చీమల దండు కదులుతోంది.. విష సర్పాల్ని చంపి తీరుతుంది..

army ants kills snake | Telugu.newsof9
  •  బలవంతుడ నాకేమని 
  • పలువురతో నిగ్రహించి పలుకుట మేలా 
  • బలవంతమైన సర్పము  
  • చలిచీమలచేత  చిక్కిచావదె సుమతీ!
ఈ పద్యం ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకి  సరిగ్గా సరిపోతుంది. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరితే ఆ పాముల చెర నుండి తమ పుట్టని కాపాడుకోడానికి చీమలు దండు కదిలి ఆ పాములను చంపినట్లుగా, ప్రజా స్వామ్యాన్ని ధన స్వామ్యంగా మార్చి వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న తెదేపా, వైకాపా పార్టీలను, పేదల కష్టంతో కట్టుకున్న ఆ పార్టీ కోట గోడలను బద్దలు కొట్టేందుకు చీమల దండువలె సామాన్య ప్రజానీకం అంతా జనసేనతో కలిసి అడుగేస్తున్నారు .

అందుకే ఈ రెండు పార్టీలకీ వెన్నులో వణుకు మొదలైంది, భయం పట్టుకుంది. అభద్రతా భావం పెరిగిపోయింది. అధికారం ఉంటె నీ దగ్గర ఉండాలి, లేదా నా దగ్గర ఉండాలి, అంతే కానీ మూడో వాడెవడో వచ్చి కుర్చీలో కూర్చుంటే, ఆ కుర్చీ లో కూర్చొని, మన అక్రమాలు అన్నీ బయటపెడితే, మన అవినీతిని బహిరంగం చేస్తే, ప్రజలను చైతన్య వంతులని చేస్తే, మన మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తే ఎలా అనే భయం పట్టుకుంది. 

అందుకే తమకున్న ధన బలంతో, మీడియా బలంతో, బూటకపు సర్వేలతో అవాస్తవాల కథనాలు, అబద్దపు రాతలు, అభూత కల్పనలు, విద్వేషం చిమ్మే విశ్లేషణలు చేయిస్తున్నారు. రోజుకో అబద్దాన్ని, పూటకో బూటకపు వార్తని ప్రజల పై రుద్దుతూ విలువలకు తిలోదకాలిచ్చిన తమ భజన చానల్స్ తో, తమ కర పత్రలతో విష ప్రచారం చేయిస్తున్నారు.

ఎంతైనా డబ్బు కుమ్మరించగల పెత్తందార్లు, బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టే పెట్టుబడీదార్లు, విదేశాల్లో నల్ల ధనాన్ని దాచుకున్న నేతలు,అక్రమార్జనలో రాటు దేలిన నాయకులు, అవినీతికి అలవాటు పడిన నేతలు,షెల్ కంపెనీలతో మోసం చేసే మేతలు, సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న పార్టీ అధ్యక్షులు ఇంత “మంద” బలం ఉన్నా కూడా ప్రజా బలం ముందు తేలిపోతామని గ్రహించి.. రహస్య మంతనాలు సాగించి లోపాయికారీ ఒప్పందాలతో సాగుతున్నట్లు ఉంది.

జరుగుతున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే వైకాపా, తెదేపా లోపాయికారీ ఒప్పందం నిజమే అని అనిపిస్తుంది. దానికి బలం చేకూరుస్తూ ఒకరి తరువాత ఒకరు జనసేన పై విష ప్రచారం చేస్తున్నారు. పదే పదే అవే అసత్య ఆరోపణలు చేయడం. పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎన్నికల విధానాన్ని ఇప్పటికే ఎన్నో సార్లు సుస్పష్టం చేసినా.. మళ్ళీ ఏవేవో విష ప్రచారాలు చేసి ప్రజలను  తికమక పెట్టడం, వారిని గందరగోళానికి గురి చేసి తద్వారా తమలో ఎవరో ఒకరు లబ్ధి పొందాలని చూడడం దేనికి సంకేతాలు?

కేవలం ఎన్నికలు, పదవులు, స్వలాభం మాత్రమే చూసుకునే తెదేపా, వైకాపా వంటి పార్టీలకి వ్యవస్థని ప్రక్షాళన చేయాలని విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి వచ్చిన జనసేన పార్టీ పై కోపం ఉండడం సహజమే, కానీ అది పతాక స్థాయికి చేరి, ఎలా అయినా జనసేన పార్టీని మొగ్గ దశలోనే తుంచేయాలని చేసే ప్రయత్నాలే ప్రజలని విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రజలకి మరో ప్రత్యామ్న్యాయం లేకుండా చేసేందుకు వారిరువురి మధ్య ఉన్న వైరాన్ని సైతం పక్కన పెట్టి కలిసిపోతున్నారు.

కానీ ప్రజలు విజ్ఞత కలిగిన వారు, చైతన్య వంతులు, ఈ రెండు పార్టీలు చేస్తున్న వికృత రాజకీయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. వీరి రాజకీయలతో విసుగు చెందిన ప్రజలు వీరికి తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

చీమల దండు కదులుతోంది… అవినీతి నాయకులు కోట గోడలు కూలే రోజు దగ్గరైంది.

Comments

Popular posts from this blog