత్ర సభలో పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. అబద్ధాన్నే నిజం అని
తండ్రీకొడుకులు ఇద్దరూ నమ్ముతారు. దాన్నే ప్రచారంలో పెడతారు. తెలుగు ప్రజల
ప్రారబ్ధం అనుకోవాలి. అంతే !!
Comments
Post a Comment