అసలైన కుట్ర : ముసుగు రాజకీయం


2019ఎన్నికలకోసం చంద్రబాబుముసుగు” వ్యూహం
2019 Babu - 3 Bombs - 120 Seats
     ధరిత్రిని తల్లకిందులు చేసైనా… 2019  ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్లీ తన ఉక్కు పిడికిలిలో ఉంచుకోవడం కోస్తాంధ్ర ధనిక వర్గ పాలకులకూ, వారి పార్టీ తెలుగుదేశానికీ, వారి ప్రతినిధి చంద్రబాబునాయుడుకి తప్పదు.


       అధికారంలోకి రావడంపై చంద్రబాబు 100 శాతం ధీమాతో ఉన్నట్లు విశాఖలో జరిగిన సమావేశంలో ఆయన చెప్పిన మాటలు తేటతెల్లం చేస్తున్నాయి.తెదేపా నేత కేసినేని నాని 120 సీట్లు ఖాయమని భరోసాగా చెబుతున్నారు. తెలుగుదేశం నేతలకు  ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?


 అసలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను బయటకు కనిపించే అంశాలతో అర్థం చేసుకోవడం అసాధ్యం. చీకటి మాటున జరిగే ‘‘ముసుగు’’ రాజకీయాల గురించి తెలిస్తే.. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ‘‘కుట్ర కుట్ర’’ అన్న పాట తలవంచుకుంటుంది.

గ్రాండ్ డిజైన్ పేరు ఇదిబాబు- 3 బాంబులు- 120 సీట్లు ‘‘ముసుగు’’ రాజకీయాల ముసుగు తొలగిస్తే…? చదవండి
2019: బాబు- 3 బాంబులు- 120 సీట్లు
‘‘సమర్ధంగా పరిపాలిస్తున్నాడని నమ్మించటంలోగానీ, అక్రమంగా డబ్బు సంపాదించడంలోగానీ, శత్రువుల గొంతు నులిమేయడంలోగానీ అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుదేశ రాజధానిలో ఉన్న నాయకులతో సరి సమాన స్థాయి ఆయనది. ఢిల్లీతో సంబంధం లేకుండా ఆయన తనకు కావాల్సినవి అన్ని నిర్వహించుకోగల సత్తా ఉంది. కొత్తగా నేర్చుకోవాల్సినవి కోస్తా ఆంధ్రా పాలకునికి ఏమీ లేవు. పరిపాలనగానీ, వాణిజ్యంగానీ, నేరాలు చేయడంగానీ దేని కోసం కూడా ఆయన, ఆయన వెనుక ఉన్నవారు ఢిల్లీ వెళ్లాల్సిన పని లేదు’’
చంద్రబాబు గురించి ఒక వామపక్ష మేథావి చెప్పిన మాటలు.
ఇద్దరు చంద్రుల రహస్య లాలూచి: బాబు- బాంబు- 1
                చంద్రబాబానాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే మండిపోతుంది అన్నదే బాహ్య ప్రపంచానికి తెలిసింది. కానీ బాహ్య ప్రపంచానికి తెలియనిది ఏమంటే.. వాళ్లిద్దరూ ఒకరికొకరు తెర వెనుక సహకరించుకుంటారు. ప్రజల దృష్టిలో మాత్రమే వారు బద్ధ రాజకీయ శత్రువులుగా నటిస్తున్నారు. ఓటుకు నోటు కేసు ముందుకు వెళ్లకపోవడంతో దీనిపై చాలా మందికి అనుమానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరూ పగలను వదిలేసి సఖ్యతగా ఉన్నారన్న కథనాలూ వచ్చాయి. అయతే రూఢిగా బయటపడలేదు. అయితే… 2015 నాటి ఓటుకు నోటు కేసు పునర్విచారణ చేయాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించడంతో మళ్లీ కేసు బయటకు వచ్చింది. చంద్రబాబును కేసు నుంచి బయటపడకుండా కేసీఆర్ చూస్తాడని రెండు రాష్ట్రాల్లో ఉన్న చంద్రబాబు వ్యతిరేకులు గట్టిగా ఆశించారు. ఇప్పటికీ ఆశిస్తున్నారు. అయితే వారి ఆశలు ఎప్పటికీ నెరవేరే అవకాశం అయితే లేదు


