రైతన్నలూ… యుద్ధానికి సన్నద్ధం అవుదాం: పవన్ కళ్యాణ్

      


    అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇపుడు సేకరించిన 33,500 ఎకరాలకు తోడు మరో 2,400 ఎకరాలను భూసేకరణ చట్టం కింద సేకరించేందుకు ప్రయత్నించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం అయితే, సమరభేరికి సిద్ధమని చెప్పారు. రైతులందరూ ఇందుకోసం ఉద్యమించాలని, బహుళ పంటలు పండే భూముల్ని రాజధాని కోసం సేకరించడమేమిటని ఆయన ప్రశ్నించారు. 

            ఆయన ఈ మేరకు ట్విటర్ లో స్పందించారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ప్రచురించిన వార్త క్లిప్పింగ్ ను ఆయన తన ట్వీట్ కు జత చేశారు. కొత్త భూసేకరణ చట్టం నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నామని, అది రాగానే భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని సీఆర్ డీఏ అధికారి చెరుకూరి శ్రీధర్ చెప్పినట్లు ఆ వార్త పేర్కొంది. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో ఇప్పటి వరకూ 33,500 ఎకరాలు సేకరించారు. ఇదే ప్రాంతంలో ఇంకా 2,400 ఎకరాలు మిగిలిపోయి ఉన్నది. 

     ఉండవల్లి, పెనుమాక, నిడమానూరు గ్రామాల నుంచి మాత్రం భూసేకరణపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెస్తున్న కొత్త భూసేకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడింది. ఈ చట్టం ప్రకారం భూసేకరణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.


Comments

Popular posts from this blog

జనసేన పైన జగన్ రహస్య సర్వే

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్

జనసేన టీ గ్లాసు గుర్తు పై కొత్త కుట్ర !