సర్వేల పేరుతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్..టార్గెట్ జనసేన..!
గత కొంత కొన్ని నెలల నుంచి సర్వేల పేరిట జనసేన పార్టీకు సంబందించిన ఓట్లు తీయించేస్తున్నారని రకరకాల
వార్తలొచ్చాయి.ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి వార్తలే వస్తున్నాయి.ఈ సారి
మాత్రం సరికొత్తగా సర్వేలు చేస్తున్నామని కొంత మంది మహిళలు వచ్చి ఎవరైతే
తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో వెయ్యట్లేదో వారి వారి వివరాలను
కూలంకషంగా తీసుకొని ఆ తర్వాత వారి ఓట్లు తొలగించేస్తున్నారని తెలుస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లాలో సర్వేల పేరిట వచ్చి జనసేన ఓట్లు గల్లంతు చెయ్యడం కలకలాన్ని రేపుతోంది.కృష్ణ జిల్లా నందిగామలో
ఇద్దరు మహిళలు వచ్చి మీరు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి
ఓటేద్దామనుకుంటున్నారు,ఒకవేళ వారిలో ఎవరైనా తెలుగుదేశం కాకుండా జనసేన గాని చెప్తే వారి వివరాలను పూర్తిగా తీసుకుంటున్నారట. దానితో అక్కడి
పోలీసులకు అనుమానం వచ్చి వారిద్దరిని పట్టుకొని అక్కడి స్థానిక పోలీసు
స్టేషన్ లో అప్పగించారు.ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తీవ్ర
వ్యతిరేఖత వస్తుంది.ఇప్పుడు ఇలాంటి పనులు బయటపడుతుండడంతో చంద్రబాబుకి మరియు
తెలుగుదేశం పార్టీకి ఇంకా పెద్ద దెబ్బ అవుతుంది.

Comments
Post a Comment