                ఏసీబీ కేసులో కీలక పాత్ర పోషించిన అధికారి బి.శివధర్ రెడ్డి ని ఇంటిలిజన్స్ నుంచి బదలీ చేయడం వెనుక చంద్రబాబుకు మేలు చేసేందుకే అన్న వాదన ఉంది. తర్వాత వి.నవీన్ చంద్  అనే ప్రొమోటీ ఐపీఎస్ అధికారిని తేవడం కూడా అందుకేనన్న చెబుతారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఇద్దరు సీఎంలు ఒకరి పీక మరొకరు కోసేసుకుంటారేమో అన్నంత యుద్ధం జరిగింది. సమయంలో జగన్ కేసీఆర్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. 2015 నాటికి ఓటుకు నోటు కేసు గురించి కేసీఆర్ మాట్లాడటం మానుకున్నారు. చంద్రబాబు దగ్గర వరకూ కేసు వచ్చేసరికి పూర్తిగా ఆగిపోయింది


       చంద్రబాబు గొంతు కూడా ఫోరెన్సిక్ పరీక్షలో సరిపోలిందని అనధికారిక సమాచారం. అయినా కేసు అక్కడే ఆగిపోయింది. తర్వాత వచ్చిన ఇంటిలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తర్వాత కాలంలో ఇద్దరూ శత్రుత్వాలను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వచ్చారు.. కేసీఆర్ చేసిన యాగానికి బాబు వచ్చారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. వీళ్లిద్దరూ కూడా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోచంద్రబాబు సామాజిక వర్గం ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిని  కాపాడుకోవడం చంద్రబాబుకు అవసరం.  కేసీఆర్ వాటి జోలికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపైన ఉంది. ఒక పెద్ద వ్యాపారవేత్త వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.


కేసీఆర్- చంద్రబాబుల మధ్య సఖ్యతకు మరో కారణం జగన్!
                              ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సీఎం కాకుండా అడ్డుకోవాలన్నది కోస్తాంధ్ర కమ్మవారి లక్ష్యం. జగన్ ఆంధ్రాలో ముఖ్యమంత్రి కాకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నారు. దీనికి కారణం.. ఒక వేళ జగన్ ఆంధ్రలో సీఎం అయితే.. తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం మరింత బలపడుతుంది. కేసీఆర్ కు సొంత సామాజిక వర్గం సంఖ్యాపరంగా చాలా తక్కువ కాబట్టికేసీఆర్ పోరాటం ఇక్కడున్న రెడ్డి సామాజిక వర్గంపైననే ఉంటుంది. అలా రెడ్డి సామాజిక వర్గాన్ని అధికారానికి దూరంగా ఉంచాలంటే అక్కడ చంద్రబాబు సీఎం కావడం కేసీఆర్ కు ఇబ్బందిలేని వ్యవహారం. చంద్రబాబు తోక ఆడించే ప్రశ్నే లేదు. చంద్రబాబు సామాజిక వర్గం ఆస్తులున్నాయిపైగా ఓటుకు నోటు కేసు బూచిని ఇంకా కొన్నేళ్లు వాడుకునే వీలు ఎటూ ఉన్నది


