ఉక్కు సైన్యం నీ వెనుక… ముందుకు సాగిపో సైనికా!!


 Pawan Kalyan | telugu.newsof9.com



అమరావతి: 1976లో సిల్వెస్టర్ స్టాలోనీ హీరోగా నటించిన రాకీ (Rocky) అని ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సూపర్ డూపర్ సక్సెస్ అయింది. సినిమాలో రాకీ (హీరో)ని ఏమీ సాధించలేని ఒక మొద్దబ్బాయిగా అందరూ ఎగతాళి చేస్తారు. ఎంతో కష్టపడతాడు. చివరికి బాక్సింగ్ రింగ్ లో తానేమిటో నిరూపించుకుంటాడు. జీవితంలో సవాళ్లను స్వీకరించే ప్రతి యువకుడికీ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద స్ఫూర్తిగా నిలిచింది. 

        ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గెలవాలని యువత పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. నిజానికి వాళ్లు ఇంకా నిరీక్షించే పరిస్థితిలో కూడా లేరు. ఆకాంక్షలు అంత బలంగా ఉన్నాయి. ఈ సమయంలో.. జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందని, లేదా జగన్ తో రహస్య స్నేహం చేస్తుందని రకరకాల పుకార్లను బయట ప్రచారంలో పెడుతున్నారు. జన సైనికులనీ, జనాలనూ అయోమయంలోకి నెట్టేసి తమ పబ్బం గడుపుకుందామన్నది వారి ఆశ.


             ఇప్పటికే రాజకీయాల్లో డబ్బు సంపాదించుకున్న వారే ఈ ఒళ్లు కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించీ, జనసేన గురించీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆయన ఎవరో ఒకరితో ప్రయాణించక తప్పదనీ అన్నట్లు ఈ కొవ్వెక్కిన నేతలు ప్రచారం చేస్తున్నారు. జనసేన ఇపుడు ప్రజల గుండెల్లో ఉంది. ఆ ప్రకంపనలు ప్రత్యర్థులను భయపెడుతున్నాయి. మానసికంగా నిద్రలేకుండా చేస్తున్నాయి. అందుకే దుష్ప్రచారాలకు దిగుతున్నారు. 

       అధికార, విపక్ష పార్టీలు ఇలా బురద చల్లడానికి ప్రయత్నించడమే జనసేన భావి విజయానికి ప్రతీకలు. కుట్రల రూపంలో అవి ప్రతిఫలిస్తాయి. ఫర్వాలేదు. అవమానాలూ, అడ్డంకులూ, కుట్రలూ లేకుండా విజయం సిద్ధించదు. మానవ పురోగతిలో జగజ్జేతల ప్రయాణం ఇలాగే ఉంటుంది. ఎన్ని ఐతిహాసిక కథల్లో చూడలేదు? చివరికి అంతిమ విజయం ధర్మానిదే. నిజాయితీదే. ప్రజలదే!!



పవన్ అమెరికా వెళ్లినపుడు తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు అయిపోయాయని… కాపుల ఆకాంక్షలు ఇప్పటిలో తీరేవి కాదని… కాపు సామాజిక వర్గం చేతనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు. కాపుల చేతి చెప్పిస్తే… కాపులు నమ్ముతారు.. కాపులు చెబితే… మిగిలిన వర్గాలూ నమ్ముతాయి. ప్రజారాజ్యం సమయంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. పక్కనే ఉండి.. పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడిచారు. ఇపుడు జనసేన లోపల ఉండి కుట్రలు చేయడానికి అవకాశంలేక బయట నుంచే రాళ్లు విసురుతున్నారు. 

    పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు.. మీరు అణచివేయాలని చూస్తున్నది పవన్ కళ్యాణ్ ఒక్కరినే అనుకుంటే మీరు తప్పు. మీరు అణచివేయాలని చూస్తున్నది 90 శాతం మంది ప్రజల ఆకాంక్షల్ని! పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు!! యుగ యుగాలుగా పొగిలి పొగిలి ఏడుస్తున్న బడుగు బలహీనుల గొంతుక.

