‘వంతాడ’ను మింగేశారు..............వంతాడ కుంభకోణం

 
  • ఊరును బాగు చేస్తామన్నారు
  • అందరికీ మంచి నీళ్లు ఇస్తామన్నారు
  • అందరికీ ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు
  • సంతకాలయిన తర్వాత ముఖం చాటేశారు
  • మా దగ్గరే కూలీ చేసుకోమన్నారు…
  • నామ్ కే వాస్తేగా ఒక రీచ్ లో లైసెన్సు రద్దు చేసిన ప్రభుత్వం
  • ఆ రద్దు కూడా గ్రామస్థుల ఆగ్రహాన్ని తగ్గించేందుకే
  • తరలిపోయిన కోట్లాది రూపాయలు..
  • గ్రామస్థుల నోట్లో మట్టి కొట్టిన ఆండ్రూస్…
            అవినీతిని వెలికితీయాలంటే… చిత్తశుద్ధిగల ప్రభుత్వమైనా ఉండాలి… లేదంటే చిత్తశుద్ధి గల మీడియా సంస్థ అయినా ఉండాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. చిత్తశుద్ధిగల ప్రభుత్వం నేతిబీర చందం. ఇక మీడియా సంస్థల గురించి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్ బాబులు ఎన్ని దొంగ వార్తలు రాయించుకున్నా… నిజాలను ఆపలేరు.

       మీడియా సంస్థలు పట్టించుకోవడం లేదు కాబట్టే… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వంతాడ గ్రామానికి వెళ్లి లాటిరైటు గనుల్ని పరిశీలించాల్సి వచ్చింది.

అసలు వాస్తవాలు ఇవిగో…! 360 డిగ్రీల్లో సాగిన దోపిడీ..!!

           తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం వంతాడ…. ఓ మారుమూల గ్రామం. తినడానికి తిండిలేని, తాగడానికి గుక్కెడు నీళ్లు లేని 254 గడప మాత్రమే ఉన్న గిరిజన గ్రామం. అక్కడ బంగారంలాంటి గనులు లేకపోతే… ఆ వైపు ఎవరూ కన్నెత్తి చూడని పరిస్థితి. కానీ… వంతాడ గ్రామంలో బంగారంలాంటి గనులు ఉన్నాయి. లాటిరైటు మట్టిలో ఇనుము అయినా ఉంటుంది, లేదంటే అల్యూమినియం ఉంటుంది. ఈ ఖనిజాలు ఉంటే దానికి ఇంకా ఎక్కువ డిమాండు ఉంటుంది, ఖనిజ శాతం కావాల్సినంత లేకపోతే, దానిని నిర్మాణాలకు ఉపయోగిస్తారు. 

          ఎప్పుడైతే దీనికి వాణిజ్య విలువ ఉందని గుర్తిస్తారో… లైసెన్సుల కార్యక్రమం మొదలవుతుంది. అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిపోతుంది. గ్రామసభ నిర్వహిస్తారు. మాకు అభ్యంతరంలేదంటూ గ్రామస్థులతో సంతకాలు చేయిస్తారు. అన్నీ స్వచ్ఛందంగా జరిగినట్లే బయటకు కనిపిస్తాయి. గనులు తవ్వుకుని కోట్లు తరలించుకుపోవాలనుకున్న ముఠా తెర వెనుక ఉండి ఈ తతంగాన్ని జాగ్రత్తగా నడిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకూ… అందరికీ వాటాలు ఇస్తుంది. అసలు ముఠా తెరపైన కనిపించదు.

            వంతాడ అనే కాదు… ఏజన్సీ ప్రాంతాల్లో ఉన్న గనులను కొల్లగొట్టే కార్యక్రమం మొత్తం ఇలాగే సాగుతుంది. లంచాలకు మరిగిన అధికారులు వంగి వంగి దండాలు పెట్టుకుంటూ… గ్రామస్థులను బెదిరించో, వారికి డబ్బులు ఇప్పించో… లైసెన్సుల తతంగాన్ని ముగిస్తారు. ఏజన్సీ ప్రాంతాల్లో గనులను స్థానిక గిరిజనులకే ఇవ్వాలన్న ఒక నిబంధన ఉంది. అందువల్ల స్థానికంగా ఒక గిరిజనుడిని మభ్యపెడతారు. అతని పేరుమీద గనుల తవ్వకం లైసెన్సులు వస్తాయి. 