                        శత్రవుకు శత్రువు మిత్రుడు కాబట్టికేసీఆర్, చంద్రబాబు అలా దగ్గరయ్యేందుకు ఒకరి అవసరాలు ఒకిరికి ముఖ్యమయ్యాయి. కేసీఆర్ భయపడినట్లుగానేరెడ్డి సామాజిక వర్గం అధికారం కోసం రాష్ట్ర విభజన తర్వాత నుంచీ పూర్తి అసహనంతో ఎదురుచూస్తున్నది. కనీసం ఆంధ్రలో జగన్ సీఎం అయినా.. మళ్లీ ఒక వెలుగు వెలుగవచ్చిన తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్ పైన ఆశలు పెట్టుకున్న మాట వాస్తవం. తెలంగాణలో వైఎస్సార్సీపీ పోటీ చేసే యోచన లేనట్లుగా ఉన్నా.. రేపు ఏమవుతుందోనన్న భయం కేసీఆర్ కి ఉంది. ఒకవేళ ఆంధ్రాలో జగన్ సీఎం అయితేఖచ్ఛితంగా తెలంగాణలో వైఎస్సార్సీపీ బలమైన పార్టీగా అడుగుపెడుతుందనడంలో సందేహం లేదు. మొన్నటికి మొన్న తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. రెడ్డి సామాజిక వర్గానికి తగినన్ని సీట్లు ఇచ్చి, మంత్రి పదవులు ఇస్తే, కొంత వరకూ వర్గాన్ని సంతృప్తి పరచవచ్చు.


                  తెలంగాణలో తెరాసను సవాలు చేయగల దమ్మూ, ధైర్యం, ఆర్థిక వెసులుబాటు ఉన్నది రెడ్డి సామాజిక వర్గానికే. అందువల్ల సుదీర్ఘకాలంలో చంద్రబాబు కంటే జగన్ నుంచే.. కేసీఆర్ కుగానీ, తెరాసాకు గానీ సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో తెలుగుదేశం.. ఉండటం ఎప్పుడూ కేసీఆర్ కు లాభమే. మొన్న తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు వచ్చి ప్రచారం చెయ్యడం వల్ల తెలంగాణ సెంటిమెంటు రగిలింది. మామూలుగా అయితే.. తెరాసకు 40 సీట్లు వస్తాయన్న అంచనాలు సరైనవే. వాస్తవం కూడా అలాగే ఉంది. తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అయితే మిగిలిన 48 సీట్లూ తెలంగాణ సెంటిమెంటుకు వల్ల సంపాదించినవే. చంద్రబాబును చూసికసికొద్దీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ బెటర్ అనుకున్నారు. సరిగ్గా తెరాస, తెదేపా ‘‘ముసుగు’’ వ్యూహం కూడా ఇదే. ప్రజల్ని తాము అనుకున్నట్లుగా మరల్చగలిగారు. కేసీఆర్ గండం తప్పడమే కాదు.. వెను తిరిగి చూడనంత మెజారిటీతో ప్రజలు గెలిపించారు


                      కేసీఆర్ కు ఇంత భారీ గెలుపును సాధించి పెట్టిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇవ్వకుండా కేసీఆర్ ఎందుకుంటారు? ఇస్తానని గెలిచిన వెంటనే చెప్పేశారు కూడా. దీనిని ప్రజలు అర్థం చేసుకున్నది వేరొకలా. చంద్రబాబును నష్టపరచడానికి కేసీఆర్ కూడా వెళతారు. తప్పేమిటి అని బాహ్య ప్రపంచం అనుకుంటుంది. అంత వరకూ ఓకే. కేసీఆర్ ఆంధ్రవెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఏమి అవుతుంది? ఆంధ్రా సెంటిమెంటు రగులుతుంది. యల్లో మీడియా ఇతోధికంగా దీనికి వేదికను అందిస్తుంది. ఆంధ్రా ప్రజలు పోలింగ్ దగ్గరకు వచ్చే సమయానికి ఊగిపోతారు. చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు కూడా ఊగిపోతారు. సరిగ్గా తెలంగాణ ఎన్నికల్లో చేసిన ‘‘ముసుగు’’ ప్రయోగమే అక్కడా జరుగుతుంది. జనాలకు పూనకాలు వస్తాయి. తెలుగుదేశం అయితే బెటర్అనుకుంటారు. తెలుగుదేశం పార్టీకి తర్వాత 2019 ఎన్నికల్లో 120 సీట్లు వస్తాయని చంద్రబాబు ప్రస్తుత అంచనా.


