పవన్ పై బాబు సరికొత్త ప్లాన్..ఓకే అంటే సరే లేకపోతే..?

 


ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ ఎప్పుడో చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చి వారి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.పవన్ ఏ స్థాయిలో అయితే తెలుగుదేశం పార్టీ నేతలను విమర్శించారో పవన్ ని కూడా తెలుసుగుదేశం పార్టీ నేతలు అంతకు మించిన స్థాయిలోనే విమర్శలు చేసారు.కానీ ఈ మధ్య మాత్రం మళ్ళీ పవన్ అకస్మాత్తుగా దేవుడిలా కనిపిస్తున్నారట.ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పవన్ అవసరం మళ్ళీ వచ్చేసింది అందుకే మళ్ళీ మెల్లగా పవన్ ను దువ్వడం మొదలు పెట్టారు.
గత కొన్ని రోజులు నుంచి ఎన్నో మీటింగులు పెట్టగా ఒక్క టీడీపీ నేత,చంద్రబాబు కూడా పవన్ ను ఒక్క మాట కూడా అనలేదు.వచ్చే ఎన్నికల్లో ఎలాగో వారు గెలవలేరని అర్ధమయ్యిపోయి ఉంటుంది అందుకే మళ్ళీ పవన్ అవసరం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

బాబు అభ్యర్ధన మేరకు పవన్ సరే అంటే ఒక ప్లాన్ లేకపోతే ఒక ప్లాన్ లో వారు ఉన్నట్టు తెలుస్తుంది.ఎలా అంటే పవన్ మళ్ళీ వారితో దోస్తీ కడితే ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ చేసిన మేలు మర్చిపోలేము,పవనే మాకు దేవుడు అన్న వార్తలు వారికి అనుకూల మీడియా మరియు వార్తా పత్రికల్లో వస్తాయి.

ఒకవేళ పవన్ ఏ మాత్రం రివెర్స్ అయినా రెండో ప్లాన్ వచ్చేస్తుంది.అప్పటి వరకు దేవునిలా కనిపించిన పవన్ దయ్యంలా కనిపిస్తారు.వారి పైడ్ పత్రికలూ న్యూస్ ఛానెళ్లలో పవన్ ఇమేజిని డామేజ్ చెయ్యడానికి మళ్ళీ పెద్ద ఎత్తున రకరకాల డిబేట్లు పుట్టుకొచ్చేస్తాయి.పవన్ అక్కడ డబ్బులు తీసుకున్నారు వీరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్న విష ప్రచారం మొదలవుతుంది అని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.పవన్ ఎలాంటి ముందడుగు వేస్తారో చూడాలి.

Comments

Popular posts from this blog

జనసేన పైన జగన్ రహస్య సర్వే

‘వంతాడ’ను మింగేశారు..............వంతాడ కుంభకోణం

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్