యువ శక్తి.. జనసేన ఆశ.. శ్వాస!!

- అపోహల్ని వీడండి..నమ్మకం ఉంచండి
- జనసేనాని చెబితేనే అది నిజం
- మీడియా చెప్పింది కదా అని నమ్మేయకండి
- ఇది రెండో స్వంతంత్ర పోరాటం
- మార్పు తధ్యం.. అంతిమ విజయం యువతదే......పవన్ కళ్యాణ్
విజయవాడ: పవన్
కళ్యాణ్ ఇలా ఎందుకు చేస్తున్నారు? అలా ఎందుకు చేస్తున్నారు? అన్న
అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలోనూ ఈ తరహా
అనుమానాలు ఉన్నాయి. ఇహ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధినేత
జగన్మోహన్ రెడ్డి… సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం పతాక స్థాయికి
చేరుకున్నది. దీంతో అనేక అనుమానాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి
వెళ్లిపోతున్నాయి.
175 సీట్లకూ పోటీ చేస్తున్నామని, దీనికి సంబంధించి
అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని పవన్ కళ్యాణ్
స్పష్టంగా చెప్పే వరకూ అందిరిలోనూ ఒక ఆందోళన నెలకుని ఉండింది. పవన్ కళ్యాణ్
ఇంత స్పష్టంగా చెప్పినా… ఇదే విషయాన్ని ఈ రోజు కూడా కొందరు వ్యక్తం చేయడం
మా దృష్టికి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేస్తే తప్పేంటి
అంటూ నర్మగర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలు వెళ్లినంత ఇదిగా… ‘‘లేదు, మేం
ఒంటరిగానే పోటీ చేస్తున్నాం’’ అంటూ పవన్ చెప్పిన వివరణ ప్రజలందరికీ
చేరలేదు.
జనసేనపై
అపోహలు కల్పించే బాధ్యతలను తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నేతలు… ఆయా
పార్టీల్లోని కాపు నేతలకే అప్పగించాయి. దీంతో వారే తమ ప్రైవేటు సంభాషణల్లో
జనసేనపై అపోహల్ని తయారు చేసి ప్రజల్లోకి వెళ్లేలా చూస్తున్నారు. ‘‘చిరంజీవి
అంటే మేం ప్రాణం ఇస్తాం’’ అన్న వాళ్లే ప్రజారాజ్యం సమయంలో వెన్నుపోటు
పొడవడాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ చూశారు. అలనాటి అనుభవాలను దృష్టిలో
ఉంచుకునే నేడు పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని మాకు
అర్థం అవుతున్నది.
ఆయన ఏ పని చేసినా… అనుమానంతో చూడాల్సిన పని లేదు.
వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్లాలి. పాత తరం నేతల మెదళ్లు కుళ్లుతో
నిండిపోయి ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెసులో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి తాజాగా
వైఎస్సార్సీపీతో కలవడానికి సిద్ధమంటూ ప్రకటించడం సిగ్గుచేటు వ్యవహారం.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. అంటే నేతలు సిగ్గులేకుండా పార్టీలు
మారిపోతామని చెబుతున్నారు.
వారు కోరుకునేది ఒక్కటే… కోట్లు
సంపాదించుకోవడానికి పదవులు ఇవ్వాలి. కాంట్రాక్టులు సంపాదించుకునేందుకు మంచి
మంచి అవకాశాలు ఇవ్వాలి. అందుకే తెలుగుదేశంలో ఉన్న నేతలు చంద్రబాబును
కామథేనువు అని పొగుడుతున్నారు. చంద్రబాబు ఎవరిని తిట్టమంటే వారిని అదే
పనిగా తిడుతుంటారు. ఈ డూడూబసవన్న నేతలు జనసేనలోకి రాకపోతే ఏమిటి నష్టం?
ప్రజల కోసం పని చేసే వారే వస్తారు.
50 ఏళ్ల వయసు దాటిన తర్వాత.. ఈ
ప్రపంచాన్ని మార్చలేమని, ఉన్న సమయంలో ఓ వంద కోట్లు వెనకేసుకుంటే చాలని
అనుకుంటారు. వారంతా రాకపోవడమే జనసేనకు మంచిది. యువత అలా కాదు. వాళ్ల మనసులు
అప్పుడే కల్మషం కావు. అందుకే వాళ్లు దూకుతారు. పరవళ్లు తొక్కుతారు.
జనసేనకు ఇపుడు కావాల్సింది ఖాళీ పలకలా ఉన్న మెదళ్లే. పవన్ వారికి
దిశానిర్దేశం చేస్తాడు. ప్రజా సేవలో వారిని నిమగ్నం చేస్తాడు.