                     పత్రికలు చదివి, టీవీలూ చూసి చంద్రబాబు పని అయిపోయిందని అనుకుంటున్నారు చాలా మంది. చంద్రబాబును సాధారణ గల్లీ నాయకుడు అని మీరు అనుకుంటే కథనంలో ఉన్న తొలి వాక్యాలను మరోసారి చదువుకోండి. చంద్రబాబు సానూభూతి కార్డును గట్టిగా ప్రయోగిస్తారు. ‘తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేస్తే రెండు సీట్లే ఇచ్చారు. మరి కేసీఆర్ ఇక్కడ మనకు అన్యాయం చేయడానికి వచ్చారు. ఆంధ్రోళ్లు అంటూ మనల్ని తిట్టిన నాయకుడు చెప్పినట్లే జగన్ కు ఓట్లు వేస్తారా తమ్ముళ్లూ’’ అని అడుగుతారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఒక అయిదేళ్లు ప్రభుత్వాన్ని అందిస్తే చేతిలో 10 లక్షల కోట్లు ఉంటాయి. 5 తర్వాత సంగతి తర్వాత. ఇదీ తెలుగుదేశం తీరు. పార్టీ అనే కాదు.. పెట్టుబడిదారీ రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ ఇలాగే ఉంటాయి.


ఒకసారి హిట్లర్జర్మనీ పార్లమెంటుకు కోడిని తెచ్చిదాని ఈకలన్నీ పీకేశారట. మొత్తం ఈకలు పీకడంతో అది కుయ్యో మొర్రో అంది. తర్వాత దాన్ని పిలిచి నాలుగు గింజలు పడేస్తేవచ్చి తిన్నదట. ఇదీ ప్రజల పరిస్థితి అని హిట్లర్ చెప్పాడట. ప్రజల్ని ఎంత హింసించినాచివర్లో నాలుగు మంచి పనులు చేస్తే పడి ఉంటారు అని హిట్లర్ ప్రజల సైకాలజీని చిన్న ఉదాహరణలో చెప్పేశాడు. రాజకీయ నాయకులు, పార్టీలూ ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తున్నాయని అనుకోవడం కూడా సరికాదు. మనకు మనమే పిచ్చివాళ్లం అవుతున్నాం.


 బాబు- బాంబు- 2  తెలుగు జనంపై టీడీపీ సెంటిమెంటు బాంబు?
TDP | telugu.newsof9.com

         బాబు- బాంబు- 1 వర్కవుట్ కాకుండా పోయే పరిస్థితి చాలా తక్కువ. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా మాత్రమే ఇపుడున్న ప్రభుత్వాలు ఓట్లను కొల్లగొట్టగలవు. కేవలం ఓటుకు 2 వేల రూపాయలు ఇచ్చినా ఓట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. కేంద్రంలో భాజపా కూడా ఎమోషనల్ పాలిటిక్స్ నడిపేది ఇందుకే. కేవలం అభివృద్ధి నినాదాన్ని చూపి ప్రజలు ఓట్లు వేయడంలేదని పార్టీలకు అర్థమైపోయింది. భారీ మెజారిటీలు రావాలంటే భావోద్వేగాలే ఖర్చులేని పెట్టుబడి అని వారికి అర్థమైంది. తెలుగు రాష్ట్రాల్లో మరో పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంటుపైనే రాజకీయ పార్టీలు ఓట్లు కొల్లగొడతాయి. భావోద్వేగాల ఆవేశాలను అంత త్వరగా ఆరనివ్వకుండా చూసుకుంటాయి. ప్రజల బాగు కోసమే పనిచేస్తానంటున్న పవన్ కళ్యాణ్ వస్తేపరిస్థితి మారవచ్చునేమో. అది వేరే సంగతి. ప్రజలకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా టీవీలూ, పత్రికలూ మన మెదళ్లను చెత్తతో నింపేస్తాయి.

