పవన్ సభ గ్రాండ్ సక్సెస్.. క్రెడిట్ గోస్ టూ టీడీపీ !


 

పవన్ కళ్యాణ్ చాలా రోజుల బ్రేక్ తర్వాత నిన్న  పాడేరులో గిరిజనులను ఉద్దేశించి భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. సభ సాయంత్రం జరుగుతుందనగా ఉదయం మీడియాతో టీడీపీ ఎంపి టిజి వెంకటేష్ మాట్లాడుతూ జనసేన , టీడీపీ పొత్తుల చర్చలు త్వరలోనే జరుగుతాయంటూ ఆడుకోడానికి ఆధారం ఇచ్చారు. సరిగ్గా ఆ విషయాన్నే హైలెట్ చేసిన పవన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పెద్దవాడివని కూడా చూడను అంటూ పొత్తు లేదు పక్కకు పొండి అన్నట్టు మాట్లాడారు.
పవన్ హెచ్చరించిన తీరు చాలా ఘాటుగా ఉంది. పవన్ అసలు టీడీపీ కవ్వింపు చర్యలపై స్పందించడని జనసేన శ్రేణులు అనుకున్నాయి. కానీ ఒక్కసారిగా పవన్ ఉరుములేని పిడుగులా విరుచుకుపడిపోవడంతో ఆశ్చర్యపోయారు. రెట్టించిన ఉత్సాహంతో పవన్ వ్యాఖ్యల్ని స్ప్రెడ్ చేసి టీడీపీకి క్షణ క్షణం టెంక్షన్ చూపించారు. 

పవన్ స్పందించిన తీరు చూసి టీడీపీ సైతం షాకైంది. ఏదో పొత్తుల కోసం టీజీ రూపంలో ఒక రాయి వేస్తే ఇతగాడేమిటి తిరిగి నెత్తిన పెద్ద బండ వేశాడని నాలుక కరుచుకుంటున్నారు దేశం నేతలు. పైగా మన్యం సమస్యలపై, గిరిజనుల పట్ల జనసేన విధివిధానాలపై కూడా బాగా మాట్లాడాడు పవన్. మొత్తం మీద నిన్నటి పాడేరు సభ జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపి, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారి గ్రాండ్ సక్సెస్ అయింది.

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్