అంబేద్కర్ మార్గం: జనసేన వలంటీర్ల మార్గం





              ఓ గొప్ప మార్పు రావాలి. అందుకు తొలి అడుగు పడింది. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు వర్గాల అభ్యున్నతి దిశగా తొలి భానుడు ఉదయించాడు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మాకూ ఓ జీవితం కావాలి అంటూ జనసైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కవాతు చేస్తోంది. అవినీతి లేని సమాజం కోసం తపిస్తోంది. కదిలి పవన్ వెంట నడుస్తోంది. జనసేన పార్టీ సుమున్నత లక్ష్యాలతో బడుగు జన సమూహాలను పార్టీ కదిలిస్తోంది. ఇపుడు ఎక్కడ చూసినా జన సైనికులు వేలాది, లక్షలాదిగా ఉన్నారు. 

మరింత సమున్నతంగా పవన్ కళ్యాణ్ తన లక్ష్యాలను సాధించాలంటే జన సైనికులు అనేక విషయాలను తెలుసుకోవాల్సి ఉంది. జనసేన కొత్త తరం నాయకులను కూడా తయారు చేయబోతున్నది. మీలో కూడా నాయకులు రావాలి. అందుకు ఇది తప్పకుండా ఉపకరిస్తుంది.

డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో పవన్ సైనికులను నడిపిస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ లేబర్ పార్టీని నిర్వహించినపుడు పార్టీ సభ్యులు ఎంత క్రమశిక్షణతో ఉండాలో చెప్పారు.

మీ విధుల్ని మీరు నిర్వర్తించాలంటే… 

మీరు సమున్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. 
మానవత్వం ఉన్న మనిషి అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా సమాజంలో అందరూ మీవైపు చూడాలి. 
ఒకవేళ మీకు చెడు అలవాట్లు ఉంటే వాటిని వదిలివేయండి. 
తాగుడు, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండండి. 
నిరాడంబరంగా ఉండాలి. కర్తవ్యం పట్ల గట్టిగా ఉండండి. 
ప్రవర్తన విషయంలో పూర్తి క్రమశిక్షణ అవసరం. 
వంద మందిలో… మీరు ఒకరు కాదని గుర్తించండి. 
మీరు యోధులు. వంద మందిలో ఒకడుగా ఉండటానికీ, యోధుగా ఉండటానికీ తేడా స్పష్టం. 
సుశిక్షుతులైన, క్రమశిక్షణ కలిగిన డజను మంది ఉంటే… వారు వేలాది మందిని ప్రభావితం చేయగలరని గుర్తించండి. 
సాధారణ ప్రజానీకానికీ, మీకూ అదే తేడా’’

ఇదీ అంబేద్కర్ మహాశయుడు చేసిన ప్రసంగం. ఈ ప్రసంగం నుంచి ఎవరైనా స్ఫూర్తిని పొందవచ్చు. జన సైనికులు కూడా అంబేద్కర్ చెప్పిన బాటలో నడుస్తారని ఆశిస్తూ…

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్