            రిస్కకు తీసుకోవడానికి.. ఇదేమీ పంచాయితీ ఎన్నికలు కావు. 5 ఏళ్లకు అక్షరాలా పది లక్షల కోట్ల రూపాయల వ్యవహారం. రేపు స్పెషల్ స్టేటస్ గానీ, లేక దానికి సమానమైన ప్యాకేజీనో వస్తేఆంధ్రలో బడ్జెట్టు 100 రెట్లు పెరుగుతుంది. ఒక టర్మ్ వరకూ భాజపా ఆపింది కానీ.. ఇక కేంద్రం ఆపే నిధుల్ని ఎంతోకాలం తొక్కిపెట్టలేదు. అందుకే చావో రేవో అన్నట్లు పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.


               రాజకీయాల్లో వ్యతిరేక ప్రచారం కూడా అనుకూలంగా మార్చుకునే వీలు ఉంటుంది. రాజుగారిని చంపేసి కొడుకో, అల్లుడో రాజయితే, ప్రజల్లో వ్యతిరేకత రాదు. చంద్రబాబు విషయంలో అదే జరిగింది. ఎన్టీఆర్ ను బయట వ్యక్తి నాదెండ్ల వెన్నుపోటు పొడిచినపుడు ప్రజలు తిరగబడ్డారు. కానీ చంద్రబాబు వెన్నుపోటు విషయంలో కమ్మ సామాజిక వర్గం అల్లుడికి వెన్నుదన్నుగా నిలబడింది. పత్రికాధిపతులూ కూడా చంద్రబాబువైపే నిలబడ్డారు.


                ఎన్టీరామారావును అధికారంలోకి తెచ్చింది తామే అని ఈనాడు అంతర్గతంగా గొప్పగా చెప్పుకున్నా, చంద్రబాబును సీఎం చేసింది కూడా తామేనని మాత్రం ఈనాడు దినపత్రిక చెప్పుకోవడం లేదు. చంద్రబాబు వెన్నుపోటు దరిమిలా ప్రజల్లో తిరుగుబాటు రాలేదు. తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబు గుప్పెట్లోనే ఉంది కదా. అందువల్ల ఎన్టీఆర్ ను ఉపయోగించుకునే హక్కు చంద్రబాబుకే ఉంది. ఇపుడు ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో రెండు భాగాలుగా సినిమాలు వస్తున్నది కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉపయోగపడుతుందనిఅని రేపోమాపో పత్రికలు ఊదరగొడతాయి. సినిమా తియ్యమని చంద్రబాబే చెప్పి ఉంటారనేది నిస్సందేహం.                  తీస్తున్నది వియ్యంకుడు బాలయ్యే. అంటే తెలుగు ఆత్మగౌరవం సెంటిమెంటును మరోసారి వెండి తెరపై వండి వార్చేస్తారు. సినిమా ప్రభావం గొప్పగా ఉంటుంది. ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించనూ వచ్చు.

 
              సావిత్రి సినిమా సావిత్రిపై విపరీతమైన సానుభూతిని తెచ్చిపెట్టింది. ఇపుడు ఎన్టీఆర్ సినిమాలో నాదెండ్ల వెన్నుపోటును భారీగా చూపిస్తారు. ప్రజల్ని కన్నీళ్లు పెట్టిస్తారు. పత్రికలూ, టీవీల్లో ఊదరగొట్టిన తర్వాత ప్రజలు మాత్రం ఏం చేస్తారు? దీని గురించే ఆలోచిస్తుంటారు. మానసికంగా సినిమా ప్రభావం ఎన్నికలపై ప్రతిఫలించాలన్నదే కదా చంద్రబాబు ఆలోచన. సహజంగానే పెద్ద ఎత్తున ఎన్టీరామారావు గురించీ, చంద్రబాబు గురించీ, తెలుగుదేశం పార్టీ గురించీ మాట్లాడుకుంటారు


              సరిగ్గా ఆంధ్రా ఎన్నికలు ముంగిట ఉన్న దశలో బాంబు పేలుతున్నది. సానుభూతి పవనాలు తెలుగుదేశం ఓటు బ్యాంకును సమీకృతం చేస్తాయి. మళ్లీ మూకుమ్మడిగా ఓట్లను కొల్లగొట్టడం తేలిక కావచ్చు. సెంటిమెంటు ఉన్న తెలుగు సినిమాలు, సెంటిమెంటు ఉన్న అత్తా కోడళ్ల సీరియళ్లను గొప్పగా ఆదరించిన సమాజం మనది. కదిపితే కన్నీళ్లు పెట్టుకుంటాం. కేసీఆర్ ద్వారాతెలుగుదేశం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి.


