జనసేన పార్టీ గుర్తు....పవన్ ముందు జాగ్రత్త


 

          ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మూడో బలమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పవన్ యొక్క “జనసేన” పార్టీయే అని చెప్పాలి.అయితే అతని యొక్క పార్టీ స్థాపించబడి దాదాపు ఐదేళ్లు పూర్తి కావస్తుంది.ఇంకా ఇక్కడ ఎన్నికలకు కూడా నెలల సమయంలోనే వ్యవధి కూడా ఉంది.పార్టీ నుంచి అన్ని పనులు జరుగుతున్నాయి కానీ అసలు జనసేన పార్టీకి ఓటు వేయాల్సిన గుర్తు ఏమిటి అన్నది ఇంకా తెలీలేదు.అయితే అప్పుడు జనసేన పార్టీ యొక్క గుర్తు పిడికిలి అని అందరు అనుకునేవారు,దానితో పవన్ తన పార్టీకి ఇంకా ఎలాంటి గుర్తు ఖరారు చెయ్యలేదు అని తెలిపారు.


జనసేన పార్టీ మీద ఇతర పార్టీల నేతలు కూడా ప్రధానంగా విసిరే విమర్శ కూడా ఇదే అసలు మీ పార్టీ గుర్తు ఏమిటి అని అడిగేవారు కూడా లేకపోలేరు.ఈ మధ్య జరిగిన “జనసేన తరంగం” కార్యక్రమంలో కూడా చాలా మంది మీ పార్టీ గుర్తు ఏమిటి అని అడిగే వారు కూడా ఉన్నారని పలువురు పవన్ అభిమానులు కూడా తెలిపారు.

      అయితే పవన్ ఇంకా తన పార్టీకి సంబందించిన గుర్తు ఏమిటి అన్నది ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం వెనుక చాలా పెద్ద రహస్యమే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.అప్పట్లో పవన్ యొక్క అన్నయ్య చిరంజీవి యొక్క పార్టీ “ప్రజా రాజ్యం” విషయంలో జరిగిన తప్పు నుంచి పవన్ చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.

          ఎందుకంటే ముందుగానే పార్టీకి గుర్తు వచ్చేస్తే ఇతర పార్టీల వారు కుమ్మక్కయ్యి జనసేన అభ్యర్థులు పోటీకి నిలబడ్డ స్థానల నుంచే స్వతంత్ర అభ్యర్థులుగా వారికి డబ్బు పారేసి నించోబెట్టి వారి పార్టీ గుర్తుని పోలిన గుర్తునే వీరికి కూడా వచ్చేలా చేసి వీరి యొక్క ఓట్లను చీల్చేలా కుట్ర పన్నుతారని,అప్పట్లో “ప్రజా రాజ్యం” విషయంలో వారి గుర్తు “రైలు” ను పోలి ఉన్న గొంగళి పురుగు,అలాగే ఉండేటటువంటి ఇతర గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు వచ్చేలా చేసి కుట్ర పూరితంగా కొంచెం వయసులో పెద్ద వారిని ఒక గందరగోళానికి గురి చేసి ఓట్లు చీల్చాలని చూస్తారని అందుకే పవన్ తన పార్టీకి సంబందించిన గుర్తు విషయంలో చాలా పకట్బందీగా ఉండాలని చూస్తున్నారని జనసేన శ్రేణులు తెలుపుతున్నారు.

Comments

Popular posts from this blog

జనసేన పైన జగన్ రహస్య సర్వే

కాపులకు రిజర్వేషన్లు

ఓటరు - ఓటు - సందేహాలు