ఉండవల్లి మీటింగుతో వైసీపీ,బీజేపీ ఫెవికాల్ బంధం తెలిసిపోయింది..!?

 

ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన మీటింగు పై ఇప్పటి నుంచే కొన్ని భేదాభిప్రాయాలు వస్తున్నాయి.నిజానికి ఉండవల్లి ఏపీ లో ఉన్న అన్ని పార్టీల వారికి ఈ మీటింగుకు రావాలని ఆహ్వానం పంపారు.కానీ వైసీపీ,బీజేపీ మరియు కొన్ని ఇతర పార్టీలు ఈ మీటింగులో మిస్సయ్యాయి.దీనితో ఇప్పుడు సరికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.గత కొంత కాలం నుంచి వైసీపీ మరియు బీజేపీ పార్టీలు కలిసే ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది.
దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత తులసి రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.బీజేపీ నేతల మనసులకు తెలుసనీ వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని,ఇక వైకాపా విషయానికి వచ్చినట్టయితే పైకి ఏం చెప్పినా బయటకి నాటకాలు ఆడుతుంది అని, వారు బీజేపీ కి ఒక “బి” టీమ్ అని సంచలనం సృష్టించారు.ఒకవేళ వీరు ఈ మీటింగుకి హాజరయినట్టైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కోపం రాకూడదన్న కారణంతోనే వారు వచ్చి ఉండరని,దీని ద్వారా ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఫెవికాల్ బంధం బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు.



Comments

Popular posts from this blog

జనసేన పైన జగన్ రహస్య సర్వే

‘వంతాడ’ను మింగేశారు..............వంతాడ కుంభకోణం

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్