పూనమ్ కౌర్ అస్త్రం సిద్ధం..

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్షాలు
నువ్వా-నేనా అన్నట్టి తమదైన వ్యూహాలతో అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ
ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నేపధ్యంలో ఎవరు ఎవరితో
పొత్తు పెట్టుకోనున్నారనే అంశం పై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున
చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ
ఎవరితో పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధినేత
జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మరోవైపు జనసేన వామపక్షాలతో
తప్పా, ప్రధాన పార్టీలతో పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ ప్రకటించారు.
ఇక అధికార టీడీపీ మాత్రం జనసేనతో పొత్తు కోసం తహతహలాడుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని రాజకీయార్గాల్లో జోరుగా ప్రచారం
జరుగుతోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పవన్ కళ్యాణ్‌తో
పొత్తు పెట్టుకుంటే మరోసారి అధికారంలోకి వస్తామని, పవన్ కళ్యాణ్‌తో
దోస్తీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం,
టీడీపీతో పొత్తు పెట్టుకునే చాన్సే లేదని చెబుతున్నారు.
దీంతో టీడీపీతో
పవన్ ఒప్పుకుంటే ఓకే లేకపోతే.. పవన్‌ను బద్నామ్ చేయడానికి అస్త్రాలు
సిద్ధం చేస్తుంది. ఇప్పటికే పవన్ మూడు పెళ్లిళ్ళు ఆయనకు పెద్ద
మైనస్‌గా మారింది. మరోవైపు కొన్నాళ్ళ కిందట.. పూనమ్‌కౌర్, పవన్‌ను
టార్గెట్ చేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పుడు పవన్ పై మరోసారి ఈ అస్త్రాన్నే(పూనమ్‌కౌర్)
ప్రయోగించాలని భావిస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా
ప్రచారం అవుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. అందుకోసం
ఇప్పటికే కొందరు నేతలు పూనమ్‌తో చర్చలు జరిపారని, ఆమె సై అంటే
అడిగినంత(కోట్లల్లో) ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. మరి ఇప్పటికే
పవన్ అంటే రగిలిపోతున్న పూనమ్ ఆ ఆఫర్‌ని ఒప్పుకుంటుందా అనేది ఇప్పుడు
రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరి తన అన్నిటికీ సిద్ధపడే
రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న పవన్ కళ్యాణ్, పొత్తు విషయంలో
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఒకవేళ మళ్ళీ తనని పూనమ్ టార్గెట్
చేస్తే పవన్ ఎలా ఎదుర్కొంటారు అనేది ఆశక్తికరంగా మారింది.
Comments
Post a Comment