ఉత్తరాంధ్రలో జనసేన క్లీన్ స్వీప్!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేనాని దూకుడు పెంచారు. తమ
పార్టీకి అత్యంత బలంగా నిలవనున్న ఐదు జిల్లాల్లోని మొత్తం 50 స్థానాలపై
ప్రత్యేక శ్రద్ధపెడుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రజా
పోరాట యాత్ర పేరుతో సుడిగాలి పర్యటనకు పవన్ సిద్ధమయ్యారని జనసేన
వర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజక వర్గాల స్టడీ కోసం పవన్ ప్రత్యేకంగా
ఓ టీమ్‌ను సిద్ధం చేశారని, ప్రస్తుతం ఆ టీమ్ విస్తృతంగా
పర్యటిస్తోందని తెలిసింది.
ఉత్తరాంధ్రలోని గోదావరి జిల్లాల్లో ఇటీవల పవన్ తన పదయాత్రను
విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాజమండ్రి,
అనంతపురంలలో నిర్వహించిన పాదయాత్రకు అక్కడి వారి నుంచి అనూహ్య
స్పందన లభించింది. దీంతో పవన్ తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న
టీమ్ ని మొత్తం 50 నియోజక వర్గాల సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర
నివేదికను తయారు చేయమని కోరారట.
ఈ నియోజక వర్గాల్లో అవినీతికి
పాల్పడిన ఎమ్మెల్యేల పూర్తి వివరాలు సేకరించమని చెప్పడం
ఆసక్తికరంగా మారింది. వాటిని చూపిస్తూ నీతిమాలిన రాజకీయాలని
ప్రక్షాళన చేయడమే జనసేన సిద్ధాంతమని చెబుతూనే ఓట్లు
అడగబోతున్నారని తెలిసింది. పవన్ కొత్త స్ట్రాటజీ వర్కవుట్ అయితే
ఉత్తరాంధ్రలో జనసేన క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Post a Comment