ట్రెండింగ్‌: `అంత‌రిక్షం`పై కుట్ర‌?




 
       2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా మెగా- నంద‌మూరి వార్‌కి తెర లేచిందా? అంటే అవున‌నే తెలుస్తోంది. మెగా వ‌ర్సెస్ నంద‌మూరి వార్ ర‌చ్చ‌కెక్కుతోంద‌ని తెలుస్తోంది. టాలీవుడ్‌ హీరోలు బాల‌కృష్ణ కామెంట్లు, అందుకు నాగ‌బాబు కౌంట‌ర్ కామెంట్లు, ఒక‌రిపై ఒక‌రు బాహాబాహీకి దిగ‌డంతో వివాదం ర‌చ్చ‌వుతోంది. అంతేకాదు.. ఇవి కేవ‌లం రాజ‌కీయాల వ‌ర‌కే ప‌రిమితం కావ‌డం లేదు. రిలీజ‌వుతున్న సినిమాల‌పైనా కుట్ర‌లు చేసేంత‌వ‌ర‌కూ వెళుతోంద‌ని స‌మాచారం. 

             ఇటీవ‌లే నంద‌మూరి హీరో బాలకృష్ణ పై మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ బూచీగా అస‌లు ఈ వివాదంతో ఏ సంబంధం లేని వరుణ్ తేజ్ `అంతరిక్షం` సినిమాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నార‌న్న అభియోగం వినిపిస్తోంది. ఆ మేర‌కు నంద‌మూరి అభిమాన సంఘాలపై కాపు సంఘాలు అభియోగం మోప‌డం తాజాగా దుమారం రేపుతోంది.
 
 
                 మెగా హీరోల‌పై బాల‌య్య ప‌లు సంద‌ర్భాల్లో కామెంట్లు చేయ‌డంతో, వాట‌న్నిటికీ గంప‌గుత్త‌గా ఓ ఇంట‌ర్వ్యూలో తీవ్ర స్థాయిలో బాల‌య్య‌కు కౌంట‌ర్ ఇచ్చారు నాగ‌బాబు. దీంతో కుల‌ ర‌చ్చ బ‌య‌ట‌ప‌డుతోంద‌ని తెలుస్తోంది. తన అన్న, తమ్ముడిని ఎవరైనా తప్పుగా మాట అంటే సహించలేని నాగబాబు బాలకృష్ణ మీద ఘాటైన కామెంట్ల‌తో విరుచుకుప‌డ‌డం నంద‌మూరి అభిమానుల‌కు మింగుడు ప‌డ‌లేద‌ని మెగా అభిమాన సంఘాల్లో చ‌ర్చ సాగుతోంది.

కాపు/చిరంజీవి అభిమాన సంఘాల్లో హాట్ డిబేట్ ఇలా ఉంది..
1. 2011లో చిరంజీవి “ఎన్టీఆర్ కాలి గోటితో సమానం“ అని బాలకృష్ణ అన్నపుడు పెద్ద వివాదం అవ్వాల్సిన సమయం లో చిరంజీవి జోక్యం వలన నాగబాబు వెనక్కి తగ్గారు.

2. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నారా ? అన్న ప్రశ్నకు “నెత్తి మీద ఎక్కించుకోవాలా?“ అని బాలయ్య సమాధానం ఇవ్వ‌డంపైనా మెగాభిమానులు సీరియ‌స్ అయ్యారు.

3. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చి, తర్వాత వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులపై ఎదురు తిరిగితే .. పవన్ క‌ళ్యాణ్ చేసిన ఆరోపణలకు మీడియా ముందే బాల‌య్య మాట్లాడుతూ “మేమే సూపర్ స్టార్లం.. వేరే వాళ్ళని హీరోలని చేయదలచుకోలేదు.. సంక‌ర‌.. “ అంటూ కొన్ని వర్గాలని కించపరిస్తూ.. తన కుల అహంకారాన్ని చూపించార‌నేది మ‌రో అభియోగం.

4. గ‌త ఎన్నిక‌ల్లో భూ స్థాపితం కావాల్సిన‌ తెగులుదేశం పార్టీని అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం అయిన “పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు“ అని మరోసారి తన అహంకారాన్ని తేదేపా వ‌ర్గాలు చూపించాయి. ఇవే కాక ఆఫ్ ది రికార్డ్ ఇంకా ఎన్నో సందర్భాల్లో తన ఇష్టం వచ్చినట్టు నంద‌మూరి హీరో మాట్లాడారు. ఇవేవీ ఎన్నో సంవత్సరాల నుంచి చూసి చూసి విసుగు చెందిన నాగ‌బాబు ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌తి ఎటాక్ చేశారు.

5. తనకి తన అన్నదమ్ముల మీద ఉన్న అమితమైన ప్రేమతో తన కొడుకు సినిమా భవిష్యత్ ఏమవుతుందో అన్న భయం కూడా లేకుండా సోషల్ మీడియా ఇంట‌ర్వ్యూల్లో వరుసగా బాలయ్య తుక్కు రేగొట్టిన ఏకైక వ్యక్తి నాగబాబు. ఇలాంటి డేర్ స్టెప్ వెయ్యడం ఆయన వల్లే అవుతుంది. దానికి కక్ష్య సాధింపు చర్య గా వరుణ్ తేజ్ `అంతరిక్షమ్` సినిమాని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాల‌ని నందమూరి అభిమాన సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. సినిమా థియేటర్స్ దగ్గర గొడవలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెడుతున్నారు.

6. ఇప్పటి వరకు అభిమానులైన మనం కూడా బాలకృష్ణ ఎన్ని మాటలు అన్నా చూస్తూ ఉండిపోయాం. అలాంటిది ఒక పెద్ద స్థాయి లో కూడా అభిమానులు చెయ్యాల్సిన పనిని నాగబాబు చేసి నోరు మూయించారు. దానికి ప్రతిఫలం గా పచ్చ అభిమానులు చేస్తున్న కుట్రలకు అడ్డుగా నిలబడి అంతరిక్షం సినిమా ఓపెనింగ్స్ నుంచి ఫైనల్ కలెక్షన్స్ వరకు మన మెగా అభిమానుల సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది. ఇక నుంచి మన మెగా హీరోలతో కానీ అభిమానులతో కానీ పెట్టుకుంటే పరిణామాలు ఏ స్థాయి లో ఉంటాయో చూపించాలి… అంటూ అభిమాన సంఘాల్లో చ‌ర్చ సాగింది.

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్