రాజ‌కీయ ప్ర‌క్షాళ‌నే ధ్యేయంగా జ‌న‌సేనాని ఆలోచ‌న‌!


 

త‌ప్పు చేస్తే అధినేత‌నైనా ప‌ద‌వి నుంచి త‌ప్పించే హ‌క్కు కార్య‌క‌ర్త‌ల‌కు వుండేలా కొత్త రాజ‌కీయ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నామ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. జ‌న‌సేన‌కు జ‌న‌సైనికులే ప్ర‌ధాన బ‌ల‌మ‌ని, రాత్రికి రాత్రి ఆ బ‌లాన్ని వ్య‌వ‌స్థ‌గా మార్చేయ‌లేమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.


 విశాఖ‌ప‌ట్నంలోని ఓ రిసార్ట్‌లో శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ మార్పు, జ‌న‌సేన విధానాల ప‌ట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మిగ‌తా పార్టీలు రాజ‌కీయంగా బ‌లంపుంజుకున్నాయ‌ని, ఇప్పుడిప్పుడే జ‌న‌సేన బ‌లం పెరుగుతోంద‌ని వ్యాఖ్యానించారు.
రాజ‌కీయ వ్య‌వ్థ‌లో స‌మూల మార్పుల కోసం ఈ కొత్త విధానాన్ని అమ‌లు చేయ‌బోతున్నామ‌ని, ఇందుకు కొంత‌ మంది స‌భ్యుల‌తో క‌మిటీల‌ను నియ‌మిస్తున్నామ‌ని తెలిపారు. మేధావుల‌కు పార్టీలో స్థానం క‌ల్పించ‌డం కోసం ఆలోచ‌న‌లు చేస్తున్నామ‌ని, పార్టీలో ఎవ‌రు త‌ప్పు చేసినా ఏపేక్షించేది లేని, చివ‌రి నేనే త‌ప్పు చేసినా పార్టీ నుంచి బ‌య‌టికి పంపించే విధంగా పార్టీ విధానాల‌ను త‌యారు చేప్తున్నామ‌ని వెల్ల‌డించ‌డం ఆసక్తిక‌రంగా మారింది. 

అలాగే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్లమెంట్ ఎన్నిక‌ల కోసం ఒక్కో పార్ల‌మెంట్ స్థానం కోసం 11 మంది స‌భ్యుల‌తో ప్ర‌త్యేకంగా క‌మిటీలను ఏర్పాటు చేయ‌బోతున్నాం. వీటి కాల‌ప‌రిమితి నాలుగు నెల‌లు మాత్ర‌మే వుంటుంది అన్నారు. ఇక సామాన్యుడితో అధినేత పార్టీ నిర్మాణం వుండాల‌నేది నా సంక‌ల్పం. అందుకు త‌గ్గ‌ట్టుగానే పావులు క‌దుపుతున్నాం.. అని తెలిపారు. 


ఈ సంద‌ర్భంగా టీడీపీపై ప‌వ‌న్ విరుచుకుప‌డ్డారు. ఎన్నో ఏళ్లుగా ప‌రిష్కారానికి నోచుకోని ఉద్ధానం కిడ్నీ స‌మ‌స్య‌ను టీడీపీ ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించ‌లేక‌పోయింద‌ని, వారికి స్వ‌చ్ఛ‌మైన నీటిని అందించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డారు. అయితే రాత్రికి రాత్రి మేము ఏదో చేస్తామ‌ని చెప్ప‌డం లేద‌ని, భావిత‌రాల మార్పు కోసం రాజ‌కీయ ప్ర‌క్షాళ‌న మాత్రం క‌చ్చితంగా చేసి తీర‌తామ‌ని తేల్చి చెప్పారు.

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్