జనసేన పై పవన్ అభిమానులు ఊహించని చంద్రబాబు సరికొత్త అస్త్రం..?

 

      గత కొంత కాలంగా పవన్ తెలుగుదేశం పార్టీతో విభేదించి ఏ స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.పవన్ పూర్తిగా తెలుగుదేశం మరియు చంద్రబాబుతో సంబంధాలు తెంచేసుకున్నా సరే గత రోజులుగా పవన్ ఇంకా వారితోనే కలిసి ఉన్నారని పదే పదే చెప్తున్నారు.ఇప్పటికే పవన్ వామపక్షాలతో తప్ప మరెవ్వరితోను కలిసి తాను పోటీ ఎన్నో సార్లు చెప్పారు.అయినా సరే తెలుగు తమ్ముళ్లు మరియు చంద్రబాబు మాత్రం పవన్ ను వదలట్లేదు.అయితే పవన్ వద్దంటున్నా సరే ఆయన్ని వదలకపోవడం, దీని వెనుక చంద్రబాబు పవన్ అభిమానులు ఊహించని విధంగా మాస్టర్ ప్లాన్ వేసారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.
నిజానికి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యంలో అయితే లేరు.కానీ చంద్రబాబు మరియు పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య నేతలు టీడీపీ మరియు జనసేన లు కలిసిపోతున్నాయని చెప్పడం వెనుక ఇక్కడే ఒక మర్మం దాగి ఉంది.

పదే పదే తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ పై ఇలాంటి అసత్య ప్రచారం చెయ్యడం వలన పవన్ అభిమానుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించి ఇంకా పవన్ వారితోనే రహస్య పొత్తు పెట్టుకున్నారన్న వార్తను వారిలోకి బలంగా తీసుకెళ్తే వారిని ఒక పక్క మభ్య పెట్టిన వారే కాకుండా వైసీపీ పార్టీ వారు కూడా బలంగా ప్రజల్లోకి బాబు మరియు పవన్ లు కలిసే ఉన్నారని తీసుకెళ్తారు.

ఆ విధంగా చేస్తే పవన్ కు వచ్చే ఓట్లు అలాగే తటస్థుల్లో పవన్ ని నమ్మే వాళ్ళ ఓట్లు జనసేనకు పడకుండా ఉంటాయి.అందువల్ల వారి పార్టీకి పెద్దగా నష్టం రాకపోయినా జనసేన పార్టీకి గట్టి దెబ్బ తగులుతుంది.

అందువల్లనే చంద్రబాబు పదే పదే పవన్ మాతోనే ఉన్నారు,మేము కలిస్తే తప్పేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ఒక పక్క జనసేన శ్రేణులను మరో పక్క తటస్థుల్లో పవన్ పై ఉన్న భావనను తప్పు బట్టించాలన్నదే ప్రధాన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

Comments