                 కొన్ని ఓట్లను ఎలాగూ జనసేన చీల్చుకెళుతుంది. జగన్ కానీ, పవన్ కళ్యాణ్ గానీ సీఎం కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు ప్రధానమైన ఆలోచన. ఎన్టీరామారావు వాస్తవానికి మంచికథా నాయకుడే’.. కానీమహానాయకుడు అయితే కాదనీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం తెలుగుదేశం పార్టీ ఆడిన పెద్ద నాటకమనీ, బూటకమనీ రాజకీయ విశ్లేషకులు తేల్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడూ ఇలాంటి విశ్లేషణలు చేసి ఎరుగదు. చెయ్యదు కూడా


 పెట్రోలు పోస్తున్న దర్శకుడు వర్మ
         విలన్ ఉంటేనే హీరో కూడా రాణిస్తాడు. అందుకే రామ్ గోపాల్ వర్మను కూడా రంగంలోకి దించారు. అప్పుడే కథ పండుతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ నానా హడావుడి చేస్తున్నారు. అసలు ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లిందో లేదో కూడా తెలియదు. తీస్తున్నానని చెప్పిపాటలు విడుదల చేసి ఆయన చాలా సినిమాలు చేయలేదు. అప్పుడెప్పుడో న్యూక్లియర్ బాంబుపై వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నానని చెప్పారు. అతీగతీ లేదు. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్నందున ఆయనకు ఏదో ఒక వ్యాపకం కావాలి. వర్మ దీనిని ఇపుడప్పుడే ఆపేటట్లు కనిపించడం లేదని నిన్న సాక్షి దినపత్రిక రాసింది.


       కాబట్టిఇంగ్లిషులో కనెక్టింగ్ డాట్స్ అని అంటారు చూడండి. జరుగుతున్న బయటకు వస్తున్న మాటల్నీ, గారడీల్నీ చూసితెలుగుదేశం పార్టీ వ్యూహాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. మానసిక యుద్ధం ఇప్పటికే మొదలైఅభిమానులు సోషల్ మీడియా జై జై ఎన్టీఆర్ అని కొట్టుకుంటున్నారు. అంటే ఈవిల్ డిజైను పని చేస్తున్నట్లే కదా!!


బాబు- బాంబు- 3 

               ఇక మరో వ్యూహం కూడా ఉంది. అదేమంటే.. ఈవీఎంల స్థానంలో మళ్లీ బ్యాలెట్లను తరహా ఎన్నికలను తేవడం. అన్నింటికీ టెక్నాలజీని ప్రేమించే చంద్రబాబువిచిత్రంగా ఈవీఎంలు ఎందుకు వద్దంటున్నట్లు? వాటిని టాంపరింగ్ చేయడం ఎలాగూ సాధ్యం కాదు. బ్యాలెట్లకు అనుమతి వస్తేవీలైన చోటల్లా తెలుగు తమ్ముళ్లు తమ ప్రతాపాన్ని చూపించి దొంగ ఓట్లను సంపాదించుకోవచ్చనే కదా. ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే.. ఇది కూడా పెద్ద అడ్వాంటేజీ అవుతుంది. గతంలో పోలింగ్ అంటే బ్యాలెట్లను తగలబెట్టయ్యడం, బాంబులు వేసిప్రజల్ని ఓట్లు వేయకుండా చెదరగొట్టేయడంఒక రకం కాదు. ఓటు వేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఉండేది


