మెంటల్ కృష్ణ… ది గుడ్ విల్ అంబాసిడర్!!.......మురళి ఊదుతుంది ఎవరికోసం "కమ్మ"దన కోసమా???

హైదరాబాద్: హఠాత్తుగా పోసాని కృష్ణ మురళి (మెంటల్
కృష్ణగా ప్రసిద్ధులు) టీవీల్లో ప్రత్యక్షమైపోయి… ‘‘నేను కమ్మవాడిని’’ అంటూ
చక్కగా ఆ సామాజిక వర్గం మనసులో మాటల్ని చెబుతారు. వాళ్లు ఏం చేస్తున్నారో
చెబుతారు. ఏం చేయకూడదో చెబుతారు. పోసాని హాస్య చతురతకు మీడియా కూడా చాలా
ఇష్టంగా ఆయన విలేకరుల సమావేశానికి ప్రాధాన్యం ఇచ్చి మరీ కవర్ చేస్తుంది.
చాలా సీరియస్ విషయాలను మధ్య మధ్యలో చెబుతూ… హాస్య గుళికల మధ్యలో వాటిని
వదులుతూ హోమియోపతి మాత్రల్లా ప్రజలకు చికిత్స చేయడంలో పోసాని చాలా
అనుభవాన్నే సంపాదించారు.
కమ్మ సామాజిక వర్గం ఇలా ఆలోచిస్తోందని చెప్పడానికి
వారి తరఫున నియమితులైన పోసాని… వారికి ఒక గుడ్ విల్ అంబాసిడర్. మరి ఎవరో
ఒకరు ఉండాలిగా..దర్శకుడు రాఘవేంద్రరావు లాంటివారు ఈ విషయాలను చెప్పలేరు కదా! చంద్రబాబు
కులంపేరుతో అసలే చెప్పలేరు. తెలుగుదేశం కోసం ఒక గురుడ శివాజీ, పోసాని… ఇలా
చాలా మంది నటీనటులు వస్తుంటారు. వారి వారి పాత్రలు పోషించి వ్యూహం ప్రకారం
నటించేసి చెప్పాల్సిందే చెప్పేసి మళ్లీ తెర వెనుక ఉంటారు. ఆడించే వ్యక్తి
అమరావతిలో కదా ఉండేది. ఇదంతా అధికారం కోసం జరిగే ఒక ‘‘ఆట’’ అనుకోండి!!
పోసాని ఒక గుడ్ విల్ అంబాసిడర్ గా తన బాధ్యత్నల్ని ఎలా నెరవేర్చుతున్నారన్నది ఇపుడు చూద్దాం.
ఒకసారి.. రివైండ్…
తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర విభజనను ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కమ్మ సామాజిక
వర్గం వారు కాలక్రమేణా… తెరాసను ఆమోదించక తప్పని పరిస్థితికి వచ్చారు. లేదా
వారిని తెరాస వాళ్లు బలవంతంగా మెడలు వంచి ఈ
స్థితికి తెచ్చారన్నది వాస్తవం. తెలంగాణ ఉద్యమ సమయంలో సహకరించకపోతే… ఈనాడు
దిన పత్రికలను తెరాస కార్యకర్తలు కరీంనగర్ లో దగ్ధం చేశారు. రామోజీ ఫిల్మ్
సిటీని వెయ్యి నాగళ్లతో దున్నేస్తానని స్వయంగా కేసీఆర్ బహిరంగంగా వార్నింగ్
ఇచ్చారు. దీంతో ఈనాడు యాజమాన్యం కూడా దిగివచ్చి తెరాసకు సహకరించాల్సిన
పరిస్థితి…
హైదరాబాదులో ఉన్న అనేక వ్యాపార సముదాయాలు, భవంతులపై
తెరాస కార్యకర్తలు రాళ్లు విసరడంతో అనేక వాణిజ్య భవంతులకు నెట్లు
కట్టుకున్న పరిస్థితి…. ఇప్పుడు ఈ నేపథ్యాన్ని చెప్పడానికి ఓ ముఖ్యమైన
కారణం ఉంది. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఇక్కడ జరిగిన
ఎన్నికల్లో పాల్గొనడంపై ఆ పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గం
తీవ్రస్థాయిలో (తెలంగాణ ప్రజల దృష్టిలో) నిందలు పడే పరిస్థితి వచ్చింది
(ఇదంతా ప్రజల దృష్టిలో నుంచే చెప్పుకుందాం).
