టీడీపీకి షాకిచ్చే విధంగా జనసేనకు ఓట్లు చీలుతున్నాయా..!?

ఏపీ రాజకీయాల్లో పవన్ ముఖ్య పాత్ర పోషించబోతున్నారని ఇప్పటికే అందరికి
అర్ధమయ్యింది.అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుకి ఎట్టి
పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణే కారణమని కూడా అందరికి తెలుసు.ఆ తర్వాత జరిగిన
పరిణామాల రీత్యా పవన్ తెలుగు దేశం పార్టీ తో విభేదించి తన పార్టీ
కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.
అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ పట్ల కూడా
ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత భావాన్ని కూడా తీసుకొచ్చారు.పవన్ వలన వచ్చే
ఎన్నికల్లో వైసీపీ పై పెద్దగా ఎలాంటి ప్రభావం పడకపోయినా తెలుగుదేశం
పార్టీకి మాత్రం వారు ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయని తెలుస్తుంది.
పవన్ వలన టీడీపీకి ప్రత్యక్షంగా చీలే ఓట్లు వేరు అలాగే పరోక్షంగా చీలే
ఓట్లు వేరే అని తెలుస్తుంది.ఇందులో ప్రత్యక్షంగా అయితే గత ఎన్నికల్లో పవన్
వలన ఓట్లు వేసిన తటస్థులు ఇప్పుడెలాగో మంచి ఆప్షన్ చూసుకున్నట్టయితే పవన్
కే మళ్ళీ ఓట్ వేసేందుకు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు
అంటున్నారు.
అలాగే ఇక్కడే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే జనసేనకు అత్యధికంగా
సీక్రెట్ ఓటింగ్ పడబోతోంది అని తెలుస్తుంది.అంటే అప్పటి వరకు తెలుగుదేశం
పార్టీలోనే ఉంటూ ఎన్నికల సమయంలో జనసేనకే వారు ఓటేస్తారని తెలుస్తుంది.ఈ
ప్రభావం కేవలం ఒక్క చోట మాత్రమే కాకుండా అన్ని చోట్ల ఉంటుందని కూడా
తెలుస్తుంది.
Comments
Post a Comment