              వంతాడ విషయమే తీసుకుంటే… లైసెన్సు ఉన్నది శోభన్ బాబు అనే అతనికి. నిజానికి ఇతను ఎవరు? అందరూ ఆరోపిస్తున్నట్లు శోభన్ బాబు కోట్లు సంపాదించుకుని కోటీశ్వరుడు అయిపోయాడా? లేదు. శోభన్ బాబు ఉన్నది కాగితాల కోసమే. సంతకాలు పెట్టడానికే. వంతాడ గనులను తెర వెనుక ఉండి నడిపిస్తున్నదీ… దాని లాభాలను దండుకున్నదీ,  కోట్ల రూపాయలను పిండుకున్నదీ రాజమండ్రిలో ఉండే ఆండ్రూ మినరల్స్ కంపెనీ. ఆండ్రూ అంటే ఇదేదే విదేశీ కంపెనీ అనుకుంటే పొరపాటు. స్థానిక కంపెనీయే. కొన్ని ఆంగ్ల అక్షరాలను కలిపి అలా పెట్టారు. విదేశీయులకు తేలికగా అర్థం కూడా అవుతుందని అలా పెట్టారట. 

                  అధికారికంగా ఎలాంటి లైసెన్సూ లేకపోయినా, లాటిరైటును, తద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను మింగేసింది ఆండ్రూ మినరల్స్ కంపెనీయే. శోభన్ బాబు… షెడ్యూల్డు తెగ వ్యక్తి. అయితే శోభన్ బాబు షెడ్యూల్డు తెగ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఈ గనుల లైసెన్సుకు అతనికి అర్హత లభించినట్లున్నది. శోభన్ బాబు పేరు మీదున్న గనులతోపాటు మొత్తం వందల ఎకరాల్లోనే లాటిరైటు తవ్వకాలు సాగిపోతున్నాయి. కొంతమందికి 2 ఎకరాలు, 3 ఎకరాల చొప్పున లైసెన్సులున్న వారు కూడా ఉన్నారు. అందరూ గనులను పరోక్షంగా తవ్వుకోవడానికి ఆండ్రూ కంపెనీకే ఇచ్చేస్తారు. ఆండ్రూ కంపెనీ ఇపుడు తెర మరుగైంది. అరవింద మినరల్స్ అంటూ ఇపుడు కొత్త కంపెనీ వచ్చింది. యజమానులు పాతవాళ్లే. 

             ఆండ్రూ అన్నా, అరవిందా మినరల్స్ అన్నా…ఈ రెండు కంపెనీలకు యజమానులు ఓ ఇద్దరు బావా బామ్మర్దులు. ఈ గనులకు తెరవెనుక ఉన్నది వారే. వీరు ఆడింది ఆట… పాడింద పాటగా ఎందుకు సాగిందంటే… వారిద్దరిదీ ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గమే. సరే, తినేవాడూ మనవాడే, వడ్డించేవాడూ మనవాడే ఉంటే, అడ్డుకునేది ఏముంది? ఇక మీడియాలోనూ, ఛానెళ్లలోనూ ఎందుకు వార్తలు వస్తాయి?


             ప్రకృతి వనరులను ఇలా చెరబట్టి… కోట్లు సంపాదించుకుంటున్న దశలో… అప్పటి వరకూ ఆండ్రూ, అరవిందా మినర్సల్స్ కంపెనీలకు వంత పాడినా… కొంతకాలానికి అసలు విషయం గ్రామస్థులకు అర్థమైంది. ఇందులో కోట్ల రూపాయలు వస్తున్నాయనీ, గ్రామానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని వారికి అర్థం అయింది. ముందు వారేం చెప్పారంటే… గ్రామానికి రోడ్లు వేస్తాం అన్నారు… తాగడానికి మంచినీళ్లు ఇస్తామన్నారు.. మా గనుల్లోనే మీరు ఎంచక్కా పని చేస్కోండి.. మీకు రోజుకు రూ.400 నుంచి రూ.500 కూలి ఇస్తాం అన్నారు. ప్రభుత్వం తరహాలో మీకు ఇళ్లు కూడా కట్టించి ఇచ్చేస్తామన్నారు.