తెలంగాణను దెబ్బకొట్టడానికి
తెలుగుదేశం పార్టీ దన్నుతో మళ్లీ కమ్మ సామాజిక వర్గం ప్రయత్నిస్తోందా అన్న
అనుమానాలు రావడంతో తెలంగాణ ప్రజా సమూహాలు మూకుమ్మడిగా ప్రజా కూటమిని తుంగలో
తొక్కేశాయి. తెలుగుదేశం పార్టీకి తలెత్తుకోలేని పరాభవం ఎదురైంది. (ఇదంతా
తెలుగుదేశం పార్టీ కావాలనే చేసింది. తెలియక కాదు. ఎందుకన్నది తర్వాత
తెలుసుకుందాం).
దీని
తీవ్రతను తగ్గించేందుకు సినిమా నటుడు పోసాని కృష్ణ మురళి రంగంలోకి దిగి…
కమ్మవారు మొత్తం తెలంగాణలో తెరాసకే ఓటు చేశారని విస్పష్టంగా ప్రకటించారు.
ఇది కేసీఆర్ కు భయపడి కాదు… తెలంగాణ ప్రజల దృష్టిలో తెలంగాణ కమ్మలు వేరు…
కోస్తా కమ్మలు వేరు అని పోసాని విడదీశారు. తెరాస గెలుపులో తమ మద్దతు కూడా
ఉందని చెప్పారు. కాబట్టి.. ఇపుడు తెలంగాణ ప్రజల దృష్టిలో తెలంగాణలో ఉన్న
కమ్మవారు మొత్తం తెరాసాకే ఓటేసి ఉంటారు అన్న భ్రమ ఒకటి క్రియేట్ అయింది.
ఇంత వరకూ బాగానే ఉంది. మరి ఏపీ రాజకీయాల్లో ఉన్న పార్టీలు- తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, కాంగ్రెసు, జనసేన, భాజపా, వామపక్షాలు. వాపమపక్షాలతో కలిసి జనసేన పోటీ చేస్తోంది. ప్రధానంగా పోటీ ఉండేది తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ. ఈ ముక్కోణపు పోటీలో పోసాని చెప్పినట్లు చేయడం అంటే, తెలుగుదేశానికి ఓటు వేయవద్దని చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఉన్న పార్టీలు జనసేన, వైఎస్సార్సీపీ.
పోసాని కృష్ణ మురళి మాట్లాడిన విధానం చూస్తే… ఆయన ఆ సామాజిక వర్గానికి
చెందిన భావాలనే వ్యక్తం చేశారు. చాలా కన్వీనియంట్ గానూ,కాస్త
హాస్యాన్ని మేళవించి కూడా చెప్పగల చతురత ఆయన సొంతం. చెప్పేదానిలో చాలా
సీరియస్ అంశాలనే చెబుతుంటారు. కోస్తా జిల్లాల్లో తెలుగుదేశానికి మద్దతుగా
ఉన్న కమ్మ సామాజిక వర్గం వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న ప్రశ్నను పోసాని
కృష్ణ ప్రజల ముందు ఉంచారు.
పోసాని తన ముందు మాట్లాడుతూ… చిరంజీవి తనకు
ముందు టిక్కెట్టు ఇచ్చిన వ్యక్తి అని చెప్పారు బాగానే ఉంది. చివర్లో మాత్రం
జగన్ మంచివాడనీ, జగన్ తప్పు చేసినట్లు తాను
నమ్మడంలేదని చెప్పుకొచ్చారు. అంటే కమ్మవారు చాలా మంచివారు అని కూడా
చెప్పారు. ఇప్పుడు తమకు తెలంగాణలో ఉన్న వెలమలపైనగానీ, తెరాసపైన గానీ
వ్యతిరేకత లేదని తేల్చిపారేశారు. ఇపుడు ఆంధ్రలో ఉన్న జగన్ చాలా మంచివాడని,
అటువంటి మంచివాళ్లకే ఓటేయమని, చంద్రబాబుకు వద్దని కూడా చెప్పారు. అక్కడున్న
రెడ్డిని సమర్ధించడం ద్వారా… తాము ఓపెన్ గా ఉన్నామన్న భావనను జనాల్లోకి
పంపించగలిగారు. ఇది ప్రస్తుత వాతావారణానికి సరిపోయే స్క్రిప్టు అన్నమాట.
ఆంధ్ర ఎన్నికలు దగ్గరకొచ్చిన తర్వాత మరో కొత్త స్క్రిప్టు రెడీ అవుతుంది.
అంతా మైండ్ గేమ్ !!
సమస్య
ఏమిటంటే…. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతుతో చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది.
