పవన్ నైతికతకు సాక్ష్యం !
విలువలు కలిగిన రాజకీయాలు చేయడమే తన ఉద్దేశ్యమని మొదటి నుండి చెబుతున్న
పవన్ ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. పదవిలో ఉన్న ఎమ్మెల్యే తన పార్టీలో
చేరతానంటే ఏ అధ్యక్షుడైనా సాదరంగా ఆహ్వానిస్తాడు. ఎందుకంటే తన బలం
పెరుగుతుంది కాబట్టి. కానీ అదే సమయంలో ఎమ్మెల్యేను కోల్పోయిన పార్టీ నుండి
అక్రమ ప్రలోభాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈరోజుల్లో ఈ ఆరోపణలను ఏ పార్టీ కూడా సిగ్గుపడటం లేదు.
అందుకు ఉదాహరణే గత ఎన్నికల తర్వాత వైకాపా నుండి ధారాళంగా ఎమ్మెల్యేలు
టీడీపీలోకి వెళ్లిపోవడం. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ పలుసార్లు టీడీపీ
సంతలో పశువుల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది అంటూ
విమర్శించారు. ఆ విమర్శలకు కట్టుబడే ఇతర పార్టీల నుండి తన పార్టీలోకి
వచ్చే ఎమ్మెల్యేలను వారి పదవులకు రాజీనామా చేసే రావాలని కట్టుబాటు
పెట్టారు.
అందుకు అనుగుణంగానే బీజేపీకి చెందిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల
సత్యనారాయణ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఈరోజు
పవన్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారు. సత్యనారాయణ పదవీకాలం ఉండేది
ఇంకొద్ది నెలలే అయినా చెప్పిన మాటకి కట్టుబడి పవన్ వ్యవహరించడం అభినందనీయం.
ఇక బీజేపీ సైతమ్ ఈ విషయంలో నోరు మెదపలేకపోతోంది. పవన్ అనుసరిస్తున్న ఈ
విధానాన్ని చూసి జనసేన శ్రేణులు విలువలు, నైతికత కలిగిన రాజకీయాలంటే ఇవే
అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.
Comments
Post a Comment