కొత్త తరం
రాజకీయ నాయకులు వస్తారు. వచ్చిన వారిలో 10 శాతం మెరికల్లా.. నిజమైన
సైనికులుగా పని చేసే వారు వస్తే… సమాజానికి ఆ 10 శాతం మేలైనా జరుగుతుంది.
ఇది చాలదా మార్పు తేవడానికి? అందుకే ఆయన నేతల్ని గంపగుత్తగా తెచ్చుకోవాలని
ఉబలాటపడటం లేదు. తెలుగుదేశం పార్టీగానీ, వైఎస్సార్సీపీగానీ, కాంగ్రెసు
పార్టీకిగానీ… ఒక సిద్ధాంతం ఏముంది? అన్నీ కాంట్రాక్టర్లతో నిండిపోయిన
పార్టీలు. ఆయా పార్టీల నుంచి వచ్చే నేతలు కొత్తగా సాధించేదేమిటి? సమాజాన్ని
మారుద్దాం రండి… అంటే వారు నవ్వుకుంటారు. సమాజాన్ని మార్చడం అసాధ్యం అని
అనుకుంటారు.
రతన్
టాటా… టాటా సంస్థల సారధ్యాన్ని చేపట్టిన యుక్త వయసులో ఆయన అప్పటి వరకూ ఉన్న
వృద్ధ సీనియర్ ఉద్యోగుల్ని ఒక్క సంతకంతో ఇంటికి పంపేశారు. వాళ్లంతా
ఆశ్చర్యపోయారట. ‘‘మీ నాన్నగారు ఉన్నప్పటి నుంచీ ఉంటున్నాం.. మా ముందు మీరు
లాగులు వేసుకుని తిరిగారు. మమ్మల్ని తీసేస్తారా?’’ అని అన్నారట. రతన్ ఏం
చెప్పారో తెలుసా? ‘‘నేను యువకుడిని. నేను ఏం చెప్పినా చిన్నవాడివి.. నీకు
తెలియదు అని మీరు చెబుతారు. కంపెనీని ముందుకు తీసుకెళ్లాలంటే నాపై నమ్మకం
ఉండటం ముఖ్యం. నన్ను నమ్మనపుడు నేను చెప్పిన పనిపైనా నమ్మకం ఉండదు’’ అందుకే
తీసేశాను అని సమాధానమిచ్చారు.
ఈ
ఉదాహరణను ఆచరాణాత్మకమైనదిగానే ఉంది కదా. ఇదే జనసేనకు కూడా వర్తిస్తుంది.
సీనియర్ నాయకులు రావడం వల్ల పవన్ కు ఉపయోగం లేదు. జనసేనానిగా పవన్ చెప్పిన
ప్రతి మాటపైనా యువతీయువకులకు నమ్మకం ఉంటుంది. ‘‘ఆంధ్రలో పవన్ రావాలి. ఆంధ్ర
రాజకీయాలు మారాలి సార్. కుళ్లిపోయిన రాజకీయాలను మార్చగలిగేది ఆయన ఒక్కడే’’
అని 25 ఏళ్ల ఒక టాక్సీ డ్రైవర్ ఈ రోజు ఉదయమే మాతో చెప్పాడు. అవును.
యువకులే పవన్ పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. యువత జనసేన బలం. ఆ బలం చాలు,
పవన్ అనుకున్నది సాధించడానికి.
ఇది
రెండో స్వాతంత్ర్య పోరాటం. కొత్త వెలుగుల కోసం జరిగే పోరాటంలో యువత
భాగస్వాములు అవ్వండి. కేవలం కాంట్రాక్టర్ల కోసం పని చేస్తున్న పార్టీలను
చెత్తకుప్పలోకి విసిరేయండి. యువత కోసం యువతే ఉద్యమించే సమయమిది. నియంతల
పాలనను తుంగలో తొక్కాల్సిన సమయమిది. 70 ఏళ్ల కులాధిపత్యానికి చరమగీతం
పాడండి. మీ పాలన… ఇక మీ చేతుల్లో ఎంతో దూరంలో లేదు.
ఓ
డజను మంది తెల్లజుట్టు రాజకీయ నాయకులు వస్తే… నిజంగానే అందరి కళ్లకూ
ఇంపుగా ఉంటుంది. కానీ దానివల్ల ఇంపు కంటే తర్వాత జరిగే కంపు ఎక్కువ
అవుతుంది. అందువల్ల జనసేన అభిమానులు, కార్యకర్తలూ తెలుసుకోవాల్సింది
ఏమంటే.. యువ రక్తంతో పార్టీ పరుగులు తీస్తోంది. అది చాలు. అభిమానం ఉన్న
వృద్ధ తరం ఉంటే… యువతను జనసేన వైపు వెళ్లాల్సిందిగా ప్రోత్సహిస్తే
సరిపోతుంది. ఏమంటారు?
Comments
Post a Comment