పచ్చ మీడియాకి ఇలా తొక్క తీసారేంటి....నాగబాబు!

గత కొంత కాలం నుంచి మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.బాలకృష్ణతో మొదలు పెట్టి ఇప్పుడు పచ్చ మీడియా చానెళ్లను టార్గెట్ చేసారు.నాగబాబు ఈ మధ్యనే తన పొలిటికల్ కామెంట్స్ ని సెటైరికల్ గా చెప్పబోతున్నానని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మన రాజకీయ నాయకులను ఉద్దేశించి వీడియోలు తీస్తున్న సంగతి తెలిసిందే.

    అలాగే ఈ రోజు కూడా ఒక వీడియో వదిలారు.ఇది మాత్రం ఇప్పటివరకు పెట్టిన వీడియోలతో పోలిస్తే వేరే రేంజ్ అని చెప్పాలి.ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు తుమ్మినా సరే కవర్ చేసే యెల్లో మీడియా ఉందని సంగతి తెలిసిందే.
ఆ మీడియా ఛానెల్లలో బాబు గారికి మరియు ఆయన తనయుడు నారా లోకేష్ కు ఏ స్థాయి కవరేజ్ ఇస్తారో కూడా అందరికి తెలుసు.ఇప్పుడు దానిపైనే నాగబాబు ఒక వీడియోని వదిలారు.ఆ ఛానెల్లలో లోకేష్ ని ఎలివేట్ చేస్తూ ఒక వీడియో,లోకేష్ వల్ల ఏపీకి వచ్చే కంపెనీలను మోడీ గుజరాత్ కు లాగేసుకుంటున్నారని వారు చెప్తుంటే బాగా చెప్తున్నారంటూ..భజనకు వాడే తాళాలు పట్టుకొని భజన చేస్తూ ట్రోల్ చేసారు.

    లోకేష్ బాబు కోసం చంద్రబాబు కోసం ఇలా చెప్తున్నారంటే ఖచ్చితంగా నిజమే అయ్యి ఉంటుందని,ఆ వీడియో మొత్తానికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.అంటూ ఓ రేంజ్ లో ఆడుకున్నారు.ఒకసారి ఆ వీడియో కనుక చూస్తే మీకు కూడా అర్ధమవుతుంది.


Comments

Popular posts from this blog