కానీ ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం రాని పక్షంలో… ఎవరి ప్రభుత్వం వస్తుందని
కమ్మ సామాజిక వర్గం నమ్ముతోంది? జగన్
ప్రభుత్వం వస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. అందుకే పోసాని జగన్ కు
బాహాటంగానే మద్దతు పలికారు. మరి ఇంకా సమస్య ఏమిటి అనదే కదా మీ అనుమానం.
గత 70 సంవత్సరాలుగా అధికారం కోసం పోరాడుతున్నది ఈ రెండు వర్గాలే. ఒకసారి పోట్లాడుకున్నా, మరోసారి
కలిసి ఉన్నా ఈ రెండు డబ్బున్న వర్గాల మధ్యనే పోరాటమైనా, సయోధ్య అయినా.
అందుకే ఒక సారి మీరు… ఇంకోసారి మేము అన్న ధోరణిలో ఈ రెండు వర్గాలు
రాజకీయాధికారాన్ని పంచుకుంటున్నాయి. మిగిలిన 90 శాతం సామాజిక వర్గాలు
మాత్రం వంచనకు గురవుతున్నాయి. అందుకుని ప్రధానమైన
రెడ్డీ, కమ్మ సామాజిక వర్గాల్లో ఒకరంటే రెండో వారికి భయం. వీళ్లద్దరూ
తప్ప.. మూడో వ్యక్తి రంగంలో ఉన్నది కూడా ఈ రెండు వర్గాలూ కనీసంగా
గుర్తించవు.
ఎప్పటికప్పుడు.. ఒక నాటకానికి తెరతీయడం, అందులో నుంచి లబ్ది పొందండం తెలుగుదేశం పార్టీ వ్యూహం.
ఈ
సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే.. కమ్మ సామాజిక వర్గం మొదటి నుంచీ
డబ్బున్న వర్గం కాబట్టి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉంటుంది? దాని
విధానం ఏమిటి అన్నదానిపై ప్రతిక్షణం కమ్మ సామాజిక వర్గం తెలుసుకుంటుంది.
అంచనా వేస్తుంది. పావులు కదుపుతుంది. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలతో
ముడిపడిన అంశమిది. ఎవరు అధికారంలో ఉంటే… తమకు వ్యాపరపరంగా మంచిది అన్నదే
వారి ఆలోచన. జగన్ వస్తే.. కమ్మవారి వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుందేమోనన్న
భయం వారిలో బలంగా ఉంది.
నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డితో తొలినాళ్లలో ఈగో
సమస్యలు వచ్చినా… తర్వాతి కాలంలో ఆయన కమ్మవారికి వ్యతిరేకంగా ఎలాంటి
నిర్ణయాలూ తీసుకోలేదు. ఎవరైనా తేలికగా ఆయన్ను కలిసేవారు. ప్రాజక్టులూ
తెచ్చుకునే వారు. ‘‘మీరు కమ్మవారు కదా.. అని బిడియపడకండి.. మీ మీ పనులు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా’’ అంటూ ‘‘క్యాష్ అండ్ క్యారీ’’ విధానం
గురించి స్పష్టంగా ఆయన చెప్పేవారన్నది అప్పట్లో అందరికీ తెలిసిందే.
అయితే.. జగన్ విషయంలో మాత్రం వారికి ఒక భరోసా దొకరడం లేదు. అదీ వారి భయం.
ఇదంతా పోసాని మురళి ప్రసంగంలో అంతర్లీనంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది
తప్పు కూడా ఏమీ కాదు. వ్యాపార సామ్రాజ్యం అన్న తరువాత.. ఆ మాత్రం భయాలు
ఉంటాయి!
ఇపుడు జగన్ గురించి సానుకూలంగా
మాట్లాడుతున్నారంటే.. రేపన్న రోజున జగన్ కు చెక్ పెట్టడానికే ఈ ఎత్తుగడ
అన్నది అర్థం అవుతోంది. ఈ రెండు సామాజిక వర్గాలూ ఎత్తులకు పైఎత్తులు
వేసుకుంటూ 5 కోట్ల మంది ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తున్నాయి. మైండ్ గేమ్స్
ఆడుకుంటు కోట్లాది రూపాయలను మాత్రం తమ బొక్కసాల్లో నింపుకుంటున్నాయి. సేఫ్
డిస్టెంన్స్ లో అంటే ఒడ్డున కూర్చుని… తెరాస కూడా ఇందులో కీలకపాత్ర
పోషిస్తోంది.
Comments
Post a Comment