హైపర్ ఆదిపై వైకాపా కార్యకర్తల దాడి !

 

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న నటుడు హైపర్ అది గత కొంత కాలంగా జనసేనను, పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ వదిలి జనం కోసం రాజకీయాల్లోకి దిగిన పవన్ అంటే తనకు ఇష్టమని, ఏది ఏమైనా ఆయనకే తన సపోర్ట్ అనే ఆదిపై సోషల్ మీడియాలో ఇతర పార్టీల అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు ఆ పరిమితి దాటిపోయి భౌతిక దాడులకు కూడా దిగుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో ఆదివారం జరిగిన జనసేన సభకు హాజరయ్యారు.
సభా వేదికపైకి ఆయన రాకముందే మాట్లాడిన కొందరు జనసేన నేతలు వైఎస్ జగన్ ను విమర్శించడంతో అక్కడే ఉన్న వైకాపా కార్యకర్తలు నిరసన స్టార్ట్ చేశారు. అదే సమయానికి అక్కడ చేరుకున్న హైపర్ ఆది కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. 


అయినా వెనక్కు తగ్గని ఆది కార్యకర్తల సాయంతో స్టేజి మీదకు చేరుకొని కులం చూసి ఓట్లు వేయడం కాదని నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవాలని, పవన్ కళ్యాణ్ కు డబ్బు, పదవి మీద ఆశ లేదని అందుకే జనం కోసం వచ్చారని, ఈ నాలుగు నెలలు ఎక్కడి వెళ్లినా మనపై ఇలాంటి దాడులు తప్పవని అన్నారు. ఆయన మాటలతో ఇంకొంత రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు విచక్షణ మరిచి సభా స్థలిలో గందరగోళం సృష్టించారు. అక్కడే ఉన్న పోలీసులు సైతం గొడవను ఆపేందుకు గట్టిగా యత్నించకపోవడం గమనార్హం.

Comments

Popular posts from this blog

జనసేన పైన జగన్ రహస్య సర్వే

‘వంతాడ’ను మింగేశారు..............వంతాడ కుంభకోణం

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్