ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్… !!

 
 
  • బాబు గారు చెప్పినట్లు రాసుకునే దర్యాప్తు సంస్థలు
  • విశాఖ భూకుంభకోణం నివేదిక- అనుకూలం
  • గోదావరి పుష్కర సంఘటన నివేదిక- అనుకూలం
  • కాల్ మనీ కేసులో నివేదిక- అనుకూలం
  • భ్రమరావతి మార్కు ప్రజాస్వామ్యం ఇదే
               ప్రభుత్వమైనా, ప్రజాస్వామ్యమైనా, పోలీసులైనా… ఏ వ్యవస్థ అయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలాం కొట్టాల్సిందే. చంద్రబాబు ఆసక్తులు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తల ఆసక్తులకు వ్యతిరేకంగా ఏ చట్టబద్ధ సంస్థలు కూడా నివేదికలు స్వతంత్రంగా ఇవ్వలేవు. ఇచ్చిన దాఖలా ఇంత వరకూ ఒక్కటి కూడా లేదు. రెడ్ హ్యండెడ్ గా పట్టుబడిన ఓటుకు నోటు కేసులోనే… ‘‘చట్టం’’ పెంపుడు కుక్క కంటే అన్యాయంగా తోక ఊపుతున్నది. ఇక విశాఖపట్నంలో జరిగిన వెయ్యి కోట్ల భూ కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ తేల్చింది కూడా ఏమీ లేదు.

                గతనాలుగేళ్లలో.. నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాలన్నీ బాబు గారికి కావాల్సిన విధంగానే నివేదికలు అందించాయి. మొన్న జగన్ పై హత్యా ప్రయత్నం జరిగిన దానిపైన మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. సిట్… అంటే ఎలా తయారైందంటే శ్రీవారికి ఎలా కావాలంటే అలా నివేదిక తయారు చేసి ఇవ్వడంగా మారిపోయింది.

        విశాఖపట్నం భూ కుంభకోణంలో కూడా ప్రతిపక్షానికి చెందిన నేత ధర్మాన ప్రసాదరావును దోషిగా తేల్చి… అధికార పక్షంలో ఉన్న గంటా శ్రీనివాసరావు, ఇతర పార్టీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్… అధికార పక్ష నేతలను కావాలనే వదిలివేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడే తన కేబినెట్ కొలీగ్ గంటా శ్రీనివాసరావుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

           విజయవాడలో మహిళలను వేధిస్తూ అరాచకం సృష్టించిన కాల్ మనీ కేసు కావచ్చు… గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోవడానికి సంబంధించిన కేసు, ఇబ్రహీంపట్నంలో పడవ మునక… ఇలా కేసు ఏదైనా, బాబుగారికి అనుకూలంగా దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇవ్వాల్సిందే. ఏ దర్యాప్తు సంస్థ అయినా… తోక ఊపుతూ ఆయన చెప్పింది రాసుకోవాల్సిందే. 
              
               విజయవాడ కాల్ మనీ కేసులో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మహిళలకు అప్పులిచ్చి, అప్పు మొత్తం కట్టించుకున్న తర్వాత కూడా వారిని లైంగికంగా వేధింపులకు గురి చేశారు. తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఈ కేసును వడ్డీవ్యాపారులు చేసినట్లుగా ప్రచారం చేసి ప్రజల దృష్టిని చంద్రబాబు చక్కగా మరలించారు.


                    గోదావరి పుష్కరాల్లో కూడా న్యాయ విచారణ చంద్రబాబు గారికే అనుకూలంగా వచ్చింది. నివేదిక మీడియా అతిగా ప్రవర్తించిందని మీడియాను నిందించారు. సినిమా షూటింగ్ కోసం జనాన్ని ఆపడం వల్లనే ఇదంతా జరిగిందని లోకం కోడై కూసింది. వీఐపీ ఘాటు కాకుండా, సాధారణ ప్రజలకు ఉద్దేశించిన ఘాటు వద్ద చంద్రబాబు ఉన్న విషయాన్ని న్యాయ విచారణ నివేదిక ఎక్కడా ఒక్క ముక్క కూడా చెప్పలేదు. చంద్రబాబు, కుటుంబ సభ్యులు నదిలో స్నానం చేస్తున్న దృశ్యాల్ని తెలుగు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. న్యాయ విచారణలో ఈ అంశాలను ప్రస్తావించనే లేదు. పైగా మీడియా అతిగా ప్రచారం చేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని చెప్పడం గమనార్హం.


              చంద్రబాబుగానీ, తెలుగుదేశం పార్టీగానీ వ్యవస్థలను ఇలా తన కాలికింద తొక్కి పెట్టి ఉంచుతాయి. గోదావరి పుష్కర దుర్ఘటనపై నివేదిక వచ్చినపుడు.. నవ్వుకోని వారు లేరు. మీడియా మొత్తం ఆయన కనుసన్నల్లోనే పని చేస్తున్నందున… తోక ఊపే దర్యాప్తు సంస్థలనుగానీ, ప్రభుత్వాన్నిగానీ ఒక్క ప్రశ్న వేయలేదు. అభాండాన్ని తాను స్వచ్ఛందంగానే తీసుకున్నది. వ్యవస్థల్నీ, సంస్థల్నీ తనకు అనుకూలంగా… తాను అనుకున్న ప్రజాస్వామ్య విధానంలో (సొంత సామాజిక వర్గం జోలికి రాకుండా ఉండటం) పని చేయించుకుంటూ… కేంద్రంలో నరేంద్ర మోడీ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని చెప్పడంలో ఔచిత్యం ఏమిటి?

విశాఖపట్నం భూముల కుంభకోణంపై సిట్ అందించిన నివేదిక కూడా చంద్రబాబుకు అనుకూలంగానే వచ్చింది. సొంతపార్టీ వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చి, ప్రతిపక్ష పార్టీ నేతను దోషిగా నిలబెట్టింది. పోలీసులు, అధికారులు, ఉద్యోగులూ, పాత్రికేయులూ… అందరూ తాను చెప్పింది వినాల్సిందే. తాను చెప్పింది రాసుకోవాలి. అంతే. తెలుగుదేశం హయాంలో ప్రజాస్వామ్యం అంటే ఇదే మరి. సొంతస్వామ్యం. తెలుగు ప్రజలు ఇంకా ఈ కట్టుకథలు ఎన్నాళ్లు వినాలో కదా…!!

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్