గత 70 సంవత్సరాలు 2 సామాజిక వర్గాలు రాజకీయ అధికారాన్ని అంటిపెట్టుకుని లక్షల కోట్లను వెనకేసుకున్నాయి. సామాన్యుడి తిండికి లేక, పిల్లలకు ఉద్యోగాలు లేక, వ్యవసాయం లేక.. కునారిల్లుతుంటే.. ఆ పేద వర్గాల రక్తం పీల్చి.. ప్రజా ధనాన్ని దోచుకుని ఉన్నవాడు కోటలు, ఆకాశహర్మ్యాలు కుట్టుకుంటూ 90 శాతం మంది ప్రజల్ని చెప్పుకింద తొక్కి పెట్టి ఉంచారు.


         70 ఏళ్ల ఈ ఆధిపత్యాన్నీ, 70 ఏళ్లుగా వారు అనుభవిస్తున్న అధికారాన్నీ బద్ధలు కొట్టడం… ఒకనాడు స్వాంతంత్ర్యం కోసం జరిగిన పోరాటానికి ఎంత మాత్రం తక్కువ కాదు. అప్పట్లో ఇంగ్లిషు దొరలతో పోరాడితే.. ఇపుడు నల్ల  నియంతలతో పోరాడుతున్నాం. పాము తన పిల్లల్ని తానే తినేస్తుందన్న సామెత చందాన.. మన పెట్టుబడిదారీ పార్టీలూ, ఆయా నేతలూ బడుగు బలహీన వర్గాల ఆకాంక్షల్ని తమ ఆధితప్యంతో నలిపేశారు. సమాన అవకాశాలు ఇవ్వకుండా బూటుకాళ్లతో తన్నారు. 

        కాకి పెట్టుకున్న గుడ్లను పాము తినేసిన చందం. సహజ వనరుల్ని చెరబట్టారు. కృష్ణానదినీ చెరబట్టారు. కొన్నాళ్లకు నదికి కోపం వస్తుంది. అందరినీ ముంచుతుంది. అందులో శక్తికి మించి ప్రజా ధనాన్ని మెక్కేసి కక్కుకుంటున్న పెట్టుబడిదారీ నేతలు కూడా ఉంటారు. వాళ్లూ కొట్టుకుపోతారు. ప్రజలే నదీరూపాన్ని సంతరించుకుంటారు. నది శాపం ఊరికేపోదు. ధరిత్రిని కొల్లగొట్టిన ఘనులకు భూమాత శాపం తగులుతుంది. అది ప్రజాగ్రహ రూపంలో భూమి పొరల్లోకి తొక్కేస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. కాళ్ల కింద భూమి పొరలు కదులుతున్నాయి.


             నిజానిక పవన్ కళ్యాణ్… వెండితెరపై ఎంతోకాలం హీరోగా ఉండలేడు. అతని మనసంతా సమాజంలో ఉంది. అందుకే రాజకీయాల్లో దూకేశాడు. ఇక వెనుదిరిగేది లేదు. 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఈ విషయాన్ని జనసేనని కూడా ప్రకటించి మంచి పని చేశారు. అయినా.. అయినా ప్రత్యర్థుల కుట్రలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతిసారీ… జనసేనాని వివరణ ఇవ్వక్కర్లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆయనకు కూడా హక్కు లేదు. అది జన సైన్యానిదే. ఎవరు ఏమన్నా… ఎన్ని పుకార్లను ప్రచారం చేసినా…పవన్ కళ్యాణ్ అన్నట్లు సోషల్ మీడియా ద్వారానే అబద్ధాలను శిరచ్ఛేదం చేయండి. 

           దుష్టశక్తుల కుయుక్తులకు వత్తాసు పలికే కిరాయి వెబ్ సైట్లు, కిరాయి పత్రికలూ ఎప్పుడూ ఉంటాయి. ఒక దేశానికి విముక్తి కలిగించే సమయంలో బొలీవియన్ యుద్ధ వీరుడు చేగువేరాపై ఎన్నో కుట్రలు జరిగాయి. ప్రజాస్వామ్యం ముసుగులో అంతకు వంద రెట్లు కుట్రలు జరుగుతాయి. విముక్తి కోసం వచ్చే ఉద్యమ బాలుడి రాక మామూలుగా ఉండదు. ఎన్నో మార్పులు వస్తాయి.  బహుశా చరిత్ర అందుకు ఒక వీరుడుని ఎంచుకున్నది. చరిత్ర నిర్ణయించుకున్న తర్వాత.. దుష్టశక్తులు గాలిలో కొట్టుకుపోతాయి. జన సైన్యమా విజయోస్తు!!

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్