తెలంగాణలోని కొన్ని ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ఎన్నికలు ఎట్టకేలకు ముగిసిపోయాయి.అయితే ఎక్కడైనా ఎన్నికల ముందు ఒకరి పార్టీల మీద ఒకరు వారి యొక్క బలాబలగాలను తెలుసుకునేందుకు సర్వేలు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సర్వేలు చేయించుకుంటారని అందరికి తెలుసు.అయితే తెలంగాణలో జాతీయ సర్వేల్లో వచ్చిన ఫలితాల దగ్గర ప్రాంతీయ నేతలు చేయించిన సర్వేలు తేలిపోయాయి.కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల దగ్గరకి వచ్చింది.ఇంకా కొన్ని నెలలు మాత్రమే గడువు మిగిలి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీలు వారి పార్టీని ప్రజల్లో నిలిపిందేకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలా చూసుకున్నా మూడు ముఖ్య పార్టీలే ప్రజలకు కనిపిస్తున్నాయి.దానికి తోడు “జనసేన” పార్టీ మీదనే అందరి కళ్ళు ఉన్నాయి.పవన్ కు ఎలాగో ప్రజాధరణ ఎక్కువే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పవన్ చాలా బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు పవన్ ని...
ప్రశ్న: కాపులకు రిజర్వేషన్ల అవసరం ఏంటి ? జవాబు: బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో 1915 నుంచే కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉండేవి. ఆ రోజుల్లో దళితులకు, గిరిజనులకు, మూడో కేటగిరిలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవి. వాటిని తొలగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తే డాక్టర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ అడ్డుకున్నారు. వారి కృషి వల్ల ఆ రిజర్వేషన్లను తొలగించకుండా బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసివేయాలనుకున్నారు. తీసివేశారు. ఆ తర్వాత 1961లో అప్పటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 'కాపులకు గోచీలు కూడా ఉండవే. వీళ్లు ఓసీలేంటి? వీళ్ల బతుకులు ఓసీ బతుకులా? చాలా కష్టాల్లో ఉన్నారు' అని అంటూ ఓ జీవో ద్వారా రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించారు. అవి 1966 వరకూ కొనసాగాయి. ఆ తర్వాత పునరుద్ధరించాలని కోరుతూ మా పెద్దలు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పోరాటాలు చేసి.. రోడ్డు మీదకి వచ్చీ అలసిపోయారు. లాఠీల దెబ్బలు తిన్నాం. బూటు కాళ్లతో తన్నించుకున్నాం. కేసులు పెట్టించుకున్నాం.
ప్రశ్న: నాకు ఓటరు గుర్తింపు కార్డు లేదు. నేను ఓటు వేయవచ్చా? సమాధానం: ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే మీకు సంబంధించిన, ప్రభుత్వం గుర్తించిన వేరే గుర్తింపు కార్డులను పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయోచ్చు. ప్రశ్న: పోలింగ్ బూత్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవచ్చు? సమాధానం: ఎన్నికల తేదీ కంటే ముందే అధికారులు మీకు ఓటరు స్లిప్లను అందిస్తారు. అందులో మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రం వివరాలు ఉంటాయి. ప్రశ్న: ఓటర్ల జాబితాలో నా పేరు ఉందా లేదా ఏలా తెలుసుకోవాలి? సమాధానం: ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు అలాగే, స్థానిక ఎన్నికల కార్యాలయంలో కూడా తెలుసుకోవచ్చు. ప్రశ్న: ఈవీఎంలో ఎలా ఓటు వేయాలి? సమాధానం: ఈవీఎం మీద అభ్యర్థుల పేరు, ఫొటో తో పాటు పార్టీ గుర్తు ఉంటుంది . మీకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన గుర్తు పక్కన ఉండే మీట నొక్కడం ద్వారా ఓటు వేయవచ్చు. ప్రశ్న: నేను ఎవరికి ఓటు వేశానని తెలుసుకునే అవకాశం ఉందా? సమాధానం: ఈవీఎంకు అనుసంధానమై ఉన్న వీవీప్యాట్ ద్వారా మీరు ఎవరికి ఓటు వేశారో చూసుకోవచ్చు. ప్రశ్న: నా ఓటరు ఐడీ కార్డు పోయింది. కొత్తది ఎక్కడ తీసుకోవాలి? సమాధాన...
Comments
Post a Comment