              ఈవీఎంలు వచ్చిన తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది. ప్రజల్ని నమ్మించి, అర చేతిలో వైకుంఠం చూపించి ఓట్లు గుంజుకోవడం ప్రస్తుతం మరో మార్గం లేదు. అందుకే భావోద్వేగాలను రెచ్చగొట్టడం మినహా మరో మార్గం లేదు. సెంటిమెంటు బాంబుల్నే ప్రజల్లో మెదళ్లలో పేల్చాలి. తికమక చేయాలిపవన్ కళ్యాణ్ ఉదయం జగన్ తో కలిసి టీ తాగుతారు అని చెప్పాలి. సాయంత్రం మోడీతో టీ తాగుతారు అని చెప్పాలి. ఇవన్నీ భావోద్వేగపరమైన రాజకీయ బాంబులే. వీటిని కావాల్సిన విధంగా పేల్చడానికి ఉపయోగపడేది చంద్రబాబు చేతిలో ఉన్న 17 టీవీ ఛానెళ్లు, రెండు ప్రధాన పత్రికలూ. ఇదంతా మైండ్ గేమ్ నెట్ వర్క్.
ఇందుకోసం చంద్రబాబుకు అమరావతిలో అయిదారు ఆఫీసులూ, అనధికారికంగా కొందరు మాజీ పాత్రికేయులూ, అధికారిక మీడియాల్లో వందల మంది పాత్రికేయులూ ఇతోధికంగా కష్టపడుతున్నారు.


కాలిపోతున్న నీతి
ముసుగు రాజకీయాలేమీ లేకుండాచంద్రబాబుకు చెప్పుకోవడానికి నాలుగు పాయింట్లు ఉన్నాయి. అవి 1. అమరావతి నిర్మాణం, 2. పోలవరం ప్రాజెక్టు 3. కియా మోటార్ల కంపెనీని తెచ్చింది మేమే  4. సిమెంటు రోడ్లు, ఎల్ఈడీ లైట్లు….  మరి నాలుగు అభివృద్ధి అంశాలతో చంద్రబాబు ఎన్నికలకు వెళితేమళ్లీ అధికారంలోకి వస్తారన్న గ్యారంటీ ఉన్నదా? లేదు నాలుగు పాయింట్లతో ఆయన విపక్షాలను చిత్తు చేయలేరు. అందుకే ముసుగు డిజైన్లయితే.. ఫలితం ఉండొచ్చు. తిరుగులేనిజం. కాదంటారా?


ప్రజల అభివృద్ధి కోసం కాకుండాకేవలం అధికారం కోసంకేవలం లక్షల కోట్ల  కోసం రాజకీయ పార్టీలు ఆడే వింత నాటకంలో, భావోద్వేగాల మంటల్లో కాలిపోయేది నీతి. కేవలం సచ్ఛీలతే పెట్టబడిగా, యువత 25 భవిష్యత్తు కోసం తన 25 ఏళ్ల జీవితాన్ని అంకితం చేస్తానంటున్న జనసేన కుళ్లు రాజకీయాల రొచ్చులో ఎక్కడ?
సెంటిమెంటును రగిలించి తెలుగు ప్రజల్ని వంచించే నయా పెట్టుబడిదారుల ముందు, దేశ ప్రధానిని సైతం పరుగులు పెట్టించాలని చూస్తున్న ధనిక వర్గాల ముందు పవన్ కళ్యాణ్ చెప్పే నిజాయితీని ప్రజలు ఆదరిస్తారా?

లేక
భావోద్వేగాల్లో పడి కొట్టుకుపోయి చంద్రబాబును సీఎంగా చేసుకుని కాంట్రాక్టర్ల రాజ్యాన్నే తెచ్చుకుంటారా?
లేక
రంగులు తేడా ఉన్నాఅదే రకమైన మరో కాంట్రాక్టర్ల పార్టీని తెచ్చుకుంటారా?
లేక
కాశీ తువ్వాలు, టీ గ్లాసుతో ప్రజల ముందు నిలబడిన పవన్ కళ్యాణ్ కు ఓట్లేసి…  70 ఏళ్లుగా అధికారాన్ని బడుగు వర్గాలకు అందనివ్వకుండా దాని చుట్టూ రెండు సామాజిక వర్గాలు కట్టుకున్న కులం అనే కాంక్రీటు గోడల్ని బద్దలు కొడతారా? వేచి చూద్దాం!!



Comments

Popular posts from this blog