వాస్తవం చెప్పరు.. మరేం చేస్తారు ఈ సీఎం గారు?
చంద్రుడు చెప్పే అబద్ధాలు ఇలా ఉంటాయి….
‘‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేరుగా లబ్దిదారులతో ఫోన్లో మాట్లాడి లోటుపాట్లను తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అవకతవకలకు పాల్పడుతున్న అధికారుల లెక్కలన్నీ నా కంప్యూటర్లో ఉన్నాయి. పోస్టింగ్స్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటాం’’
నిజాలు ఇలా ఉంటాయి:
తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడూ ఒక
అలవాటు ఉంది. అది… అన్ని తప్పులకూ అధికారులనే బాధ్యులుగా చేయడం. అయిన
దానికీ కాని దానికీ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నింటికీ అధికారులే పాపాల
భైరవులు. చంద్రబాబుది తొలి నుంచీ ఇదే తీరు. ఒక చిన్న ఆలోచన… కేంద్రంలో
నరేంద్రమోడీ స్థానంలో చంద్రబాబు ఉన్నాడని అనుకుందాం. నోట్ల రద్దు ప్రయత్నం
విఫలమైంది అనుకుందాం. చంద్రబాబు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఏం
చెప్పేవారో తెలుసా?
‘‘నేను అంతా బాగానే ప్లాన్ చేశాను. కానీ
అధికారులు దీనిని సరిగా అమలు చేయడంలో విఫలమయ్యారు. వారిపై చర్య తీసుకునే
విషయమై ఆలోచిస్తున్నా. ప్రజాసేవలో నేను గత 40 సంవత్సరాలుగా ఉన్నాను. రాత్రి
నిద్రలో కూడా ప్రజల గురించే కలవరిస్తూ ఉంటాను. నా శ్రీమతి భువనేశ్వరి నా
ఆరోగ్యం గురించే బెంగ పెట్టుకున్నది. తెలుగుదేశం నేతలు సీఎం రమేష్, సుజనా
చౌదరి, నారాయణ వంటి నేతలతో అనేక సార్లు సమావేశమై… దేశ భవిష్యత్తు గురించి
(ప్రాజక్టులు ఎవరికి ఇవ్వాలి అన్నది) రాత్రంతా ఎంతో చర్చించాను’’ చెబుతారు.
దేశంలో అవనీతి పెరిగిపోయిందనీ, దీనిని
రూపుమాపేందుకు ఒక సాఫ్ట్ వేరును తాను రూపొందించానని పక్కనే ఉన్న
లాపుట్యాపును చూపిస్తారు. కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా లైవ్ లో వస్తూ
ఉంటుంది. ఎవరో ఆంధ్ర సీఎం అంట… లాపుట్యాపును వాడుతున్నాడని బిల్ గేట్స్
వంటి వాడు ఆశ్చర్యపోతాడు. ఢిల్లీ వచ్చి… మీరు దేశానికే సీఈవో అని
కీర్తిస్తాడు. (తర్వాత అనేక ప్రాజక్టులకు ఆమోదం లభిస్తుంది) పత్రికలన్నీ
పతాక శీర్షకల్లో రాస్తాయి. ఆ పతాక శీర్షికల వెనుక… ఏం జరుగుతుందో ఎవరికీ
తెలియదు. అంతా బాగుందని బాబు చెబుతాడు. అవును. నిజమే అని పత్రికలు
రాస్తాయి. బిల్ మిలిందా గేట్స్ డైరెక్టరు ఆర్బీఐలో చక్రం తిప్పుతూ ఉంటారు.
ప్రజాస్వామ్యం అంటే ఇదే.
రాజకీయ నేతల
జోలికి ఎవరూ రాకూడదు. వారెన్నో వ్యాపారాలు చేసుకోవచ్చు. కడితే పన్నులు
కడతారు. లేదంటే లేదు. మరీ తక్కువ కడితే… ఇంటికి వచ్చి ఐటీ అధికారులు
బతిమాలుకుని డబ్బులు పట్టుకుపోవాలి గానీ… దాడులు చేయరాదు. అప్పుడు
ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్లు లెక్క.
పేదవాడు మాత్రం డొక్కలో
కాళ్లు పెట్టుకుని నిద్రపోతుంటాడు. టీవీలో మాత్రం…. బాబు సీఈఓ అనీ, బాబు
ప్రజాస్వామ్యం కోసం దీక్షలు చేస్తున్నాడనీ, దేశం సంక్షోభంలో పడిన ప్రతిసారీ
చంద్రబాబు ఒక గాంధీలా, ఒక సుభాష్ చంద్రబోసులా రంగంలోకి దూకుతున్నారనీ టీవీ
తెరలపై యాంకర్లు చదువుకుంటూ ఉంటారు.
సామాన్యుడు మాత్రం డొక్కలో కాళ్లు
పెట్టుకుని నిద్రపోతుంటాడు…. తెల్లవారుతుంది. మళ్లీ టీవీల్లో పత్రికల్లో
అవే వార్తలు. అన్నం గిన్నెలో ముద్ద వేసేవాడు ఎక్కడున్నాడని సామాన్యుడు టీవీ
కట్టేసి బయటకు వెళ్లిపోతాడు. ప్రజాస్వామ్యమా వర్ధిల్లు!!

Comments
Post a Comment