          ఈ వాగ్దానాలన్నీ ఎందుకంటే గ్రామ సభ దీనిని ఆమోదించాలి. సంతకాలు పెట్టిన తర్వాత గనుల యజమానులు చేసిన వాగ్దానాలు వంతాడ కొండల్లోనే కలిసిపోయాయి. వంతాడ గ్రామం మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించింది కానీ… చిల్లిగవ్వ గ్రామంలో నిలవడ లేదు. లక్ష్మీదేవి నడుచుకుంటూ రాజమండ్రిలోని తాడితోటలో ఉన్న మినరల్ కంపెనీల బొక్కసంలోకి వెళ్లి దాక్కుంది.


           వాగ్దానాలు గాలికిపోయాయి.  పైగా… ఎర్రమట్టి ధూళితో గ్రామం నిండిపోయింది. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. గనుల శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు … గనుల యజమానులకే సహకరిస్తారుగానీ, గ్రామస్థులకు సహకరించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఎవరైనా సహకరించారు అని చెప్పాల్సి వస్తే… అది అడవుల్లో ఉంటే అన్నలే.  సరే. చాలా మంది వంతాడను సందర్శించారు. చూశారు. వెళ్లారు. ఒక దశలో వామపక్షాల  వరకూ వెళ్లింది. స్వచ్ఛంద సంస్థల వారు వచ్చారు. ఎవరు వచ్చినా ఏముంది? ఎవరు వచ్చినా ఫలితాలు మాత్రం రావడం లేదు. తెర వెనుక ఏదో జరుగుతుందని గ్రామస్థులు అనుకుని ఉంటారు. కోర్టుల్లో కేసులు కూడా పడ్డాయి కానీ… ఏ ప్రయత్నం కూడా వంతాడను కాపాడలేదు.


         గ్రామస్థుల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు  తీసుకున్నట్లు కన్పించాలి కాబట్టి… ఒక రీచ్ లో లైసెన్సును రద్దు చేసింది. మిగిలిన లైసెన్సులు అలాగే కొనసాగుతున్నాయి. ఇసుక గానీ, మరే గనులైనా… ఇచ్చిన లెక్కల ప్రకారం ఎవరూ తవ్వకాలను ఆపరు. అధికారులను కాస్తంత మేపితే, వాళ్లు సలాం కొట్టి వెళ్లిపోరూ…? ఆంధ్రలోనే కాదు… తెలుగు రాష్ట్రాల్లో ఇలా ముఖ్యమంత్రులకు చెప్పి మరీ దోచుకున్న గనాఘనులు ఎందరున్నారో తెలుసుకదా. 360 డిగ్రీల్లో చూస్తే వాస్తవాలు కళ్లకు కడతాయి. 

     కళ్లు మూసుకుంటే ‘అమరావతి కథలు’ నిజం అనుకుంటాం కదా. మీ తప్పులేదు.అలా 2015లో ఒక రీచ్ లో లైసెన్సు రద్దయింది. ఆండ్రూ కంపెనీ తెరమరుగైంది. అరవింద మినరల్స్ అనే కొత్త కంపెనీ తెరపైకి వచ్చింది. బావా బావమరుదులకు ఇక తిరుగేముంది? వచ్చింది మన ప్రభుత్వమేనాయే… వడ్డించేది మనవాడు… తెలుసుకదా. సీఎం రమేష్, సుజనా చౌదరి, విశ్వేశ్వరరావు వంటి కోటీశ్వరులపై కేంద్రం దాడులు చేస్తున్నందుకే కదా చంద్రబాబు గారు… గుర్రుగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ పరువును సైతం ఫణంగా పెట్టి.. కాంగ్రెసుతో దోస్తీ కట్టింది… !


              ఢిల్లీ స్థాయి రాజకీయాలతోనే తల బొప్పి కడితే, ఈ వంతాడ గురించి ఆలోచించేంత సమయం ముఖ్యమంత్రికి ఎక్కడ ఉన్నది? తెలంగాణ ఎన్నికలలో అక్కడ కూటమిని గెలిపించాలి… ఈ అమరావతి కథలు కూడా ఆయన ఎక్కడ వింటారు చెప్పండి? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా చంద్రబాబుకు తెలియకుండా జరగదు. అన్నీ ఆయనకు తెలుసు. రాజధాని నిర్మాణం… రూ.30 లక్షల కోట్ల కుంభకోణం అని మొన్న ఎవరో వచ్చి చెప్పారు కద.

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్