జేడి...సారీ...సారీ...వి.వీ.లక్ష్మీనారాయణ.....ఒక నిజం.

అహం బ్రహ్మస్మి ...
అహం కమ్మస్మి...

వీవీ లక్ష్మినారాయణ ను జేడీ లక్ష్మీనారాయణ అని పిలుస్తున్నారెందుకని ఓ జడ్జి గారు అడిగారు. ఆయన సీబీఐలో పని చేసినప్పటి చివరి ర్యాంక్ అది అని చెప్పాను. ఉదాహరణకు కల్నల్ అనేది చాలా చిన్న మిలటరీ హోదా అయినా కల్నల్ గడాఫీ దేశాధినేత అయ్యాక కూడా కల్నల్ గడాఫీ అని పిలిపించుకోడానికే ఇష్టపడేవాడు. ఈ జేడీ టైటిల్ కూడా అలాంటి కోవలోకే వస్తుందని చెప్పాను.

జేడీ పోయిపోయి జేపీ అనబడే కులసత్తా డైరెక్టర్ సారధ్యంలో పని చేయడానికి ఎందుకు ముచ్చట పడుతున్నారని ఓ సీనియర్ వైద్యుడు అడిగారు.

"జేడీ అనబడే  వీవీ లక్ష్మినారాయణ పాపం జాయింట్ డైరెక్టర్ సీబీఐ గా రిటైర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రోటోకాల్ పాటించడానికి అలవాటు పడినట్టుంది. ఆయన తనకన్నా సీనియర్ కేడర్ ఐఏఎస్ అధికారి కింద జాయింట్ హోదాలో తప్ప మరొక సాధారణ నేత కింద ఏ హోదా ఇచ్చినా పని చేయలేడు. అది వాళ్ళ బ్యూరోక్రటిక్ చాదస్తం.

పైకి వినమ్రంగా కనిపిస్తూనే లోలోన ప్రొఫెషనల్  అహంభావం తొంగిచూస్తుంది. అందుకే జనసేన జాయింట్ డైరెక్టర్ (జేడీ)అయ్యే అవకాశమున్నప్పటికీ, దాని బదులు కమ్మని మాటల జోక్ సత్తా జాయింట్ డైరెక్టర్ అయ్యేందుకే ఇష్టపడినట్టు వున్నార"న్నాను. మనం ఆయనను కాపాడు కోలేమా అని అడిగారు. ప్రగాఢ సానుభూతి చూపడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులమని చెప్పి నిట్టూర్చాను.

Comments

Popular posts from this blog

జనసేన పైన జగన్ రహస్య సర్వే

‘వంతాడ’ను మింగేశారు..............వంతాడ కుంభకోణం

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్